దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1994
ఉపదేశములు
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపించేటప్పుడు 1994లో ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకములు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చ్‌ర్స్ [బిఐ 12], యునైట్డ్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది ఓన్లీ ట్రూ గాడ్ [యుడబ్ల్యు], “అల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” (1990 సంచిక) [ఎస్‌ఐ], జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి [జిటి], చర్చనీయ బైబిలు అంశములు [టిడి] అనువాటిపై ఆధారపడి ప్రసంగాలుంటాయి.
పాట, ప్రార్థన, ఆహ్వానపు మాటలతో పాఠశాల ప్రారంభమై ఈ విధంగా కొనసాగుతుంది:
అసైన్‌మెంట్ నెం. 1: 15 నిమిషాలు. ఈ ప్రసంగాన్ని ఒక సంఘ పెద్ద లేదా అర్హుడైన పరిచారకుడు యివ్వాలి. ఇది యునైటెడ్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది ఓన్లీ ట్రూ గాడ్ లేదా “ఆల్ స్ర్కిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” అనే పుస్తకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని 10 నుండి 12 నిమిషాలపాటు ఉపదేశ ప్రసంగంగాను, తదుపరి ఆ ప్రచురణలో ముద్రించబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ 3 నుండి 5 నిమిషాలపాటు మౌఖిక పునఃసమీక్షగాను అందించాలి. దాని ఉద్దేశము కేవలం సమాచారాన్ని అందించడమేగాక, చర్చించబడే సమాచారం యొక్క ఆచరణయోగ్యమైన విలువపై అవధానాన్ని కేంద్రీకరిస్తూ, సంఘానికి అత్యంత సహాయకరమైన దాన్ని ఉన్నతపర్చాలి. ఇవ్వబడిన మూలాంశాన్నే ఉపయోగించాలి. ఈ సమాచారంనుండి పూర్తి ప్రయోజనం పొందడానికి అందరూ బాగా సిద్ధపడి రావాలని ప్రోత్సహించబడుతున్నారు.
ఈ ప్రసంగానికి నియమించబడే సహోదరులు నిర్ణయించబడిన సమయంలోనే ముగించడానికి జాగ్రత్త వహించాలి. అవసరమైతే లేదా ప్రసంగీకుడు ముందుగానే కోరినట్లైతే, ఏకాంతంగా సలహా ఇవ్వవచ్చు.
బైబిలు పఠనం నుండి ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. ఈ సమాచారాన్ని ప్రాంతీయ అవసరాలకు తగినరీతిగా అన్వయించగల అధ్యక్షుడు లేదా మరొక పెద్ద, లేక ఒక పరిచారకుడు దీన్ని చేయాలి. ఇది కేవలం నిర్ణయించబడిన బైబిలు పాఠ్యభాగ సారాంశమై ఉండకూడదు. ప్రారంభంలో, నియమించబడిన అధ్యాయాలన్నిటిని గూర్చిన క్లుప్త పునర్విమర్శను 30 నుండి 60 సెకండ్లలో ముగించాలి. ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువగలదై ఉందో గుణగ్రహించడానికి ప్రేక్షకులకు సహాయపడటమే దీని ముఖ్యలక్ష్యం. ఆ తరువాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారివారి తరగతి గదులకు పంపుతాడు.
ప్రసంగం నెం. 2: 5 నిమిషాలు. నియమించబడిన ఒక భాగాన్ని బైబిలునుండి చదవడానికి ఒక సహోదరునికివ్వాలి. ముఖ్య పాఠశాల, విభజించబడిన ఇతర గుంపులకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రారంభ, ముగింపు మాటల్లో విద్యార్థి సమాచారాన్ని క్లుప్తంగా వివరించడానికి వీలయ్యేవిధంగా ఈ పఠన నియామక భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. వీటిలో, చారిత్రాత్మక ఆధారాన్ని, ప్రవచనాత్మకమైన లేదా సిద్ధాంతపరమైన గుర్తింపును, అందలి సూత్రముల అన్వయింపులను యిమడ్చవచ్చు. నియమిత వచనాలన్నింటిని మధ్యలో ఆపకుండా కచ్చితంగా చదవాలి. అయితే చదవవలసిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం ఎక్కడనుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనవచ్చు.
ప్రసంగం నెం. 3: 5 నిమిషాలు. ఈ ప్రసంగం సహోదరీలకు నియమించబడుతుంది. ఈ ప్రసంగ అంశాలు జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకంపై ఆధారపడి ఉంటాయి. నియమించబడే విద్యార్థిని చదువగల్గేదై ఉండాలి. ప్రసంగమిచ్చేటప్పుడు ఆమె కూర్చోవచ్చు లేదా నిల్చోవచ్చు. పాఠశాల అధ్యక్షుడు ఆమెకొక సహాయకురాలిని నియమిస్తాడు. అయితే అదనంగా యితర సహాయకులను కూడ తీసికోవచ్చు. ప్రసంగ సెట్టింగ్‌లు ప్రాంతీయ సేవకు లేదా తటస్థ సాక్ష్యానికి సంబంధించినవిగా ఉంటే మంచిది. ప్రసంగమిచ్చేవారు గానీ వారి సహాయకులుగాని సెట్టింగ్ సిద్ధం చేయడానికి సంభాషణను ప్రారంభించవచ్చు. సెట్టింగ్‌కాదుగాని సమాచారానికే ప్రాధాన్యతనివ్వాలి. తనకివ్వబడిన మూలాంశాన్నే వాడాలి.
