రాజ్యాన్ని గూర్చిన వాక్యం—దాని అర్థాన్ని గ్రహించడం
1 విత్తువానిగూర్చిన తన ఉపమానంలో, “మంచి నేల”పై విత్తబడిన విత్తనం ‘వాక్యమును విని గ్రహించువానిని’ చిత్రీకరిస్తుందని యేసు చెప్పాడు. (మత్త. 13:23) రాజ్యాన్ని గూర్చి విన్న తర్వాత, మనం దానిని ‘గ్రహించామా’? అది మన జీవితాలను ఎంతమేరకు ప్రభావితం చేస్తుంది? మనం రాజ్యాసక్తులను ముందుంచి, తద్వారా వర్తమానాన్ని గ్రహించామని బయల్పరుస్తున్నామా?
2 రాజ్య వర్తమానాన్ని సరిగ్గా గ్రహించడానికి వ్యక్తిగత పఠనం అవసరము. అందించబడిన ఆత్మీయ ఆహారాన్ని గూర్చి మనం ధ్యానించడానికి సమయం తీసుకోవలసిన అవసరముంది. కావలికోటను త్వరత్వరగా చదువుకు పోవడం, రుచికరమైన పోషకాహారాన్ని త్వరగా తినడం వంటిదే. ఆత్మీయాహారాన్ని గూర్చి ఎక్కువగా తలంచడానికి మీరు సమయాన్ని తీసుకుంటారా? మరింత ప్రయోజనం పొందడానికి, ప్రేరణ మరియు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆకలి ఉండాలి. ఇవి లేనట్లయితే, ఇతర చర్యలు వ్యక్తిగత పఠన ప్రయోజనాలను లేదా దానికి మనకు అవసరమైన సమయాన్ని తగ్గిస్తాయి. మంచి పఠన పట్టిక ప్రకారము ఉండడం సులభం కాదు. ప్రాముఖ్యమైన వాటిని జాగ్రత్తగా సమతూకం చేయవలసిన అవసరమున్నప్పటికీ, పొందనున్న ఆత్మీయ సంపద వెలకట్టలేనిది.—సామె. 3:13-18; కొలొ. 1:27.
3 లేఖనములను పరిశీలించుట ప్రతిరోజు రాజ్యాన్ని గూర్చిన అనుకూలమైన, ప్రోత్సాహకరమైన తలంపులతో ఉండటానికి మనకు సహాయం చేస్తుంది. “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు” లేఖనబాగాన్ని, వ్యాఖ్యానాలను చదవడానికి ప్రతిరోజు కొన్ని నిమిషాలు తీసుకోడానికి పథకం వేసుకుంటారు. (మత్త. 5:3 NW) రాజ్యము యొక్క వివిధ అంశాలను అనేక లేఖనభాగాలు వివరిస్తాయి. ఉదాహరణకు, నవంబరు 22, 1994, నాటి లేఖనభాగము మత్తయి 13:4. ఆ వ్యాఖ్యానము రాజ్య నిరీక్షణను చర్చించి, బంధువులతోను, పొరుగువారితోను అనారోగ్యకరమైన సహవాసము వలన కలిగే అపాయాలనుగూర్చి గుర్తుచేసింది. ప్రపంచవ్యాప్తంగానున్న బేతేలు గృహాల్లో, ప్రతి పనిరోజు ఉదయాన 15-నిమిషాలు ప్రతిదిన లేఖనాల చర్చ జరుగుతుందన్న వాస్తవం ఆనాటి లేఖనాన్ని కలిసి ధ్యానించవలసిన ప్రాముఖ్యతను, ప్రయోజనాలను నొక్కి చెబుతుంది. మీ దైనందిన చర్యల్లో మీ కుటుంబం ఇలా ధ్యానించడంలో భాగం వహిస్తుందా?
4 మీరు రాజ్యం యెడల మెప్పుదలను వృద్ధి చేసుకుంటుండగా, యితరులతో రాజ్య వర్తమానాన్ని పంచుకోటానికి, ఎంతో ప్రేరణ కలుగుతుంది. కావలికోట మరియు జరిల్లు! పత్రికలు అందజేసే దాన్ని, మన మనస్సులను తాజా, వర్తమాన సమాచారంతో నింపే మానసిక ఇంధనంతో పోల్చవచ్చు. లోకానికి దేవుని రాజ్యం ఎంత అవసరమో అనే దాని గూర్చిన అత్యంత శ్రద్ధను కాపాడుకోడానికి అవి సహాయపడతాయి. “క్రీస్తు మనస్సు కలిగిన” ఆత్మీయ వ్యక్తులుగా ఉండటానికి అవి మనకు సహాయపడతాయి. (1 కొరి. 2:15, 16) ఇదంతా మన నిరీక్షణను దృఢపరచి, ఇతరులతో రాజ్య నిరీక్షణను పంచుకోవాలనే మన ఆసక్తిని అధికం చేస్తుంది.—1 పేతు. 3:15.
5 మనం వ్యక్తిగతంగా రాజ్య వర్తమానాన్ని గ్రహించడం ప్రాముఖ్యము. తన సార్వభౌమాధిపత్యాన్ని ఉన్నతపరచుకోడానికి, దుష్టత్వాన్ని అంతం చేయడానికి, ఒక క్రొత్త లోకాన్ని—పరదైసును తేవడానికి దేవుడు ఉపయోగించుకునే మాధ్యమం ఈ రాజ్యమే. మన జీవితంలో దానిని మొదట ఉంచాలని యేసు మనకు ఆజ్ఞాపించాడు. దాని పరిపాలన క్రింద జీవించడానికి మనం గొర్రెలవంటి ప్రజలముగా ఉండాలి. (మత్త. 6:10, 33) దాని ఆశీర్వాదాలను అనుభవించడానికి, మీకున్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి.