ప్రశ్నాభాగము
◼ ఎవరైనా గృహ యజమాని సాహిత్యముల కొరకైన చందాకంటే ఎక్కువ మరియు అధికముగా ఉదారముగా విరాళమిచ్చినట్లయిన, మనము అతనికి మరియెక్కువ సాహిత్యములను ఇవ్వవలెనా?
అవసరము లేదు. మన పనిలో ఆ వ్యక్తి చూపుచున్న ఆసక్తిని పరిగణనలోనికి తీసుకుంటూ, ఈ విషయములో ఏది న్యాయమో మీరు ఆలోచించవచ్చును. ఆ తర్వాత సందర్శించునప్పుడు, గృహ యజమాని ప్రత్యేక అవసరమునకు తగిన సాహిత్యములను అందించవచ్చును. విరాళములు మన ప్రపంచవ్యాప్త పనియొక్క వివిధ ముఖరూపములకు, దీనియందు మన నిర్మాణ ప్రణాళిక, మిషనరీలు, మరియు స్పెషల్ పయనీరు పని, వీటికితోడు మన సాహిత్యముల ప్రచురణ చేరియున్న సంగతులకు దోహదపడునను విషయమును మనస్సునందుంచుకొనుము.