ఆసక్తిగల వారియెడల శ్రద్ధకనపర్చండి
1 పత్రికలను దైవపాలనా ప్రచురణలను అందించేటప్పుడు, మనం యేసుక్రీస్తు ప్రకటించిన వార్తను వ్యాపింపజేస్తున్నాం. కాబట్టి ఆసక్తి కనపర్చిన ప్రతి వ్యక్తిని మనం తిరిగిదర్శించే ప్రయత్నం చేయాలి.
2 తేజరిల్లు!లోని ఒక నిర్దిష్ట శీర్షికను ఉన్నతపర్చి చూపితే, పునర్దర్శనం చేసేప్పుడు మీ సంభాషణను ఒక లేఖనం మరియు ఒకటి రెండు పేరాలపై కేంద్రీకరించి, ఆ శీర్షికలోని మరికొన్ని అంశాలను చర్చించండి. ఇంకా ఆసక్తి కనిపించినట్లైతే, తేజరిల్లు! పత్రిక పూర్తి కుటుంబానికి ప్రయోజనకరమని చూపించండి. పర్యావరణం, స్వయం-కృషి, ఈనాటి సమస్యలను ఎదుర్కొనటం, యౌవనస్థులడిగే ప్రశ్నలవంటి వేర్వేరు విషయాలను ప్రతి శీర్షిక కల్గివుంటుంది. యథార్థమైన ఆసక్తి కన్పించినప్పుడు, అవేక్! చందాపై లభ్యమౌతుందని, ఆరు నెలల్లో 12 సంచికలు పొందగలరని యింటివారికి తెలియజేయండి.
3 తేజరిల్లు! కొత్త సంచికలోని శీర్షికలపై యింటివారికి ఆసక్తి లేకపోతే అప్పుడేమి చేయాలి? సంభాషణను ముగించే బదులు, రీజనింగ్ పుస్తకం 206వ పేజీలో యివ్వబడిన సమాచారం ఉపయోగించి యెహోవాసాక్షుల పనిని గూర్చి యింటివారికి చెప్పేందుకు అట్టి అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు.
4 మునుపు మీరు 2 తిమోతి 3:1-5 ఉపయోగించి, పత్రికలో రెండవ పేజీలోనున్న సమాచారాన్ని ఉన్నతపర్చి “కావలికోట” అందించివుంటే, మీరు పునర్దర్శనం చేసినప్పుడు యిలా అనవచ్చు:
◼ “ఇంతకుముందు మనం సంభాషించినపుడు, ఈనాడు ప్రపంచంలో జరిగేవాటి భావాన్ని గూర్చి చర్చించాం. అనేకమంది ప్రజలకు దేవునియందు, బైబిల్లో యివ్వబడిన సూత్రాలయందు ఆసక్తి లేనట్లు కన్పిస్తోంది. రెండవ తిమోతి 3:1-5లో వర్ణించిన ప్రకారం, ప్రజలు ఒకరితో ఒకరు మెలిగే పద్ధతిపై ఇది ఎంతో ప్రభావాన్ని చూపింది. భవిష్యత్లో మంచి పరిస్థితులు వస్తాయని నమ్మడానికి బలమైన కారణాలేమైనా వున్నాయని మీరు భావిస్తారా?” వారు వ్యాఖ్యానించిన తర్వాత, 2 పేతురు 3:13కు వారి అవధానాన్ని మళ్లించవచ్చు. తర్వాత రీజనింగ్ పుస్తకంలో 227-33 పేజీలకు త్రిప్పి మానవజాతికి రాజ్యం ఏమి చేయబోతోందో నొక్కిచెప్పండి.
5 పునర్దర్శనం చేసినపుడు, మతమనేది వ్యక్తిగత విషయమని భావించి యింటివారు తమ మతాన్ని గూర్చి మాట్లాడటానికి యిష్టపడుట లేదని మీరు గ్రహించవచ్చు. అప్పుడు మీరు ఇలా అనవచ్చు:
◼ “మనకు నచ్చినా నచ్చకపోయినా, సమాచారమూ ప్రయాణాలు అతి వేగంగా సాగిపోతున్నందున అంతకంతకూ దగ్గరౌతున్న ప్రపంచంలోని అనేక మతాల వివిధ విశ్వాసాల ప్రభావం ప్రపంచమంతటా తేటగా కన్పిస్తోంది. కాబట్టి, ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థంచేసుకోవడం, వేర్వేరు విశ్వాసాల ప్రజల నడుమ మరింత అర్థవంతమైన సంబంధం ఏర్పడటానికి దోహదపడుతుంది. మత నమ్మకాలపై ఆధారపడిన ద్వేషాన్ని అది కొంతమేరకు పారద్రోలుతుంది. మీరేమనుకుంటున్నారు?” వ్యాఖ్యానించిన తర్వాత, మాన్కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ పుస్తకంలోని సమీక్షవైపు గృహస్థుని ఆసక్తిని మళ్లించండి.
6 సత్యంయెడల ఆసక్తిని కనపర్చే ప్రతివారిని తిరిగి దర్శించి, నిత్యజీవానికి నడిపే దారిలో వారు పయనించడానికి సహాయపడే ప్రతి ప్రయత్నాన్ని మనం చేద్దాం.—యోహాను 4:23, 24.