ప్రసంగం నెం. 4: 5 నిమిషాలు. ఒక సహోదరునికి లేదా సహోదరికి నియమించబడుతుంది. ఇది చర్చనీయ బైబిలు అంశములు అనే చిన్న పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. సహోదరునికి నియమించబడినప్పుడు అది ప్రేక్షకులందరిని ఉద్దేశించి చేసే ప్రసంగంగా ఉండాలి. ప్రసంగం మంచి సమాచారంతో కూడినదై వినే వారందరికి ప్రయోజనకరమయ్యే విధంగా సహోదరుడు రాజ్యమందిరంలోని ప్రేక్షకులందరిని మనస్సులో ఉంచుకొని సిద్ధపడితే ప్రసంగాన్ని సాధారణంగా ఉపదేశాత్మకంగా, అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. అయిననూ సమాచారం ఒకవేళ ఇంకొక రీతిలో అభ్యాసయుక్తంగా, ప్రేక్షకులకు తగిన విధంగా ఉన్నట్లయితే, సహోదరుడు ఆ ప్రకారంగా ప్రసంగమివ్వడానికి ఎన్నుకోవచ్చు. ఇవ్వబడిన మూలాంశాన్ని విద్యార్థి ఉపయోగించాలి.
ఒక సహోదరికి నియమించబడినప్పుడు ప్రసంగం నెం. 3కు ఇవ్వబడిన పద్ధతిలోనే యీ సమాచారాన్ని అందించాలి.
ఉపదేశం, గుర్తించిన విషయాలు (రిమార్కులు): ప్రతి విద్యార్థి ప్రసంగం తరువాత, పాఠశాల అధ్యక్షుడు ఒక నిర్దిష్టమైన సలహాను యిస్తాడు. అది స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లోని వరుసలోనిదే కావాలని లేదు. బదులుగా విద్యార్థి అభివృద్ధి చేసికోవలసిన విషయాలకు ఆయన శ్రద్ధనివ్వాలి. ప్రసంగమిచ్చిన విద్యార్థి స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లో పరిశీలించబడిన అంశాలకు “G” గుర్తునే పొంది, “I” లేక “W” గుర్తించబడి వుండకపోయినట్లయితే, ఉపదేశకుడు సాధారణంగా “G,” “I,” లేక “W” గుర్తించబడే బాక్స్‌లో గుండ్రంగా గీయాలి. అదే ప్రసంగ లక్షణంపై విద్యార్థి ఈసారి కృషిచేయాలి. ఆ సాయంకాలం ఉపదేశకుడు, ఆ విషయాన్ని విద్యార్థికి తెలియజేసి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్‌మెంట్ స్లిప్ (S-89)లో ఆ ప్రసంగ లక్షణానికి గుర్తుపెడ్తాడు. ప్రసంగాలిచ్చేవారు హాలులో ముందు వరుసలో కూర్చోవాలి. అలా చేస్తే సమయం వృథాకాకుండ వుంటుంది. పాఠశాల అధ్యక్షుడు ప్రతి విద్యార్థికి నేరుగా ఉపదేశమివ్వడానికి వీలు కలుగుతుంది. సమయము అనుమతించే కొలది, అవసరమైన సలహా ఇచ్చిన తరువాత విద్యార్థి వివరించని విలువైన ఆచరణాత్మకమైన అంశాలపై ఉపదేశకుడు వ్యాఖ్యానించవచ్చు. ప్రతి విద్యార్థి ప్రసంగం తరువాత పాఠశాల అధ్యక్షుడు సలహాకేగాని, లేక ప్రత్యేకంగా గుర్తించిన విషయాలకేగాని, రెండు నిమిషాలకన్న ఎక్కువ సమయాన్ని తీసికోకుండా జాగ్రత్తపడాలి. బైబిలులోని కోరదగిన ఉన్నతాంశాలను అందించలేకపోతే విద్యార్థికి వ్యక్తిగత సలహా యివ్వవచ్చు.
ప్రసంగాలకు సిద్ధపడుట: నియమించబడిన ప్రసంగానికి సిద్ధపడే ముందు, స్కూల్‌గైడ్ బుక్‌లోని విద్యార్థి పనిచేయవలసిన స్పీచ్ క్వాలిటీకి సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. రెండవ ప్రసంగానికి నియమించబడిన విద్యార్థులు, చదవాల్సిన బైబిలు భాగానికి తగినట్లుగా మూలాంశాన్ని ఎన్నుకోవాలి. షెడ్యూల్‌లో ఇవ్వబడిన మూలాంశానికి తగినట్లుగా మిగిలిన ప్రసంగాలు ఇవ్వబడతాయి.
సమయం: ఉపదేశకుని సలహా, ఆయన గుర్తించిన విషయాలను ఎత్తిచూపడంతో సహా ఏ ప్రసంగం కూడ సమయాన్ని మించిపోకూడదు. రెండు నుండి నాలుగు ప్రసంగాలు సమయం మించిపోతే యుక్తిగా ఆపుజేయాలి. ‘ఆపుజేసే గుర్తును’ చూపడానికి నియమించబడిన వ్యక్తి వెంటనే ఆ పని చేయాలి. మొదటి ప్రసంగం, బైబిలు ఉన్నతాంశాలనిచ్చే సహోదరులు సమయం మించిపోతున్నట్లయితే వారికి వ్యక్తిగతంగా ఉపదేశమివ్వాలి. అందరు జాగ్రత్తగా తమ సమయాన్ని గమనించాలి. పాట, ప్రార్థనకాక మొత్తం కార్యక్రమం: 45 నిమిషాలు.
