గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించుట
1 ఒక సమర్థవంతమైన గృహ బైబిలు పఠనం ఎలా నిర్వహించబడుతుంది? ఏ ప్రాథమిక ఉదాహరణ మనకుంది? పఠనాంశంలోని లేఖనాలను ఎలా పరిశీలించాలి? పేరాలను ఎవరు చదవాలి? పఠనాన్ని నిర్వహించే ప్రాథమిక పద్ధతితో పాటు, విద్యార్థి సత్యాన్ని తన స్వంతం చేసుకొనునట్లు సహాయపడుటకేమి చేయాలి? ఏ అపాయాలను నివారించాలి?
2 పఠనం ఎలా నిర్వహించాలి: చెప్పాలంటే, గృహ బైబిలు పఠనం కావలికోట పఠనం మాదిరిగానే ఉంటుంది. మొదట, పరిశీలించవలసిన పేరా చదువబడుతుంది. ఆ తర్వాత పఠన నిర్వాహకుడు ఆ పేరాలోని ప్రశ్నను అడిగి, విద్యార్థిని జవాబు చెప్పనిస్తాడు. ఒకవేళ సంకోచిస్తే, విద్యార్థి ఆ విషయాన్ని యుక్తంగా ఆలోచించి, సరైన ముగింపుకు వచ్చేలా సహాయపడే ప్రశ్నలు అడగటానికి నిర్వాహకుడు సంసిద్ధంగా ఉండాలి.
3 పేరాలోని సమాచారానికి లేఖనాలు ఎలా అన్వయించబడతాయో పరిశీలించండి. ఎత్తివ్రాయబడిన లేఖనాలను గుర్తించి, అవి ఎలా అన్వయించబడతాయో అతనితో తర్కించండి. లేఖనాలను ఎత్తివ్రాయకుండ కేవలం సూచిస్తే, అవి మరీ పెద్దవి కాకపోతే వాటిని బైబిలులో చూడటం మంచిది. పిమ్మట విద్యార్థిని దాన్ని చదవనిచ్చి అది పేరాలో పేర్కొన్న విషయాన్ని ఎలా దృఢపరుస్తుందో లేక స్పష్టం చేస్తుందో వ్యాఖ్యానించనివ్వండి.
4 విద్యార్థి సత్యాన్ని తన స్వంతం చేసుకోడానికి సహాయపడండి: విద్యార్థులను పఠనానికి బాగా సిద్ధపడి ఉండమని ప్రోత్సహించండి. నేర్చుకోడానికి చదవటం ప్రాముఖ్యమని నొక్కితెల్పండి. విద్యార్థి పఠనాంశాన్ని ఎంత ఎక్కువ చదివి దాన్ని ధ్యానిస్తే అంత మంచిది. బైబిలు పఠన సమయంలో కొందరు నిర్వాహకులు విద్యార్థిచేత అన్ని పేరాలను చదివిస్తారు. ఇతరులు పేరాలు మార్చి మార్చి చదువుతారు. విద్యార్థి ఆత్మీయ పురోభివృద్ధిని మనస్సులో వుంచుకొని, మంచి వివేచననుపయోగించాలి.
5 ఆచరణయోగ్యం కాకుండా ఊరికే సమాచారాన్ని పూర్తి చేస్తే విద్యార్థి జ్ఞానాన్ని సంపాదించడానికి దోహదపడవచ్చు గాని, అతను నేర్చుకునే వాటిని నమ్ముతున్నాడా? అతడు సత్యాన్ని తన స్వంతం చేసుకోవాలంటే, ఆ సమాచారం వ్యక్తిగతంగా తనపై ఎలాంటి ప్రభావాన్ని కల్గివుంటుందో అతను గ్రహించాలి. తాను నేర్చుకుంటున్న వాటిని గూర్చి తాను ఎలా భావిస్తున్నాడు? అతను నేర్చుకున్న వాటిని ఎలా ఉపయోగించగలడు? విద్యార్థి హృదయాన్ని చేరేందుకు పరిశోధనా ప్రశ్నలను వేయండి.
6 అపాయాలను నివారించండి: బైబిలు పఠనం నిర్వహించేటప్పుడు నివారించవలసిన కొన్ని అపాయాలున్నాయి. మనం పరిశీలించే సమాచారానికి సంబంధించని అంశాలు తలెత్తినప్పుడు, పఠనం ముగించిన తర్వాత లేదా మరో సందర్భంలో వాటిని పరిశీలించడం మంచిది. అంతేకాక, జవాబులిచ్చేటప్పుడు పుస్తకంనుండి చదవటం కాకుండ విద్యార్థి తన స్వంత వాక్యాల్లో చెప్పడం ప్రాముఖ్యం. విద్యార్థి విషయాన్ని గ్రహిస్తున్నాడా లేదాయని నిర్వాహకునిగా మీరు నిర్ణయించుకోడానికి ఇది మీకు సహాయపడుతుంది.
7 కనీసం ఒక బైబిలు పఠనాన్నైనా నిర్వహించే గురిని మీరు ఎందుకు కల్గివుండకూడదు? మీరు యెహోవాపై ఆధారపడి కావలికోట పఠనా విధానాన్ని అనుసరిస్తే అది అంత కష్టతరమైన పనేమీ కాదు. సత్యాన్ని యితరులకు బోధించి, శిష్యులను తయారుచేయడానికి గృహ బైబిలు పఠనమే అతి ప్రభావవంతమైన పద్ధతి. ఇలా చేయడం వల్ల, మత్తయి 28:19, 20లో యేసు యిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడంలో పూర్తి భాగం వహించినందువల్ల వచ్చే సంతోషాన్ని మీరు కూడ పొందవచ్చు.