“తిరిగి సందర్శించినప్పుడు మీరేమి చెప్పుదురు?”
1 మన పరిచర్యలో ప్రభావవంతముగా ఉండుటకు సిద్ధపాటు అవసరము, అలా ప్రారంభమందు ఆసక్తి చూపినవారిని మనము తిరిగి సందర్శించినప్పుడు, వారి ఆసక్తిని ఉత్తేజపరచి మన సంభాషణను కొనసాగించగలము. దీనిని మనమెట్లు చేయవచ్చును?
2 నిజమైన క్రైస్తవులు హృదయపూర్వకముగా ఇతరులయందు శ్రద్ధ కల్గియుందురు గనుక, ఇంతకుముందు వచ్చినప్పుడు గృహస్థునిగూర్చి మీరు తెలిసికొనిన దానిని నీవు మొదట సూచించవచ్చును.
నేరమును గూర్చి తన చింతను వెల్లడిచేసిన వ్యక్తికి, నీవిట్లు చెప్పవచ్చును:
◼ “పోయినసారి మేము మాట్లాడినప్పుడు గమనించదగిన రీతిలో పెరుగుచున్న నేరము విషయమై మీరు కలతచెందారని చెప్పారు. ఇంకా ఎక్కువమంది పోలీసువారిని రప్పించుట సమస్యను పరిష్కరిస్తుందని మీరనుకుంటారా?”
ప్రపంచ పరిస్థితిలో ఇటీవల సంభవించిన పరిణామముల విషయమై ఒక వ్యక్తి చింత వ్యక్తపరచినట్లయిన, నీవిట్లు చెప్పవచ్చును:
◼ “పోయినసారి మనము కలిసి మాట్లాడినప్పుడు లోకములో శాంతి లోపించుటనుగూర్చి ఒక ఆసక్తిదాయకమైన విషయం మీరు చెప్పారు. లోక నాయకులు ఒక నూతనలోక క్రమమును తెస్తారని మీరనుకుంటారా?”
ఇతరుల స్వార్థమునుబట్టి కలతచెందిన వ్యక్తికి, నీవిట్లు చెప్పవచ్చును:
◼ “పోయినసారి మనం మాట్లాడినప్పుడు ప్రజలలో మనము సాధారణంగా చూడగల పేరాశనుగూర్చి మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు. పేరాశగల ప్రజల విషయములో దేవుని దృష్టి ఏమని మీరనుకుంటారు? [జవాబివ్వనిమ్ము.] ఎఫెసీయులు 5:5లో బైబిలిట్లు చెప్పుచున్నది.”
3 ప్రభావవంతముగా ఉపయోగింపబడిన ఇతర మాటలలో ఇవియు చేర్చబడియున్నవి:
◼ “పోయినసారి మన సంభాషణను నేను ఎంతో ఆనందించాను, కాబట్టి నిరాశ్రయుల దుర్గతిని యెహోవా ఎట్లు గుర్తించుచున్నాడో మీకు చూపించుటకు నేను ఈ విషయాన్ని పరిశోధించాను. యెషయా 65:21-23 గమనించండి.”
◼ “మానవజాతికి ఒక శ్రేష్ఠమైన ప్రభుత్వము అవసరమని మీరు చేసిన వ్యాఖ్యానమును నేను ఆనందించాను.”
◼ “మతములన్నియు దేవుని గుర్తింపును కలిగియున్నవా అను ఆసక్తిదాయకమైన ప్రశ్నను మీరడిగారు.”
◼ “విధినిర్ణయమును గూర్చి మీరు చెప్పినది నిజంగా నేను ఆలోచించునట్లు చేసినది.”
◼ “మన సంభాషణను గూర్చి నేను ఆలోచిస్తూవున్నాను, మీరు సంతోషిస్తారని నేను నమ్ముచున్న ఒక అంశము మీరు పరదైసు భూమిలో నిరంతరము జీవించగలరు అను పుస్తకములో కలదు. [పుస్తకములో ఎంచుకొనిన అంశములను గృహస్థునికి చూపించవచ్చును.]”
ఇటువంటి ఉపోద్ఘాతములు మనము గత సంభాషణను ప్రశంసించుచున్నామని, గృహస్థునితో మరలా మాట్లాడుటకు ఆసక్తిగలవారమని చూపించును.
4 పునర్దర్శనము చేయుటకు ముందు, మీరు చెప్పబోవు విషయమునకు తలంపునివ్వండి. ప్రతి వ్యక్తికి తగినట్లు మీ అందింపును అమర్చండి.
5 మనము సందర్శించు వ్యక్తి పనితొందర కలిగియున్నట్లయిన, ఇలా చెప్పుటద్వారా మనమింకను ప్రభావవంతముగా ఉండగలము:
◼ “మీకు కేవలము కొద్దిసమయము మాత్రమే ఉందని నాకు తెలుసు, అయితే మీరు మీ పని పూర్తిచేయుచుండగా మీరు ఆలోచించగల విషయమొకటి ఇక్కడ కలదు. [మత్తయి 5:3 చదువుము.]”
లేక నీవిట్లు చెప్పవచ్చును:
◼ “నేను మీ కొరకు ఈ మూడు లేఖనములు వ్రాశాను. మాట్లాడుటకు ఇది మంచి సమయము కాదు గనుక, వాటిని మీ దగ్గర విడిచి వెళ్తాను, నేను మరలా వచ్చినప్పుడు వాటిని మీతో చర్చించుటకు నేను మీతో ఐదు నిమిషాలు తీసికుంటాను.”
6 విడనాడవలసిన ప్రతికూలమైనట్టి సమీపించు పద్ధతులు: వ్యతిరేక ప్రతిస్పందనకు కారణమగు ప్రశ్నలను లేక గృహస్థుని ఇబ్బందికరమైన పరిస్థితిలోపెట్టు ప్రశ్నలు సాధారణముగా మంచి ఫలితముల నివ్వవు. “నేను ఇచ్చివెళ్లిన పుస్తకము చదివారా?” “మీకేమైనా ప్రశ్నలున్నాయా?” “నేను మీకు గుర్తున్నానా?” “ఈ భూమినిగూర్చి దేవుని సంకల్పమేమో మాట్లాడుటకు మీరు ఇంకను ఆసక్తికలిగి యున్నారా అని అడుగుటకు నేను వచ్చాను?” వంటివి వీటిలో చేరియుండును.
7 నిజముగా అర్థవంతమైన సహాయము చేయుటకు ముందుగనే మనము సిద్ధపడినట్లయిన గతమందు ఆసక్తిచూచిన ఆయావ్యక్తులను తిరిగి సందర్శించుటకు మనము ఆతురత కలిగియుందుము.