దైవపరిపాలనా వార్తలు
కామోరో: ప్రచారకుల సంఖ్య క్రొత్త శిఖరాగ్రమైన 21,323కు చేరుకోవటంతోపాటు జూలైలో క్రొత్త బ్రాంచి కార్యాలయం స్థాపించబడింది.
ఇండియా: జనవరి 1, 1995 నుండి కేరళలో ఎనిమిదవ సర్క్యూట్ పనిచేయనారంభించడంతో, దేశంలో మొత్తం సర్క్యూట్‌ల సంఖ్య 23కు చేరింది. అందులో నాలుగు ‘ఎ’ మరియు ‘బి’ వర్గాలుగా విభాగించబడ్డాయి.
ఫిలిపైన్స్: క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,17,519 అని ఫిబ్రవరి ప్రచారకుల నివేదిక తెలియజేసింది. బైబిలు పఠనాలు 1,00,000కు మించాయి, మొదటిసారిగా 1,00,146 పఠనాలు నివేదించబడ్డాయి. నాలుగు రంగుల ముద్రణ ప్రారంభం కావడంవల్ల పత్రికల అందింపులు నవంబరు 1993 కన్నా 1,00,000 కంటే ఎక్కువకు పెరిగాయి.