రాజ్య పరిచర్య పాఠశాల దైవపరిపాలనా విద్యను అందించును.
పెద్దలు బహుగొప్ప బాధ్యతను కలిగియున్నారు. ఈ బరువైన పనిని నెరవేర్చుటకు సహాయపడులాగున, “పైవిచారణకర్తల కార్యవిధానములో ప్రత్యేక శిక్షణ పాఠ్యక్రమము (కోర్స్) నకు” 1959 ఆరంభములో ఏర్పాట్లుచేయబడెను. (jp పు. 292-3; yb77 పు. 14) పరిచారకులు హాజరగుటకు మొదటిసారిగా 1984లో ఆహ్వానింపబడిరి. చివరి రాజ్య పరిచర్య పాఠశాల 1988 సేవా సంవత్సరములో జరిగెను, కాగా దీనినుండి వేలాదిమంది ప్రయోజనము పొందిరి.
అప్పటినుండి, వందలాది సంఘములు ఏర్పరచబడి వేలాదిమంది సహోదరులు పెద్దలు మరియు పరిచారకులుగా నియమింపబడిరి. అంతేకాకుండా, సంస్థాపరమైన సవరణలుకూడా చేయబడినవి. కావున, క్రొత్త సేవా సంవత్సరములో అన్ని సంఘముల పెద్దలు మరియు పరిచారకులు రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరుకావలెనని పరిపాలక సభ (గవర్నింగ్ బాడీ) ఏర్పాట్లు చేయుచున్నది. ప్రాంతమందు ప్రస్తుత అవసరతలకు తగిన విషయములు ఈ క్రొత్త పాఠ్యక్రమములో చేర్చబడినవి. ఈ పాఠశాలయందు బోధించుటలో ప్రయాణకాపరులు నాయకత్వము వహింతురు. పాఠశాలలో నేర్చుకొన్న విషయములను పెద్దలు, పరిచారకులు అన్వయించుచుండగా, సంఘములన్నియు వాటి ప్రయోజనముల ననుభవించును.