ఫలవంతమైన పునర్దర్శనములను చేయండి
1 “దేవుని జతపనివార”ముగా, పునర్దర్శనములను చేయుట మనసేవలో ఒక ప్రాముఖ్యమైన భాగము. (1 కొరిం. 3:6-9) ఇలా చేయునప్పుడు ఇంటివారి ప్రతిస్పందన ఎలాగుంటుందో అని మనం భయపడనక్కర్లేదు, ఎందుకనగా అప్పటికే సత్యముయెడల ఆసక్తి చూపియున్న వారిని మనము దర్శిస్తున్నాము. మన పక్షంగా మనము బాగుగా సిద్ధపడి, ఆసక్తిదాయకమైన ఒక బైబిలు అంశాన్నిగూర్చి మనం సందర్శించబోయే వ్యక్తితో చర్చించునపుడు అది అతని ఎడల మనకున్న నిజమైన వ్యక్తిగత శ్రద్ధను ప్రతిబింబిస్తుంది.
2 సూటిగా చెప్పుము; నేర్పుతో కూడిన ప్రశ్నలనడుగుము.
మొదట మీరు దర్శించినప్పుటి నోట్స్నుండే మీరిలా అడగవచ్చును:
◼ “భూమిని నీతితో పరిపాలించు దేవుని వాగ్దానములను గూర్చి ఇంకా మీరేమైనా తలంచారా?”
ఇంకో ప్రశ్న ఇలా వుండవచ్చు:
◼ “గతవారము మన బైబిలు చర్చ జరిగినప్పటినుండి దేవునిరాజ్యము రావాలని మీరు చేయు ప్రార్థన ఎక్కువ అర్థవంతంగా ఉందని మీరనుకుంటారా?”
అలాంటి ప్రశ్నలను అడిగేటప్పుడు స్నేహపూర్వకమైన ముఖకవళిక, కంఠస్వరము మన యథార్థమైన శ్రద్ధను ప్రదర్శించుటలో ఎంతో ప్రభావాన్ని కనపరచుటకు దోహదం చేస్తుంది.
3 తొందరపాటు వద్దు; ఇంటివారు చెప్పేదాన్ని వినండి. గృహస్థుడు చెప్పేదాన్ని మనము విని, సమాధానమివ్వకముందు గంభీరంగా తలంచినట్లయిన వ్యక్తిగా అతని ఎడల మనకున్న నిజమైన శ్రద్ధ స్పష్టమౌతుంది. వారు చెప్పేదాన్నిబట్టి, మీ మొదటి దర్శన సంబంధంగా లేఖన సంబంధమైన తలంపును ఇవ్వవచ్చును. మీరు దర్శించినప్పుడెల్లా కొంత బోధించగలుగునట్లు సిద్ధపడండి. ముందుగా తలంచని అంశము ప్రస్తావించబడితే, అవసరమగు సమాచారము కొరకు మీ రీజనింగ్ పుస్తకమును తీసిచూసే అవకాశాన్ని వినియోగించుకొనండి.
4 మీరు మే 1, 1992 “వాచ్‌టవర్” అందించివుంటే, ఇలా చెప్పవచ్చును:
◼ “పోయినసారి మనము 1914వ సంవత్సరాన్ని గూర్చి మాట్లాడాము. ఆ సంవత్సరములో ప్రారంభమయిన యుద్ధము అనేక ప్రభుత్వాలలో మార్పులను తెచ్చింది. అప్పటినుండి ఇంకా అనేక మార్పులు కొనసాగుతూనే ఉన్నవి. అయితే ఈ మార్పులలో ఏదైనా, లేక ఇవన్నైనా ప్రజల అవసరతలను తీర్చాయా? అవి ఒక శాశ్వత కాల సమాధానమునకు అభయమివ్వగలవా? [వ్యాఖ్యానించనివ్వండి.] ఈనాడు మనము ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను నిజముగా పరిష్కరించగల ఒక ప్రభుత్వము కొరకు ప్రార్థించమని యేసు ఎలా చెప్పాడో గమనించండి. [మత్తయి 6:9, 10 చదవండి.] దేవునిరాజ్యము ఏమి చేయగలదని మీరనుకుంటారు? [వ్యాఖ్యానించనివ్వండి.] దీనికి బైబిలు ఇచ్చు వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది.” దానియేలు 2:44 చదువుము. దేవునిరాజ్యముక్రింద ఉండబోవు పరిస్థితులను చూపించుటకు “నిరంతరము జీవించుము” పుస్తకములోని 12 మరియు 13 పేజీలందలి చిత్రమును మీరు ఉపయోగించవచ్చును.
5 మీరు మే 1, 1992 ప్రాంతీయ భాష “వాచ్‌టవర్” ను అందించివుంటే ఇలా చెప్పవచ్చును:
◼ “నేను పోయినసారి దర్శించినప్పుడు కుటుంబ జీవితమును ఎలా వృద్ధిచేసికొనవచ్చునో మాట్లాడుకున్నాము. కుటుంబములపై వత్తిడులు ఉద్రిక్తమౌతున్న ఈ కాలంలో మనం జీవిస్తున్నందున, మనలో ఎక్కువమంది దానిని ఇష్టపడతారు. కుటుంబ జీవిత నాణ్యతను పెంచే సహాయమును ఎక్కుమంది ఆహ్వానిస్తారని మీరునుకోరా?” ఇచ్చే ప్రత్యుత్తరాన్ని బట్టి మీరు “మీ కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమివ్వండి” అనే శీర్షికను సూచించవచ్చును. మొదట ఉపశీర్షికలవైపు అవధానాన్ని మళ్లించి ఒక్కొక్క ఉపశీర్షికలోని ముఖ్యాంశములను క్లుప్తముగా వివరించుము. ముగింపులో యోహాను 17:3, ప్రకటన 21:3, 4ను చదువవచ్చును.
6 మన పునర్దర్శనములు విజయవంతమగులాగున ఎల్లప్పుడూ వ్యక్తిగత శ్రద్ధను కనపరస్తూ చర్చించుటకు ఆసక్తిదాయకమైన బైబిలు అంశములను మనసులో ఉంచుకొందము.