ప్రపంచవ్యాప్త భద్రత సమీపముగా ఉన్నదని అందరు తెలిసికొందురు గాక
1 త్వరలోనే “సమాధానకర్తయగు అధిపతి” భూవ్యాప్తముగా నిజమైన శాంతిభద్రతలను స్థాపించును. ఈ బైబిలు వాగ్దానమందలి మన విశ్వాసము దానిని ఇతరులతో పంచుకొనుటకు మనలను పురికొల్పవలెను. (యెష. 9:6, 7; మీకా 4:3, 4) ఫిబ్రవరి, మార్చి నెలలలో, మనము 192 పేజీల ఏ పాత పుస్తకములనైనను అందింతుము.
2 మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచిక 4వ పేజీలో, ఫిబ్రవరి, మార్చిలలో పరిచర్యయందు మీరుపయోగించుటకు ఇష్టపడు వివిధరకముల పరిచయములు పేర్కొనబడినవి. క్రింది పేరాలలో సూచింపబడిన మూడు సంభాషణా విధానములు గృహస్థుల శ్రద్ధను నిన్ను సంతోషరచు సువార్త, నిత్యజీవమునకు నడుపు సత్యము, జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? వంటి పుస్తకములవైపు మళ్లించుటకు సహాయపడవచ్చును.
3 సువార్త పుస్తకమును ఉపయోగించునప్పుడు సంభాషణా విధానము: మీ పరిచయము తర్వాత, నిన్ను సంతోషపరచు సువార్త పుస్తకములోని 109వ పేజీకి త్రిప్పి ఇలా అడుగుము: “దేవుడు నియమించిన ‘సమాధానకర్తయగు అధిపతి’ క్రింద ఆయన పరిపాలన ఎందుకు మానవ పరిపాలనకంటే ఉన్నతముగా ఉండును? ఇక్కడ 7వ పేరాలో చాలాచక్కని కారణములు ఇవ్వబడినవి. దానిని నేను మీకొరకు చదువుతాను.” ఆ పిమ్మట ఇలా అడుగుము: “‘సమాధానకర్తయగు అధిపతి’ తన ప్రజలయెడల యథార్థముగా ఉండునని ఒకడు ఎట్లు నిశ్చయత కలిగియుండగలడు? జవాబు చెప్పనిచ్చిన తర్వాత, ఇంకను ఇట్లనుము: ఈ పుస్తకము మీకు ‘సమాధానకర్తయగు అధిపతిని’ గూర్చి, మన కాలములో ఆయనెట్లు భూమిపై ప్రపంచవ్యాప్త సమాధానమును తెచ్చునో మరియెక్కువగా తెలియజేయును. మీరు దీనిని చదువుటకు శ్రద్ధను, వాగ్దానము చేయబడిన నూతన లోకమునుగూర్చి మరియెక్కువ నేర్చుకొనుటకు ఇష్టపడుదురని నేను నమ్ముచున్నాను.” యేయితర 192 పేజీల పుస్తకముతోనైనను కలిపి ఈ పుస్తకమును 12 రూ.లకు అందించుము.
4 సత్యము పుస్తకమును ఉపయోగించునప్పుడు సంభాషణా విధానము: యెషయా 9:6, 7 చదివిన తర్వాత, నిత్యజీవమునకు నడుపు సత్యము పుస్తకములోని 4వ పేజీకి త్రిప్పి, గృహస్థుని ఇట్లడుగుము: “ఈ చిత్రములో మీరెలాంటి సమాధానకర పరిస్థితులను చూచుచున్నారు?” జవాబు నివ్వనిచ్చిన తర్వాత, ఇంకను ఇట్లనుము: “చూడండి, ప్రజలమధ్యను, జంతువుల మధ్యను సమాధానమున్నది. మానవ ప్రభుత్వములు అటువంటి సమాధానము తెచ్చునని కొందరు తలంచవచ్చును. అయితే బైబిలులో ప్రవచింపబడినట్లు నిజమైన శాంతిభద్రతలు దేవుని వలననే గాని, మానవుల వలన రానేరవు. దానికి మీరంగీకరించరా?” జవాబు చెప్పనిమ్ము, ఆ తర్వాత 6వ పేజీలోని 4వ పేరాను చదివి ఈ పుస్తకము రాజ్యమునుగూర్చిన, భూమిపై సమాధానమునుగూర్చిన అనేక ప్రశ్నలకు జవాబిచ్చునని వివరింపుము. ఈ విధముగా పుస్తకముపై శ్రద్ధ మళ్లించిన తర్వాత, చివరగా యేయితర 192 పేజీల పుస్తకముతోనైనను కలిపి దీనిని 12 రూ.లకు అందించుము.
5 జీవితము పుస్తకమును ఉపయోగించునప్పుడు సంభాషణా విధానము: మిమ్ములను అడ్డుకొను లేక ప్రసంగమును పూర్తిచేయుటకు అనుమతించని ప్రజలుగల ప్రాంతములలో, మీరు ఈ విధముగా సమీపించవచ్చును: “నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగవచ్చా?” గృహస్థుడు అంగీకరించినట్లయిన ఇలా కొనసాగించుము: “యేసుక్రీస్తు భూమిపై నున్నప్పుడు వివాహము చేసికోలేదనుటను మీరు గుర్తుతెచ్చుకొందురు. అయితే ప్రశ్నయేమంటే: ‘సమాధానకర్తయగు అధిపతిగా’ ఆయన పెండ్లిచేసికొని పిల్లలను కను అవసరము కలదా? మీ అభిప్రాయమేమిటి?” జవాబును అనుమతించి, ఆ పిమ్మట ఇట్లనుము: “ఆ ప్రశ్నకు బైబిలిచ్చు సమాధానము 167వ పేజీలో కలదు.” ఆపైన 167వ పేజీలోని 1వ పేరాను చదివి ఈ పుస్తకములో ఎత్తిచూపబడిన లేఖనములు, ఆ ప్రశ్నకు, ప్రపంచవ్యాప్త భద్రతనుగూర్చి మరియు “సమాధానకర్తయగు అధిపతిని” గూర్చిన మరిన్ని ప్రశ్నలకు ఎట్లు సమాధానము నిచ్చునో సూచించుము.
6 మన రాజ్య పరిచర్య లోని 4వ పేజీ నుండి మీరు ఇష్టపడిన పరిచయము నొకదానిని మీరు ఎంపికచేసికొనవచ్చును. ఈ శీర్షికలోని సంభాషణా విధానములను సమీక్షించిన తర్వాత, మీరు అందించు పుస్తకముతో వాటిలో ఒకదానిని ఉపయోగించుటను మీరు ఆనందించవచ్చును. ప్రాంతీయసేవకు వెళ్లుటకు ముందు మీ పరిచయములను మరియు సంభాషణా విధానములను అభ్యాసము చేయుటకు సమయము తీసికొనుము. మీ సిద్ధపాటు మరియు “సమాధానకర్తయగు అధిపతి,” ఆయన రాజ్యము ద్వారా నిజమైన శాంతిభద్రతలు వచ్చునను మీ స్వంత ఒప్పుదల, పాత 192 పేజీల పుస్తకములు అందించుటలో మీ ఉత్సాహమును ఆసక్తిని ఇనుమడింపజేయును.