వ్రాతపూర్వక పునఃసమీక్ష: అప్పుడప్పుడు, వ్రాతపూర్వక పునఃసమీక్ష ఉంటుంది. దానికి సిద్ధపడేటప్పుడు నియమించబడిన సమాచారమంతటిని, చదవడానికి నిర్ణయించబడిన బైబిలు భాగాన్ని పునఃసమీక్షించాలి. ఈ 25 నిమిషాల పునఃసమీక్షలో బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. తక్కిన సమయం ప్రశ్నా సమాధానాల చర్చకొరకు ఉపయోగించబడుతుంది. ప్రతి విద్యార్థి తాను రాసిన జవాబులను పరీక్షించుకుంటాడు. పాఠశాల అధ్యక్షుడు పునఃసమీక్ష ప్రశ్నల సమాధానాలను ప్రేక్షకులతో పరిశీలిస్తూ, ఎక్కువ కష్టమైన ప్రశ్నలపై అవధానాన్ని నిలిపి సమాధానాలన్నింటిని చదువుతూ, సమాధానాలను అందరు స్పష్టంగా అర్థంచేసికోవడానికి సహాయం చేస్తాడు. ఏదైన కారణం వలన, ప్రాంతీయ పరిస్థితులనుబట్టి, అవసరమైతే షెడ్యూలులో నిర్ణయించబడిన వ్రాతపూర్వక పునఃసమీక్షను ఒక వారం తరువాతనైనా జరుపవచ్చు.
పెద్ద సంఘాలు: పాఠశాలలో భాగము వహించడానికి 50 లేక అంతకంటె ఎక్కువమంది ఉన్న సంఘాల్లో ఇతర సలహాదారుల ముందు, నిర్ణయించబడిన ప్రసంగాలనివ్వడానికి అదనపు గ్రూపును ఏర్పాటు చేసికోవచ్చు. అవశ్యంగా, క్రైస్తవ సూత్రములకు తగినట్లు జీవిస్తున్న బాప్తిస్మం పొందని వ్యక్తులు కూడ ఈ పాఠశాలలో ప్రవేశించి ప్రసంగాలను పొందవచ్చు.
హాజరుకానివారు: ప్రతివారపు కార్యక్రమానికి హాజరవడానికి ప్రయత్నించడం, ప్రసంగాలకు బాగా సిద్ధపడడం, ప్రశ్నాభాగ కార్యక్రమంలో పాల్గొనడంద్వారా సంఘంలోవున్న అందరూ ఈ పాఠశాల యెడల తమకుగల మెప్పును చూపవచ్చు. విద్యార్థులందరు తమ ప్రసంగాలను మనఃపూర్వకంగా దృష్టిస్తారని ఆశిస్తాం. నియమించబడినప్పుడు విద్యార్థి హాజరుకానట్లయితే ఒకరు స్వచ్ఛందంగా ఆ ప్రసంగాన్ని తీసికొని ఆ కొద్ది సమయంలోనే, ఏవిధమైన అన్వయింపు తగినదని తాను తలస్తాడో ఆ ప్రకారం చేయవచ్చు. లేదా పాఠశాల అధ్యక్షుడు తగిన రీతిలో ప్రేక్షకులతో పాలుపంచుకొంటూ ఆ సమాచారాన్ని వివరించవచ్చును.
షెడ్యూలు
ఫిబ్ర. 28 బైబిలు పఠనం: నెహెమ్యా 9 నుండి 11
పాట నెం 2 (79)
నెం. 1: నిజమైన క్రైస్తవ ఐక్యతను ఎలా సాధించవచ్చు (యుడబ్ల్యు పు. 5-7 పేరాలు 1-7)
నెం. 2: నెహెమ్యా 9:4, 26-33, 36-38
నెం. 3: దేవుని ఎదుట నిజమైన యోగ్యతగల పనులు చేయుట (జిటి అధ్యా. 83)
నెం. 4: టిడి 17ఎ భూమి యెడల దేవుని సంకల్పం
మార్చి 7 బైబిలు పఠనం: నెహెమ్యా 12 మరియు 13
పాట నెం. 129 (66)
నెం. 1: నెహెమ్యా పుస్తకం ఎందుకు ప్రయోజనకరమైనది (ఎస్‌ఐ పు. 90-1 పేరాలు 16-19)
నెం. 2: నెహెమ్యా 13:15-18, 23-31
నెం. 3: శిష్యత్వముయొక్క బాధ్యత (జిటి అధ్యా. 84)
నెం. 4: టిడి 17సి భూమి ఎల్లప్పుడూ నివాసయోగ్యంగా ఉంటుంది
మార్చి 14 బైబిలు పఠనం: ఎస్తేరు 1 నుండి 5
పాట నెం. 132 (70)
నెం. 1: ఎస్తేరు పుస్తకానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పు. 91-2 పేరాలు 1-6)
నెం. 2: ఎస్తేరు 4:6-17
నెం. 3: స్వనీతిని గూర్చి జాగ్రత్తగావుండండి, వినయాన్ని ప్రశంసించండి (జిటి అధ్యా. 85)
నెం. 4: టిడి 19ఎ అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తించాలి
మార్చి 21 బైబిలు పఠనం: ఎస్తేరు 6 నుండి 10
పాట నెం. 133 (68)
నెం. 1: ఎస్తేరు పుస్తకం ఎందుకు ప్రయోజనకరమైనది (ఎస్‌ఐ పు. 94 పేరాలు 16-18)
నెం. 2: ఎస్తేరు 6:1-13
నెం. 3: తప్పిపోయిన కుమారుడు, ప్రేమగల అతని తండ్రి (జిటి అధ్యా. 86 పేరాలు 1-9)
నెం. 4: టిడి 22ఎ ఆత్మీయ స్వస్థత ఎందుకు ప్రాముఖ్యమైయుంది
మార్చి 28 బైబిలు పఠనం: యోబు 1 నుండి 3
పాట నెం. 62 (34)
నెం. 1: యోబు పుస్తకానికి ఉపోద్ఘాతం (ఎస్‌ఐ పు. 95-6 పేరాలు 1-6)
నెం. 2: యోబు 2:1-13
నెం. 3: తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చుట ఇతరులపై ప్రభావం చూపుతుంది (జిటి అధ్యా. 86 పేరాలు 10-20)
నెం. 4: టిడి 22బి దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతలను తెస్తుంది
ఏప్రిల్ 4 బైబిలు పఠనం: యోబు 4 నుండి 6
పాట నెం. 158 (85)
నెం. 1: క్రైస్తవ ఐక్యతకు ప్రాముఖ్యమైన కారకాలు (యుడబ్ల్యు పు. 8 పేరాలు 8 నుండి 8 [3])
నెం. 2: యోబు 6:1-11, 29, 30
నెం. 3: అభ్యాససిద్ధమైన జ్ఞానముతో భవిష్యత్తు కొరకు సమకూర్చుకొనుట (జిటి అధ్యా. 87)
నెం. 4: టిడి 22సి ఆధునికకాల విశ్వాస స్వస్థతకు దైవిక అనుగ్రహం లేదు
ఏప్రిల్ 11 బైబిలు పఠనం: యోబు 7 నుండి 9
పాట నెం. 213 (67)
నెం. 1: క్రైస్తవ ఐక్యతకు దోహదపడే కారకాలు (యుడబ్ల్యు పు. 9 పేరాలు 8 [4] నుండి 9)
నెం. 2: యోబు 9:1-15
నెం. 3: ధనవంతుడు, లాజరు (జిటి అధ్యా. 88 పేరాలు 1-10)
నెం. 4: టిడి 22డి భాషలలో మాట్లాడుట కేవలం తాత్కాలిక ఏర్పాటే
ఏప్రిల్ 18 బైబిలు పఠనం: యోబు 10 నుండి 12
పాట నెం. 191 (9)
నెం. 1: నిజమైన క్రైస్తవులు విచ్ఛిన్నకర ప్రభావాలకు దూరంగా ఉంటారు (యుడబ్ల్యు పు. 10-11 పేరాలు 10-12)
నెం. 2: యోబు 12:1-16
నెం. 3: ధనవంతుడు, లాజరుయొక్క ఉపమాన భావమేమిటి (జిటి అధ్యా. 88 పేరాలు 11-21)
నెం. 4: టిడి 23బి పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారు
ఏప్రిల్ 25 బైబిలు పఠనం: యోబు 13 నుండి 15
పాట నెం. 97 (50)
నెం. 1: యెహోవాను తెలుసుకొని, ప్రశంసించండి (యుడబ్ల్యు పు. 12-13 పేరాలు 1-4)
నెం. 2: యోబు 13:1-13
నెం. 3: యూదయకు కనికరముతోకూడిన ప్రయాణం (జిటి అధ్యా. 89)
నెం. 4: టిడి 24బి నరకంలో అక్షరార్థమైన అగ్నిలేదు
మే 2 బైబిలు పఠనం: యోబు 16 నుండి 18
పాట నెం. 185 (98)
నెం. 1: యెహోవా ప్రేమను అనుకరించండి (యుడబ్ల్యు పు. 14-15 పేరాలు 5-7)
నెం. 2: యోబు 16:1-11, 22
నెం. 3: యేసు పునరుత్థాన నిరీక్షణను గూర్చి మాట్లాడుట (జిటి అధ్యా. 90)
నెం. 4: టిడి 24సి అగ్ని అంటే నాశనానికి సూచన
మే 9 బైబిలు పఠనం: యోబు 19 నుండి 20
పాట నెం. 85 (44)
నెం. 1: దేవుని గూర్చిన సత్యం నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేయండి (యుడబ్ల్యు పు. 15-17 పేరాలు 8 నుండి 11 [2])
నెం. 2: యోబు 19:14-29
నెం. 3: యేసు లాజరును పునరుత్థానం చేయుట (జిటి అధ్యా. 91)
నెం. 4: టిడి 24ఇ ధనవంతుడు, లాజరు వృత్తాంతం—నిత్యబాధకు నిరూపణ కాదు
మే 16 బైబిలు పఠనం: యోబు 21, 22
పాట నెం. 95 (52)
నెం. 1: యెహోవా ఒక్కడే (యుడబ్ల్యు పు. 17-18 పేరాలు 11 [3] నుండి 12)
నెం. 2: యోబు 21:19-34
నెం. 3: దేవుని మంచితనానికి కృతజ్ఞత కనపర్చండి (జిటి అధ్యా. 92)
నెం. 4: టిడి 25బి జన్మదినాలను లేదా క్రిస్‌మస్‌ను తొలి క్రైస్తవులు ఆచరించలేదు
మే 23 బైబిలు పఠనం: యోబు 23 నుండి 26
పాట నెం. 138 (71)
నెం. 1: దేవుని నామములో నడవడం అంటే అర్థమేమిటి (యుడబ్ల్యు పు. 18-19 పేరాలు 13-15)
నెం. 2: యోబు 24:1, 2, 14-25
నెం. 3: మనుష్యకుమారుడు బయలు పరచబడినప్పుడు (జిటి అధ్యా. 93)
నెం. 4: టిడి 26ఎ ఆరాధనలో ప్రతిమలను, విగ్రహాలను ఉపయోగించడం దేవున్ని అవమానపరుస్తుంది
మే 30 బైబిలు పఠనం: యోబు 27 నుండి 29
పాట నెం. 180 (100)
