శాంతి మరియు భద్రత—ఒక నిశ్చయమైన నిరీక్షణ
1 నేడు అనేకులు శాంతిభద్రతలను కోరుచున్నారు. కాని నిజమైన శాంతి, భద్రతతోపాటు ఈ లోకమునకు వంచనగా తయారైనది. యుద్ధమువలన ఈ లోకమునకు వంచనగా తయారైనది. యుద్ధమువలన ధ్వంసమైన ప్రాంతములలో లక్షలాదిమంది నివసించుచున్నారు. ఉగ్రవాద చర్యలు లేదా గెరెల్లాయుద్ధ పోరాటముల మూలముగా శాంతిభద్రతలను కనుగొనుట లెక్కలేనంతమందికి నిరాశజనకముగా ఉన్నది. చీకటిపడిన తరువాత నేర సంఘటనలు జరుగునేమోనని అనేకులు అత్యంత భద్రతా యేర్పాట్లుగల తమ గృహములను విడుచుటకు భయపడుచున్నారు. నిజంగా నెమ్మదితోకూడిన జీవితములను కల్గిన వారు ఏ కొద్దిమందో ఉన్నారు.
2 శ్రేష్టమైన పరిస్థితులకొరకు ఆశించుచున్నవారు శాంతిని గూర్చిన వర్తమానమును ఆహ్వానిస్తారు. క్రైస్తవులముగా యేసు ఆజ్ఞను మనము లక్ష్యపెట్టెదము: “మీరు ఏ ఇంటనైనను ప్రవేశించునప్పుడు, ‘ఈ ఇంటికి సమాధానమగుగాక’ అని మొదట చెప్పుడి, సమాధానపాత్రుడు అక్కడ నుండిన యెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.” (లూకా 10:5, 6) సమాధానమునకు కర్తయైన దేవుని ప్రతినిధులముగా, మనము ప్రజలను శాంతియుతముగా సమీపిస్తాము. మన పాదములకు “సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సును జోడు తొడుగుకొని”యుండవలెను.—ఎఫె. 6:15.
శాంతిని అపేక్షించువారిగా మాదిరిలు
3 సమాధానకరమైన వర్తమానమును సిఫారసు చేయవలనంటే, యెహోవా ప్రజలు స్పష్టమైన రీతిగా, తమ సమాజములలోను, సంఘములలోను శాంతియుతముగా జీవించవలయును. శాంతిని అపేక్షించు ప్రజలముగా మనము మాదిరిగా ఉండవలెను. తోటి క్రైస్తవులకు పేతురు ఇలా వ్రాసెను: “ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను సమాధానమందు కనబడునట్లు చూచుకొనుము.” (2 పేతు. 3:14, NW) శాంతిని అపేక్షించు క్రైస్తవులముగా మనము ఎలా మాదిరిగా ఉండగలము?
4 మొదటగా, సమాధానకర్తయైన దేవుడగు యెహోవాతో మనము సమాధానకరమగు సంబంధములను కలిగియుండవలెను. సార్వభౌమాధికారిగా ఆయన అధికారమును మనము గుర్తించవలెను. మనమాయన ఆజ్ఞలకు విధేయులమై ఉండవలెను. (కీర్త. 34:14) ఆత్మఫలములలో ఒకటైన సమాధానము మన జీవితములలో స్పష్టముగా కనిపించవలెను.—గలతీ. 5:22.
5 శాంతిని అపేక్షించు క్రైస్తవులముగా మనమాదిరియందు మానవ అధికారులయెడల గౌరవమును చూపుటకూడ ఇమిడియున్నది. ఇందులో ప్రభుత్వ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, యజమానులు, తలిదండ్రులు మరియు పెద్దలు చేరియున్నారు. (రోమా. 13:1, 2; కొలొ. 3:22; ఎఫె. 6:1; హెబ్రీ. 13:17.) నిమ్మళమైన మరియు సమాధానకరమైన జీవితములను నడుపుకొనుట మూలముగా మన వర్తమానమును అలంకరించుకొనిన వారమగుదుము. “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయువాటిని ఆసక్తితో అనుసరించ”గోరుచున్నామని మనము ప్రదర్శించెదము. (రోమా. 14:19) నూతన విధానములో శాంతిభద్రతలనేది మనకు ఒక నిశ్చయమైన నిరీక్షణ.
ప్రస్తుత అందింపు శాంతిని పెంపొందించును
6 జూలై నెలలో ట్రూపీస్ అండ్ సెక్యూరిటి—హౌకెన్యు ఫైండ్ ఇట్? అను పుస్తకమును 12 రూ.లకు అందించుటద్వారా మనకున్న నిరీక్షణను మనము పంచుకొందాము. నేడు కలత చెందిన లోకములో శాంతిభద్రత అనునది లక్షలాదిమంది మనస్సులలో కదలాడుచున్నది గనుక, ఈ అందింపు నిజంగా సమయానుకూలమైనది.
7 ఆ పుస్తకములో మొదటి రెండు అధ్యాయములలో మాట్లాడదగు అద్భుతమైన అంశాలు ఉన్నవి. పేజి 5 నందలి మొదటి రెండు పేరాలను ఇంటివారికొరకు మీరు చదువవచ్చును. లేదా పేజి 8 నందు 11 పేరాకు మీరు త్రిప్పి, మానవ నాయకులు వాగ్దానము చేసిన దానికి భిన్నముగా దేవుని నిశ్చయమైన వాగ్దానములను చూపవచ్చును. మరియు పేజి 20-1 నందు 28 మరియు 29 పేరాలను కూడ చూడుము. ఆసక్తి చూపిన వారిని లేదా అందింపును స్వీకరించిన వారిని, బైబిలు పఠనము ప్రారంభించాలనే ప్రయత్నముతో తిరిగి దర్శించుటకు నిశ్చయించుకొనుము.
8 సమాధానకర్తయగు దేవుడైన యెహోవాచే అభయమివ్వబడిన నిశ్చయమైన నిరీక్షణయగు శాంతిభద్రతలను వెదకువారందరికి, సమాధానకర్తయగు అధిపతియైన యేసుకు అప్పగింపబడిన తన రాజ్యముద్వారా అది ఎలా నెరవేర్చబడునో వారికి బోధించుచు, ప్రకటించుటయందు మనము కొనసాగుదము. (యెష. 9:6, 7) మన మాదరికరమైన శాంతియుత జీవన విధానము “సమాధానమును వెదకి దానిని వెంటాడు” క్రైస్తవులనుగా మనలను సిఫారసుచేయుటలో కొనసాగును గాక.—1 పేతు. 3:10, 11.