సమృద్ధిగానే అయినా వివేచనతో విత్తండి
1 విత్తనాలు సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకోస్తానని, కొద్దిగా విత్తితే కొద్దిగా పంటకోస్తానని ప్రతి రైతుకు తెలుసు. (2 కొరిం. 9:6) విత్తనాలు పెరిగే అవకాశం లేనిచోట విత్తితే విత్తనాలు వృధా అవుతాయి కాబట్టి రైతులు అలా జరుగకుండా జాగ్రత్త తీసుకుంటారు. మనం క్షేత్రంలో సాహిత్యాలను ఇచ్చేటప్పుడు ఇలాంటి వివేచనే ఉండాలి. మన సాహిత్యాలను చదవాలన్న ఆసక్తివున్న వారికే వాటిని ఇవ్వాలని మనం కోరుకుంటాం. యోగ్యులైనవారికే మనం యెహోవా కృప గురించి ఆయన రాజ్య నిరీక్షణ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలనుకుంటాం.
2 మీ క్షేత్రంలోని యోగ్యులైనవారిని సత్యజ్ఞానం వైపు తీసుకురావడానికి ఉపయోగించగల పత్రికలు, బ్రోషుర్లు, ఇతర ప్రచురణలతో మీ ఇంట్లోని షెల్ఫ్ నిండిపోతున్నట్లు మీరు గమనించారా? (మత్తయి 25:25 పోల్చండి.) రాజ్య ప్రకటనా పనికి మద్దతు ఎలా లభిస్తోందో చెప్పడం బాగుండదని భావించి మీరు కొన్నిసార్లు మొదటి సందర్శనంలోనే పత్రికలను లేక ఇతర సాహిత్యాలను ఇవ్వకుండా ఉంటున్నారా? రాజ్య పనికి విరాళాలు ఎలా ఉపయోగించబడతాయో సూటిగా సరళంగావుండే మాటలతో చెబితే, కృతజ్ఞతగల గృహస్థులు స్పందిస్తారని అనుభవజ్ఞులైన ప్రచారకులు గ్రహించారు.
3 మీరిలా అనవచ్చు:
◼ “మేము డబ్బులేమీ అడక్కుండా ఈ సాహిత్యాలను ఎలా ఇవ్వగలుగుతున్నామని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఇది స్వచ్ఛంద విరాళాల సహాయంతో జరుగుతున్న ప్రపంచవ్యాప్త విద్యాపనిలో ఒక భాగం. ఈ పనికి మీరు కొద్దిపాటి విరాళం ఏమైనా ఇవ్వాలనుకుంటే, నేను స్వీకరించడానికి చాలా ఆనందిస్తాను.”
4 చాలామంది గృహస్థులు మనమిచ్చే ప్రచురణలకు వెల ఎంత అని అడుగుతారు.
మీరిలా జవాబివ్వవచ్చు:
◼ “ఈ ప్రచురణలకు ఇంత వెల అంటూ లేదు ఎందుకంటే మా పని స్వచ్ఛంద విరాళాల సహాయంతో జరుగుతోంది. మీరు ఈ రోజు చిన్న మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలనుకుంటే, మేము దాన్ని ప్రపంచవ్యాప్త బోధనా పనికి ఉపయోగించేందుకు ఆనందిస్తాం.”
లేక మీరు ఇలా కూడా అనవచ్చు:
◼ “బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తిగలవారికి మేము మా సాహిత్యాలను లభ్యమయ్యేలా చేస్తాం. మీరు ఈ ప్రపంచవ్యాప్త పనికి ఏమైనా విరాళం ఇవ్వాలనుకుంటే నేను దాన్ని మీ తరఫున అందజేయడానికి సంతోషిస్తాను.”
5 కొంతమంది ప్రచారకులు పత్రికలు ఇచ్చేటప్పుడు లోపలి పేజీని చూపిస్తూ ఇలా అంటారు:
◼ “మీరిక్కడ చూస్తున్నట్లు, మా పని స్వచ్ఛంద విరాళాల సహాయంతో జరుగుతోంది. మీరు ఈ పనికి సహాయంగా ఏమైనా విరాళం ఇవ్వాలనుకుంటే నేను మీ తరఫున అందజేస్తాను.”
ఇది మరో సరళమైన విధానం:
◼ “మా సాహిత్యాలు డబ్బులేమీ అడక్కుండానే ఇస్తున్నప్పటికీ, మా ప్రపంచవ్యాప్త పని కోసం చిన్న చిన్న విరాళాలను మేము స్వీకరిస్తాం.”
6 మన పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తోందో చెప్పడం ఇబ్బందిగా ఉన్నంత మాత్రాన రాజ్య విత్తనాలను విత్తడంలో ఎన్నడూ వెనకాడకూడదు. అదే సమయంలో మన సాహిత్యాలు “రాతినేల” మీద పడి వృధా కాకుండా వివేచన చూపించాలి. (మార్కు 4:5, 6, 16, 17) మనం అందజేసే సువార్త పట్ల కృతజ్ఞతగలవారు ఆ పనికి ఆర్థిక మద్దతుగా విరాళమిచ్చే అవకాశముందని తెలుసుకొని సంతోషిస్తారు.—మత్తయి 10:42 పోల్చండి.