నెం. 1: బైబిలు దేవుని వాక్యమని అంగీకరించడానికి ఇతరులకు సహాయపడండి (యుడబ్ల్యు పు. 20-2 పేరాలు 1-6)
నెం. 2: యోబు 29:2-18
నెం. 3: ప్రార్థన మరియు వినయములయొక్క అవసరత (జిటి అధ్యా. 94)
నెం. 4: టిడి 26బి విగ్రహారాధన ఇశ్రాయేలు జనాంగానికి మరణకరమని నిరూపించబడెను
జూన్ 6 బైబిలు పఠనం: యోబు 30, 31
పాట నెం. 46 (20)
నెం. 1: ప్రతిదినం బైబిలు చదవండి (యుడబ్ల్యు పు. 23-5 పేరాలు 7-11)
నెం. 2: యోబు 31:23-37
నెం. 3: విడాకులు, పిల్లలను ప్రేమించుటను గూర్చిన పాఠములు (జిటి అధ్యా. 95)
నెం. 4: టిడి 26సి “సామ్యమైన” ఆరాధన దేవుడు అంగీకరించడు
జూన్ 13 బైబిలు పఠనం: యోబు 32 మరియు 33
పాట నెం. 59 (31)
నెం. 1: యెహోవాను గూర్చి నేర్చుకోవడానికి అధ్యయనం చేయండి (యుడబ్ల్యు పు. 25-26 పేరాలు 12 నుండి 12 [1])
నెం. 2: యోబు 33:1-6, 23-33
నెం. 3: యేసు మరియు ధనవంతుడైన ఒక యువ అధికారి (జిటి అధ్యా. 96)
నెం. 4: టిడి 27ఎ మిశ్రిత విశ్వాసం ఐక్యతను తేలేదు
జూన్ 20 వ్రాతపూర్వక పునఃసమీక్ష నెహెమ్యా 9 నుండి యోబు 33 వరకు
పాట నెం. 42 (4)
జూన్ 27 బైబిలు పఠనం: యోబు 34 నుండి 36
పాట నెం. 47 (21)
నెం. 1: బైబిలు మూలాంశాన్ని లేఖనాలు సందర్భాన్ని పరిశీలించండి (యుడబ్ల్యు పు. 26 పేరాలు 12 [2] మరియు 12 [3])
నెం. 2: యోబు 34:1-15
నెం. 3: యేసు చెప్పిన ద్రాక్షతోట ఉపమానం (జిటి అధ్యా. 97)
నెం. 4: టిడి 27బి “అన్ని మతాల్లో మంచివుందనడం” సత్యం కాదు
జూలై 4 బైబిలు పఠనం: యోబు 37, 38
పాట నెం. 162 (89)
నెం. 1: వ్యక్తిగత అన్వయింపుజేసి, మీరు నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోండి (యుడబ్ల్యు పు. 26-8 పేరాలు 12 [4] నుండి 13)
నెం. 2: యోబు 37:5-14, 23, 24
నెం. 3: ముందున్న దానికొరకు యేసు తన శిష్యులను సిద్ధం చేయుట (జిటి అధ్యా. 96)
నెం. 4: టిడి 29ఎ క్రైస్తవులు దేవుని వ్యక్తిగత నామాన్ని ఉపయోగించాలి
జూలై 11 బైబిలు పఠనం: యోబు 39 నుండి 40
పాట నెం. 105 (46)
నెం. 1: యేసును గూర్చి ప్రవక్తలు చెప్పినదేమిటి? (యుడబ్ల్యు పు. 29-31 పేరాలు 1-5)
నెం. 2: యోబు 40:1-14
నెం. 3: అబ్రాహాము పోగొట్టుకొనిన కుమారుని యేసు పునరుద్ధరించుట (జిటి అధ్యా. 99)
నెం. 4: టిడి 29సి దేవుని ఉనికిని గూర్చిన సత్యాలు
జూలై 18 బైబిలు పఠనం: యోబు 41, 42
పాట నెం. 106 (55)
నెం. 1: యోబు పుస్తకం ఎందుకు ప్రయోజనకరమైవుంది (ఎస్‌ఐ పు. 100 పేరాలు 39-43)
నెం. 2: యోబు 42:1-10, 12-17
నెం. 3: మీనాలను గూర్చిన ఉపమానం (జిటి అధ్యా. 100)
నెం. 4: టిడి 29డి దేవుని లక్షణాలను గుర్తించుట
జూలై 25 బైబిలు పఠనం: కీర్తనలు 1 నుండి 6
పాట నెం. 168 (84)
నెం. 1: కీర్తనల పుస్తకానికి ఉపోద్ఘాతం—1వ భాగం (ఎస్‌ఐ పు. 101 పేరాలు 1-5)
నెం. 2: కీర్తన 2:1-12
నెం. 3: మరియ చేసిన మంచి కార్యానికి యేసు ఆమెను సమర్ధించుట (జిటి అధ్యా. 101)
నెం. 4: టిడి 29ఎఫ్ అందరూ ఒకే దేవునికి ఆరాధించడం లేదు
ఆగ. 1 బైబిలు పఠనం: కీర్తనలు 7 నుండి 10
పాట నెం. 138 (71)
నెం. 1: కీర్తనల పుస్తకానికి ఉపోద్ఘాతం—2వ భాగం (ఎస్‌ఐ 102 పేరాలు 6-11)
నెం. 2: కీర్తన 8:1–9:5
నెం. 3: యెరూషలేము లోనికి క్రీస్తు విజయోత్సాహ ప్రవేశం (జిటి అధ్యా. 102)
నెం. 4: టిడి 30ఎ యెహోవాసాక్షుల ప్రారంభం
ఆగ. 8 బైబిలు పఠనం: కీర్తనలు 11 నుండి 17
పాట నెం. 64 (35)
నెం. 1: ప్రవచనం దృష్టాంతాలయందు ధ్యానముంచండి (యుడబ్ల్యు పు. 32-3 పేరాలు 7 నుండి 8 [2])
