కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/92 పేజీ 1
  • యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మీ రాజ్యసేవా సంపత్తిని విస్తృతపర్చండి
    మన రాజ్య పరిచర్య—1994
  • మీ పరిచర్యను విస్తృతపర్చుకునే మార్గాలు
    మన రాజ్య పరిచర్య—1999
  • పయినీరు సేవ—మీరు చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 1/92 పేజీ 1

యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట

1 యెహోవాను సేవించుటకు మనము నిజముగా ఆధిక్యత కలిగియున్నాము. ఆయనను గూర్చియు, ఆయన అద్వితీయ కుమారుడైన యేసును గూర్చియు ఖచ్ఛితమైన జ్ఞానము కలిగినవారమై, ఆయన చిత్తమును సంపూర్ణముగా చేయుటకు మనలను మనము వినియోగించుకొనుటకు ప్రేమచే కదిలింపబడితిమి. (యోహాను 17:3) మనము అలసిపోవచ్చును, అయితే మనము బలాభివృద్ధి పొందులాగున యెహోవా మనకు శక్తినిచ్చును.—యెష. 40:29.

2 యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు మనయెడల చూపిన గొప్పప్రేమ విషయమై మనమెట్లు మన ప్రశంసను శ్రేష్ఠమైన రీతిలో చూపగలము? (2 కొరిం. 5:14, 15) దానికి ఒక ప్రాథమిక విధానమేమనగా, తన తండ్రినిగూర్చి, రాజ్యమును గూర్చి అలయక సాక్ష్యమిచ్చిన యేసును అనుకరించుటయే. (1 పేతు. 2:21) మన విశ్వాసము దృఢముగా ఉన్నట్లయిన, సువార్తను ప్రకటించుమని దేవుడు యిచ్చిన పనిచుట్టూ మన జీవితములు పరిభ్రమించును.—మత్త. 24:14.

3 ప్రాంతీయ పరిచర్య కొరకు కేటాయించుటకు మనకు కొద్దిపాటి సమయమే కలదా? పరిస్థితులు వివిధరకములు. వృద్ధాప్యము, అనారోగ్యము, లేక కుటుంబ బాధ్యతలవలన మనము పరిమితము చేయబడవచ్చును. అయినను, మనమందరము యెహోవాకు పూర్ణహృదయ సేవచేయవలసియున్నాము. అనగా పరిచర్యలో శక్తివంచనలేకుండా పనిచేయుట ద్వారా మన సమర్పణయొక్క నిజత్వమును మన భక్తియొక్క గాఢతను వ్యక్తిగతముగా మనము ప్రదర్శించవలెనని దాని భావము. (2 తిమో. 2:15) మన వ్యక్తిగత పరిస్థితికి అనుగుణ్యముగా మనలో ప్రతివారికి అవకాశములు తెరువబడుట కలదు. వీటిలో కొన్ని ఏమైయున్నవి?

4 మన పరిచర్యను విస్తరించు మార్గములు: మొదట మనము మన పరిచర్య నాణ్యతను అభివృద్ధి పరచుకొనుటయందు శ్రద్ధ కలిగియుండవలెను. బోధకునిగా మరింత నైపుణ్యమును వృద్ధిచేసికొనుట ద్వారా దీనిని నెరవేర్చవచ్చును. మనము ప్రాంతీయ పరిచర్యలో మరింత ప్రభావశీలురుగా తయారగుటకు సహాయపడుట దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ముఖ్యోద్దేశ్యములలో ఒకటైయున్నది. ప్రసంగములకు మనము సిద్ధపడునప్పుడు ప్రాంతీయసేవను మదిలో పెట్టుకొందుమా? మన వ్యక్తిగత పరిచర్యను మెరుగుపర్చుకొనుటకు వీలుగా ఇవ్వబడిన సలహాను మనము అన్వయింతుమా? (sg పు. 96-9) అదేవిధముగా ప్రాంతీయ పరిచర్య కొరకు సేవాకూటమందును అనేక సలహాలు ఇవ్వబడును. వీటిని సాధ్యమైనంత త్వరగా మనము ఉపయోగించుదము గాక.

5 తర్వాత, సహాయ లేక క్రమపయినీరు పనియందు భాగము వహించులాగున నీ పరిస్థితులను సవరించుకొను సాధ్యతను ఆలోచించుము. ఆ విధముగా చేయుట నిశ్చయముగా మన తండ్రియగు, యెహోవా సేవలో నీవు పనిరద్దీని కలిగియుండునట్లు చేయును. (1 కొరిం. 15:58) నీవు పయినీరు సేవ చేయలేకపోయినట్లయిన అప్పుడేమి? పరిచర్యయెడల నిజమైన ప్రేమను మరియు ప్రాంతమందలి ప్రజలయెడల లోతైన శ్రద్ధను పెంపొందించుకొనుట ద్వారా నీవు పయినీరు ఆత్మను ప్రదర్శించవచ్చును. అంతేకాకుండా, పునర్దర్శనములు మరియు బైబిలు పఠనములు జరిగించుటద్వారా సహృదయులు యెహోవాను ఆయన అద్భుతకరమైన సంకల్పములను తెలిసికొనుటకు నీవు ప్రతి అవకాశమును ఉపయోగించవచ్చును.

6 అవసరము ఎక్కువగాయున్న ప్రాంతములో పనిచేయుటకు ఇవ్వబడిన పిలుపుకు ప్రత్యుత్తరమిచ్చుట కూడా మన అభివృద్ధిలో భాగము కావచ్చును. (యెష. 6:8) సంఘ సేవకుల కూటమిలో సహాయమవసరమైన లేక ప్రాంతమును చుట్టివచ్చుటకు సహాయము కొరకు చూచుచున్న సంఘమునకు కదిలివెళ్లిన వారు నిశ్చయముగా అనేక ఆశీర్వాదములను అనుభవించారు.

7 మనము మొదట సత్యము నేర్చుకొనినప్పుడు, యెహోవా మరియు క్రీస్తు యేసు యెడల ప్రేమ మన జీవితములో పెద్ద సవరణలు చేసికొనుటకు మనలను ప్రేరేపించెను. ఇప్పుడు, మన పరలోకపు తండ్రితో మనకున్న సంబంధము మరియు ఆయన కుమారుడు మన పక్షమైచేసిన దానివిషయమై మన ప్రశంసయందు వృద్ధియగుచుండగా, మన పరిచర్యను విస్తరింపజేసికొనుటకుగాను మనము చేయగల ఇతర సవరణలు ఏమైనా కలవా? యెహోవా సేవలో పనిరద్దీని కలిగియుండుట ద్వారా మనమందరము మనలను మనము విస్తరింపజేసికొందము గాక.—రోమీ. 12:11.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి