జూన్‌లో కావలికోట నందించుట
1 కావలికోట ప్రతి సంచిక 2వ పేజి పైభాగాన దాని ఉద్దేశ్యమును గూర్చి క్లుప్తంగా చెప్పబడినది. చెప్పబడిన ఆ ఉద్దేశ్యానికి అనుగుణ్యంగా సాధ్యమైనంత ఎక్కువమందికి సహాయం చేయుటకు మనమేమి చేయవచ్చును? రాజ్యవర్తమానము యెడల ఆసక్తి చూపేవారందరు కావలికోట క్రమంగా చదువునట్లు ప్రోత్సహించటానికి జూన్ మాసములో మనము ప్రత్యేక కృషి చేస్తాము.
2 తాను క్రైస్తవుడనని చెప్పుకొనే వ్యక్తికి మనము ఇలా చెప్పవచ్చును:
◼ “మేము మా పొరుగువారిని ఒక ప్రశ్న అడుగుతూ, దానిపై మీ వ్యాఖ్యానాన్ని కూడా వినుటకు ఇష్టపడుతున్నాము. యేసు, దేవునిరాజ్యము వచ్చుటకై ప్రార్థించుడనియు, ఆయన చిత్తము భూమిపై నెరవేరునట్లు ప్రార్థించమని మనకు బోధించాడు. అయితే, దేవుని చిత్తము పరలోకమందు నెరవేరునట్లే ఈ భూమిపై నిజంగా జరగబోతుందని మీరనుకుంటారా?” సమాధానము చెప్పనిచ్చి, యెషయా 55:10, 11 వైపు త్రిప్పి దేవుని వాగ్దానములన్ని ఎలా నెరవేరునో చూడమని గృహస్థుని ఆహ్వానించుము.—రీజ, పే. 12. “కింగ్‌డం” క్రింద రెండవ ఉపోద్ఘాతము.
3 ఇంటివారు ఆసక్తిచూపినట్లయిన మీరు ఇంకా ఇలా చెప్పవచ్చును:
◼ “కావలికోట పత్రికయొక్క ఉద్దేశ్యములలో ఒకటేమనగా బైబిలు ప్రవచన నెరవేర్పుపై అవధానమును మళ్లించుట. ఈ శీర్షికను గమనించండి” అని చెప్పి, ది వాచ్‌టవర్ మే 1వ సంచికలోని “1914—లోకమును దిగ్భ్రాంతి పరచిన సంవత్సరము” అను మొదటి శీర్షికవైపు అవధానమును మళ్లించండి. ఆ తర్వాత ఇలా చెప్పవచ్చు—‘1914 యెడల మనమెందుకు శ్రద్ధచూపాలి’ అని మీరు ఆశ్చర్యపడుతుండవచ్చు, 2వ పేరాలో 1914ను గూర్చియు మరియు ది వాచ్‌టవర్‌ను గూర్చియు, అక్కడ ఏమిచెబుతుందో గమనించండి.” ఆ తర్వాత పేరాను చదువుము.
4 మీరు చర్చను పొడిగించాలనుకుంటే, రీజనింగ్ పుస్తకములో సూచించబడినట్లు అదే అందింపు ప్రసంగమునకు ప్రకటన 21:3-5ను చేర్చి పొడిగించవచ్చును.
“ఈ సందర్భంలో యెషయా 55:10, 11 ను చదివిన తరువాత మీరిలా చెప్పవచ్చును:
◼ “భూమి యెడల దేవునిచిత్తమును గూర్చిన ఒక అద్భుతమైన ప్రవచనము త్వరలో నెరవేరబోతుంది. అది మీయొక్క, నాయొక్క జీవితములపై ప్రభావము చూపుతుంది. ప్రకటన 21:3-5 ఏమి వ్రాయబడిందో ఊరక వినండి.” మీరు ఆ వచనములను చదివి దేవుని రాజ్య పరిపాలనక్రింద ఏ ఆశీర్వాదములుండునో చర్చించవచ్చును. ది వాచ్‌టవర్ దేవుని రాజ్య ప్రభుత్వమును ఎలా ప్రకటిస్తుందో సూచించుము.
మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “మే 1వ సంచిక ‘హూ విల్ ఎస్కేప్ ది “టైమ్ ఆఫ్ డిసెస్”?’ అనే శీర్షికను అందిస్తుంది. మనము ప్రకటన 21లో చదివియున్న దేవుని రాజ్యము క్రింది నీతియుక్తమైన నూతనలోకములో మీరెలా జీవించగలరు అనే విషయాన్ని పరిశీలించుటకు అది మీకు సహాయపడుతుంది.”
5 ప్రాంతీయ భాషలోని జూన్ 1, కావలికోట నుపయోగించునప్పుడు మీరిలా చెప్పవచ్చును:
◼ “మనలో ఎక్కువమందిమి అప్పుడప్పుడు వ్యాధితో బాధపడుతుంటాము. జీవితము ఎల్లప్పుడు ఇలాగే కొనసాగుతుందా?” (ఇంటివారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చనివ్వండి) తరువాత: “త్వరలో వ్యాధి, మరణము ఇక ఉండవు!” అని చెప్పి, పత్రిక పైన ఉన్న బొమ్మను చూపించుము. “ఇది ఎప్పటికైనా వాస్తవమౌతుందని మీరు నమ్ముతారా?” అని ప్రశ్నించండి. (సమాధానముకొరకు కనిపెట్టుము) కొద్దిసేపు పటమును పరిశీలించి, ఆ శీర్షిక చివరి పేరాను వారికి సూచించుము. చందాకట్టుటకు ఆహ్వానించుము.
6 కావలికోటను బైబిలు పఠనమునకు మెట్టుగా వాడుము: ఇతరులు కూడా యెహోవాకు తోటి పనివారలై, యెహోవా రాజ్యమును ప్రకటించుటలో పాల్గొనుటకు వారు సత్యమును నేర్చుకొనునట్లు సహాయపడుటే మన గమ్యం. కావున మనము ఆసక్తిగల ప్రజలను కనుగొన్నప్పుడు, ఆ విషయమును నోట్ చేసుకొని త్వరగా తిరిగివెళ్లి దర్శించుటకు కోరుకొనవలెను.
7 కావలికోట సహాయముతో సత్యమును మనము ఇతరులతో పంచుకొనునప్పుడు, గొర్రెలాంటివారిని కనుగొని, వారిని పోషించునట్లు ఎల్లప్పుడు మన పనిమీద యెహోవా నడిపింపు వెదకుదుముగాక.—యోహాను 21:15-17.