నెం. 2: కీర్తన 14:1–15:5
నెం. 3: దేవుని ఆలయాన్ని అపవిత్రపరచే వారిని యేసు మరలా ఖండిస్తాడు (జిటి అధ్యా. 103)
నెం. 4: టిడి 31బి యేసు దేవుని కుమారుడు మరియు నియమిత రాజు
ఆగ. 15 బైబిలు పఠనం: కీర్తనలు 18 నుండి 20
పాట నెం. 79 (104)
నెం. 1: మన ప్రధాన యాజకుడు ముందుగా సూచించబడ్డాడు (యుడబ్ల్యు పు. 33 పేరాలు 8 [3] మరియు 8 [4])
నెం. 2: కీర్తన 19:1-14
నెం. 3: దేవుని స్వరం మూడవసారి వినబడుట (జిటి అధ్యా. 104)
నెం. 4: టిడి 31డి రక్షణకొరకు యేసుక్రీస్తునందు నమ్మకముంచుట ఆవశ్యకము
ఆగ. 22 బైబిలు పఠనం: కీర్తనలు 21 నుండి 24
పాట నెం. 144 (78)
నెం. 1: విశ్వాసం, పశ్చాత్తాపం ఎందుకు ప్రాముఖ్యమైవున్నాయి (యుడబ్ల్యు పు. 33-7 పేరాలు 9-14)
నెం. 2: కీర్తన 23:1–24:10
నెం. 3: శపించబడిన అంజూరపు చెట్టు దేనిని సూచిస్తుంది (జిటి అధ్యా. 105)
నెం. 4: టిడి 31ఇ యేసునందు నమ్మకముంచడమే చాలదు
ఆగ. 29 బైబిలు పఠనం: కీర్తనలు 25 నుండి 29
పాట నెం. 160 (88)
నెం. 1: దేవునికి లోబడడమే నిజమైన స్వతంత్రతను తెస్తుంది (యుడబ్ల్యు పు. 38-40 పేరాలు 1-5)
నెం. 2: కీర్తన 26:1-12
నెం. 3: మతనాయకులు రంగు ఎలా బయటపడుతుంది (జిటి అధ్యా. 106)
నెం. 4: టిడి 33బి దేవుని రాజ్యం మానవులకు ఏమి చేస్తుంది
సెప్టెం. 5 బైబిలు పఠనం: కీర్తనలు 30 నుండి 33
పాట నెం. 130 (58)
నెం. 1: నేడు నిజమైన స్వతంత్రతను ఎక్కడ కనుగొనవచ్చు (యుడబ్ల్యు పు. 40-2 పేరాలు 6-9)
నెం. 2: కీర్తన 32:1-11
నెం. 3: వివాహపు విందును గూర్చిన ఉపమానం దేన్ని సూచిస్తుంది (జిటి అధ్యా. 107)
నెం. 4: టిడి 33సి క్రీస్తు విరోధులు ఇంకనూ పనిచేస్తుండగానే రాజ్యపాలన ప్రారంభమౌతుంది
సెప్టెం. 12 బైబిలు పఠనం: కీర్తనలు 34 నుండి 36
పాట నెం. 167 (106)
నెం. 1: లోకసంబంధమైన స్వతంత్రత నిజానికి దాసత్వమే (యుడబ్ల్యు పు. 42-3 పేరాలు 10-12)
నెం. 2: కీర్తన 36:1-12
నెం. 3: వారు యేసును చిక్కులో పడవేయలేకపోయారు (జిటి అధ్యా. 108)
నెం. 4: టిడి 33ఇ దేవుని ప్రభుత్వం మానవ ప్రయత్నాలద్వారా రాదు
సెప్టెం. 19 బైబిలు పఠనం: కీర్తనలు 37 నుండి 39
పాట నెం. 109 (75)
నెం. 1: దుష్టసాంగత్యాలను ఎలా గుర్తించాలి (యుడబ్ల్యు పు. 44-5 పేరాలు 13, 14)
నెం. 2: కీర్తన 37:23-38
నెం. 3: యేసు తన వ్యతిరేకులను నిందించడం (జిటి అధ్యా. 110)
నెం. 4: టిడి 34ఎ “లోకాంతం” అనగా అర్థమేమి
సెప్టెం. 26 బైబిలు పఠనం: కీర్తనలు 40 నుండి 44
పాట నెం. 207 (112)
నెం. 1: ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసిన గొప్ప వివాదం (యుడబ్ల్యు పు. 46-7 పేరాలు 1-3)
నెం. 2: కీర్తన 41:1-13
నెం. 3: దేవాలయంలో యేసు పరిచర్య పూర్తిచేయబడెను (జిటి అధ్యా. 110)
నెం. 4: టిడి 34బి అంత్యదినాల సూచనల విషయంలో మెలకువ అవసరం
అక్టో. 3 బైబిలు పఠనం: కీర్తనలు 45 నుండి 49
పాట నెం. 190 (107)
నెం. 1: యథార్థవంతుల విశ్వాసాన్ని అనుకరించండి (యుడబ్ల్యు పు. 47-52 పేరాలు 4-11)
నెం. 2: కీర్తన 45:1-7, 10-17
నెం. 3: యేసు అంత్యదినాలకు సూచన ఇచ్చుట (జిటి అధ్యా. 111 పేరాలు 1-11)
నెం. 4: టిడి 36బి విధేయతగల మానవజాతికి దేవుడు నిత్యజీవాన్ని వాగ్దానం చేయుట
అక్టో. 10 బైబిలు పఠనం: కీర్తనలు 50 నుండి 52
పాట నెం. 170 (95)
నెం. 1: సత్యం యెహోవాను గౌరవిస్తుంది (యుడబ్ల్యు పు. 52-4 పేరాలు 12-15)
నెం. 2: కీర్తన 51:1-17
నెం. 3: అంత్యదినాలనుగూర్చి యేసు ఇంకనూ చెప్పుట (జిటి అధ్యా. 111 పేరాలు 12-19)
