ప్రాంతీయ సేవ కొరకు సిద్ధపడుటకు ఒక అభ్యాససిద్ధమైన మార్గం
1 ఏమి చెప్పవలెనో తెలియనందున కొన్నిసార్లు ప్రాంతీయ సేవలో ఒకానొక సేవావిధానమందు భాగము వహించుటకు నీవు వెనుదీయుదువా? అట్లయిన, మన రాజ పరిచర్య నందు ప్రస్తావించబడు సమీపించుట అనుదానిని నీవు గుణగ్రహింతువని మేము నమ్ముచున్నాము.
2 ఈ సంచికతో ప్రారంభించబడి, మన రాజ్య పరిచర్య ఇంటింటి సేవ, పునర్దర్శనము, లేక బైబిలు పఠనమందు ఇలా రాజ్య వర్తమానమును ఎట్లు అందించవలెనను విషయమై ఇంకా అనేక విధములైన సూచనలను అందించును. పరిచర్యలో ఎటువంటి మాటలను మీరుపయోగించ నిష్టపడుదురో వాటిపై మీ ఆలోచనను ఇవి ఉత్తేజపర్చవలెను. పరిచర్యకు సిద్ధపడుచుండగా, మీ ప్రాంతమునకు బహుగా సరిపడు అందింపును ఎంచుకొనుము. ఆ పిమ్మట, శీర్షికలో సూచింపబడిన అవే పదములను ఉపయోగింతువా లేక స్థానిక పరిస్థితులకు లేక నీ స్వంత వ్యక్తిత్వమునకు తగినట్లు వాటిని సవరించవలెనా తీర్మానించుకొనుము. సహజత్వముతో నీ స్వంత మాటలలో అందింపును చెప్పినట్లయిన అది మరింతగా సంభాషించు రీతిలో ఉండును. బహుశ మొదటిసారి పాల్గొనుటద్వారా, నీ పరిచర్యను మరొక రంగములో విస్తరింపజేయవలెనని కోరుచున్నావా? అందింపబడిన వివరణాత్మక సూచనలు కేవలము ఆరంభించుటకు నీకు కావలసినవై యుండవచ్చును.
3 సంఘముయొక్క ప్రాంతీయ సేవా కూటములలో ఒకదానిని నీవు నిర్వహించు చున్నట్లయిన, మన రాజ్య పరిచర్య లో ప్రచురింపబడు సమాచారముతో నీవు బహుగా పరిచయము గలవాడవై యుండవలెను. మీ ప్రతిని బహుగా పఠనముచేసి, స్థానికముగా ఎక్కువ ప్రభావము చూపగల సూచనలపై శ్రద్ధనిల్పుము.
4 మనము చక్కగాచేయు పనుల విషయమై మనమందరము ఆనందింతుము. క్రొత్తవారు, ఆలాగే మరింత అనుభవముగల ప్రచారకులు తమ రాజ్య పరిచర్యలో ప్రభావవంతముగా, ఆనందదాయకముగా ఉండుటకు ఈ అభ్యాససిద్ధమైన సమీపించుట సహాయము చేయునని మా నమ్మకం.