నెం. 4: టిడి 36డి క్రీస్తు శరీరమందున్నవారు మాత్రమే పరలోకానికి వెళ్తారు
అక్టో. 17 బైబిలు పఠనం: కీర్తనలు 53 నుండి 57
పాట నెం. 103 (87)
నెం. 1: దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడమనేది మనకేమి బోధిస్తుంది (యుడబ్ల్యు పు. 55-7 పేరాలు 1-7)
నెం. 2: కీర్తన 55:1, 2, 12-23
నెం. 3: బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు (జిటి అధ్యా. 111 పేరాలు 20-8)
నెం. 4: టిడి 36ఇ అసంఖ్యాకులైన “వేరే గొర్రె”లకు నిత్యజీవం వాగ్దానం చేయబడింది
అక్టో. 24 వ్రాతపూర్వక పునఃసమీక్ష యోబు 34 నుండి కీర్తన 57 వరకు
పాట నెం. 34 (8)
అక్టో. 31 బైబిలు పఠనం: కీర్తనలు 58 నుండి 62
పాట నెం. 50 (23)
నెం. 1: దేవునియందు అన్యాయం లేదు (యుడబ్ల్యు పు. 58-61 పేరాలు 8-16)
నెం. 2: కీర్తన 62:1-12
నెం. 3: తలాంతులను గూర్చిన ఉపమానం (జిటి అధ్యా. 111 పేరాలు 29-37)
నెం. 4: టిడి 38బి వివాహ బంధం ఘనమైందిగా ఉండాలి
నవం. 7 బైబిలు పఠనం: కీర్తనలు 63 నుండి 67
పాట నెం. 45 (28)
నెం. 1: యెహోవాపై ఆధారపడండి—దుష్టాత్మలను ఎదిరించండి (యుడబ్ల్యు పు. 62-4 పేరాలు 1-5)
నెం. 2: కీర్తన 65:1-13
నెం. 3: క్రీస్తు రాజ్యాధికారంతో వచ్చినప్పుడు (జిటి అధ్యా. 111 పేరాలు 38-46)
నెం. 4: టిడి 38సి శిరసత్వపు ఏర్పాటును క్రైస్తవులు గౌరవించాలి
నవం. 14 బైబిలు పఠనం: కీర్తనలు 68, 69
పాట నెం. 82 (105)
నెం. 1: అపవాది కపటోపాయాల విషయంలో మెలకువగా ఉండండి (యుడబ్ల్యు పు. 64-7 పేరాలు 6-12)
నెం. 2: కీర్తన 68:1-11, 32-35
నెం. 3: యేసు చివరి పస్కా సమీపమైంది (జిటి అధ్యా. 112)
నెం. 4: టిడి 38డి పిల్లల యెడల క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత
నవం. 21 బైబిలు పఠనం: కీర్తనలు 70 నుండి 73
పాట నెం. 73 (6)
నెం. 1: దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి (యుడబ్ల్యు పు. 67-9 పేరాలు 13-15)
నెం. 2: కీర్తన 72:1-20
నెం. 3: యేసు, వినయాన్ని గూర్చిన పాఠం నేర్చుట (జిటి అధ్యా. 113)
నెం. 4: టిడి 38ఇ క్రైస్తవులు కేవలము క్రైస్తవులనే వివాహామాడవలెను
నవం. 28 బైబిలు పఠనం: కీర్తనలు 74 నుండి 77
పాట నెం. 113 (62)
నెం. 1: జ్ఞానం, విశ్వాసం, పునరుత్థానం (యుడబ్ల్యు పు. 70-3 పేరాలు 1-7)
నెం. 2: కీర్తన 76:1-12
నెం. 3: యేసు జ్ఞాపకార్థ దినాచరణను ఏర్పాటు చేయుట (జిటి అధ్యా. 114)
నెం. 4: టిడి 38ఎఫ్ నిజ క్రైస్తవులు బహుభార్యత్వం కలవారు కాదు
డిశం. 5 బైబిలు పఠనం: కీర్తనలు 78, 79
పాట నెం. 18 (118)
నెం. 1: మరణము, హేడిస్‌యొక్క తాళాలు యేసునొద్ద ఉన్నాయి (యుడబ్ల్యు పు. 73-7 పేరాలు 8-15)
నెం. 2: కీర్తన 79:1-13
నెం. 3: యేసు ఓపికతో తన శిష్యులకు ప్రేమ, వినయాన్ని బోధిస్తాడు (జిటి అధ్యా. 115)
నెం. 4: టిడి 39ఎ మరియ, యేసుకు తల్లిగానీ “దేవునికి తల్లి” కాదు
డిశం. 12 బైబిలు పఠనం: కీర్తనలు 80 నుండి 85
పాట నెం. 93 (48)
నెం. 1: దేవునికి శాశ్వత రాజ్యాన్ని గుణగ్రహించండి (యుడబ్ల్యు పు. 78-81 పేరాలు 1-9)
నెం. 2: కీర్తన 83:1-18
నెం. 3: యేసు తాను వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధము చేయుట (జిటి అధ్యా. 116 పేరాలు 1-14)
నెం. 4: టిడి 39సి మరియ “నిత్య కన్యక” కాదని బైబిలు చూపిస్తుంది
డిశం. 19 బైబిలు పఠనం: కీర్తనలు 86 నుండి 89
పాట నెం. 57 (29)
నెం. 1: ఈ రాజ్యము దేవుని ప్రథమ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది (యుడబ్ల్యు పు. 81-2 పేరాలు 10-12)
నెం. 2: కీర్తన 86:1-17
నెం. 3: యేసు నిజమైన స్నేహితులు ఎవరు (జిటి అధ్యా. 116 పేరాలు 15-25)
నెం. 4: టిడి 40ఎ జ్ఞాపకార్థ దినమును గూర్చి లేఖనాలు ఏమి చెబుతున్నాయి
డిశం. 26 బైబిలు పఠనం: కీర్తనలు 90 నుండి 94
పాట నెం. 190 (107)
నెం. 1: ఆ రాజ్యం ఇప్పటికే ఏమి నెరవేర్చింది (యుడబ్ల్యు పు. 83-6 పేరాలు 13-15)
నెం. 2: కీర్తన 90:1-17
నెం. 3: యేసు తన శిష్యులను సిద్ధపరచి, ప్రోత్సహించుట (జిటి అధ్యా. 116 పేరాలు 26-37)
నెం. 4: టిడి 40బి మాస్ ఆచరణ లేఖనవిరుద్ధం
జన. 2 బైబిలు పఠనం: కీర్తనలు 95 నుండి 101
పాట నెం. 172 (92)
నెం. 1: మనం రాజ్యాన్ని ఎలా మొట్టమొదట వెదకగలం (యుడబ్ల్యు పు. 87-9 పేరాలు 1-6)
నెం. 2: కీర్తన 100:1–101:8
నెం. 3: మేడగదిలో యేసు చేసిన ముగింపు ప్రార్థన (జిటి అధ్యా. 116 పేరాలు 38-51)
నెం. 4: టిడి 41ఎ దేవుని రాజ్య ఏర్పాటు మనుష్యులందరి కొరకు
జన. 9 బైబిలు పఠనం: కీర్తనలు 102 నుండి 104
పాట నెం. 1 (77)
నెం. 1: తొలి శిష్యుల మాదిరిని అనుసరించండి (యుడబ్ల్యు పు. 90-1 పేరాలు 7-9)
నెం. 2: కీర్తన 103:1-14, 21, 22
నెం. 3: తోటలో కలిగిన మానసిక వ్యధ (జిటి అధ్యా. 117)
నెం. 4: టిడి 41బి క్రైస్తవేతరులు కూడా సమానంగా రక్షింపబడే అవకాశం కల్గియున్నారు
జన. 16 బైబిలు పఠనం: కీర్తనలు 105, 106
పాట నెం. 201 (101)
నెం. 1: వ్యక్తిగతంగా, రాజ్యమును మొదట స్థానంలో ఉంచండి (యుడబ్ల్యు పు. 91-4 పేరాలు 10-15)
నెం. 2: కీర్తన 106:1-12, 47, 48
నెం. 3: యేసు అప్పగింపబడి, బంధింపబడుట (జిటి అధ్యా. 118)
నెం. 4: టిడి 42ఎ క్రైస్తవుల యెడల వ్యతిరేకతకుగల కారణము
జన. 23 బైబిలు పఠనం: కీర్తనలు 107 నుండి 109
పాట నెం. 202 (82)
నెం. 1: యోహాను యిచ్చిన బాప్తిస్మం గూర్చి లేఖనాలు ఏమి చెబుతున్నాయి (యుడబ్ల్యు పు. 95-6 పేరాలు 1-5)
నెం. 2: కీర్తన 108:1-13
నెం. 3: యేసు తీవ్రంగా కొట్టబడి, దూషింపబడుట (జిటి అధ్యా. 119)
నెం. 4: టిడి 42సి భర్త, తనను దేవుని నుండి వేరుచేయడానికి భార్య అనుమతించకూడదు
జన. 30 బైబిలు పఠనం: కీర్తనలు 110 నుండి 115
పాట నెం. 17 (12)
నెం. 1: మరణంలోనికి బాప్తిస్మం (యుడబ్ల్యు పు. 97-8 పేరాలు 6-8)
నెం. 2: కీర్తన 110:1-7; 114:1-8
నెం. 3: మనుష్యులను గూర్చిన భయమే పేతురు యేసును నిరాకరించడానికి నడుపుతుంది (జిటి అధ్యా. 120)
నెం. 4: టిడి 42డి దేవుని సేవించకుండా భార్య అడ్డగించుటను భర్త అనుమతించకూడదు
ఫిబ్ర. 6 బైబిలు పఠనం: కీర్తనలు 116 నుండి 119:32
పాట నెం. 195 (105)
నెం. 1: “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మం (యుడబ్ల్యు పు. 98 పేరా 9)
నెం. 2: కీర్తన 116:1-19
నెం. 3: మహాసభ యెదుట, ఆ పిమ్మట పిలాతు ఎదుట యేసు ధైర్యంగా మాట్లాడుతాడు (జిటి అధ్యా. 121)
నెం. 4: టిడి 43ఎ దేవుడు ఆలకించే ప్రార్థనలు
ఫిబ్ర. 13 బైబిలు పఠనం: కీర్తన 119:33-112
పాట నెం. 59 (31)
నెం. 1: బాప్తిస్మం మరియు క్రైస్తవ బాధ్యత (యుడబ్ల్యు పు. 99-102 పేరాలు 10-14)
నెం. 2: కీర్తన 119:97-112
నెం. 3: పిలాతు గాని, హేరోదు గాని యేసుయందు ఏ దోషాన్ని కనుగొనలేకపోయారు (జిటి అధ్యా. 122)
నెం. 4: టిడి 43సి కొన్ని రకాల ప్రార్థనలు ఎందుకు వ్యర్థమైయున్నవి
ఫిబ్ర. 20 వ్రాతపూర్వక పునఃసమీక్ష కీర్తనలు 58 నుండి 119:112 వరకు
పాట నెం. 155 (29)