సవరించబడిన బహిరంగ ప్రసంగాలనుండి ప్రయోజనం పొందుట
1 యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర సామెతలు 4:18 నందలి మాటల్లో కచ్చితంగా వివరించబడింది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.”
2 దీనికి అనుగుణంగా, క్రైస్తవ సంఘం సమయానుకూలమైన స్పష్టీకరణను మరియు బైబిలు బోధలపై తాజా సమాచారాన్ని పొందుతూనే ఉంటుంది. (మత్త. 24:45-47) మీరు యెహోవాసాక్షులతో సహవాసము చేయడం ప్రారంభించిన దగ్గరనుండి మీరు గమనించినటువంటి దీనికి సంబంధించిన ఉదాహరణలను మీరు చెప్పగలిగి ఉండవచ్చు. బహిరంగ ప్రసంగాలతోసహా సంఘ కూటములు, అధికమౌతున్న సత్యము యొక్క వెలుగుతో కలిసి కొనసాగటానికి సహాయం చేస్తాయి.
3 సవరించబడిన క్లుప్తప్రతులు: ఇటీవల, సంస్థ బహిరంగ ప్రసంగముయొక్క అనేక క్లుప్తప్రతులను నవీకరించింది. తాజా సమాచారం వాటిలో చేర్చబడి, ముఖ్యమైన అంశాలు స్పష్టీకరించబడినాయి. సంఘం ఈ తాజా సమాచారంనుండి పూర్తి ప్రయోజనము పొందాలని కోరుకుంటే, బహిరంగ ప్రసంగాలు ఇచ్చే సహోదరులు క్రొత్తగా ఇవ్వబడిన క్లుప్తప్రతులను మాత్రమే ఉపయోగించాలి.
4 బహిరంగ ప్రసంగాలనుండి పూర్తిగా ప్రయోజనం పొందాలనే దృక్పథముతో, ఇవ్వబడే ప్రసంగాలయొక్క శీర్షికలనుగూర్చి కొంత తలంచండి. బహిరంగ ప్రసంగకూటమునకు హాజరవుటకు ముందుగా, ఆ అంశముపై దైవిక మూలాలనుండి వచ్చిన తాజా సమాచారాన్ని పునరుక్తి చేసికొనటానికి ప్రయత్నించండి. తర్వాత, వింటున్నప్పుడు ఈ సమాచారంపై వచ్చే వికాసాన్ని ఎదురుచూడవచ్చు. భవిష్యత్తునందు ఉపయోగంకొరకు ఈ సత్యాలను అందజేసే క్రొత్త పద్ధతులనుగూర్చి గమనించండి. ఇలా చేయటంవల్ల మీరు సవరించబడిన బహిరంగ ప్రసంగాలద్వారా గొప్ప ప్రయోజనాన్ని పొందుతారని ఇది హామీ యిస్తుంది.
5 బహిరంగ ప్రసంగాలు వినేవారికి జ్ఞానాన్నిచ్చి పురికొల్పాలికూడా: యేసు మాట్లాడినపుడు, ఆయన తన శ్రోతల హృదయాలను చేరుకొనేవాడు. మత్తయి 7:28 నివేదిస్తున్నట్లుగా యేసు ఇచ్చిన బహిరంగ ప్రసంగాలన్నిటిలో అత్యంత పేరుగాంచినదైన కొండమీది ప్రసంగ ముగింపునందు: “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.”
6 యేసు ఉదాహరణను మనస్సులోవుంచుకొని, పెద్దల సభలు క్రొత్తగా బహిరంగ ప్రసంగాలిచ్చే వారిని ఆమోదించడంలో విచక్షణనుపయోగించి, సహోదరుల్లో ఎవరైతే శ్రేష్ఠమైన బోధకులుగా ఉంటారో, ఎవరైతే సంస్థయొక్క క్లుప్తప్రతులను దగ్గరగా అనుసరిస్తారో, ఎవరైతే ప్రేక్షకుల అవధానాన్ని ఆకట్టుకోగలుగుతున్నారో, వారినే నియమించాలి. బహిరంగ ప్రసంగాలు ఇచ్చే ఆ ఆధిక్యతను పొందే సహోదరులు పెద్దలు ఇచ్చే ఏ ఉపదేశాన్నైనా, సలహాలనైనా అంగీకరిస్తూ, మాట్లాడే తమ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసికోటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూవుండాలి.
7 యెషయా 65:13, 14 నందు ప్రవచింపబడినట్లుగా, దేవుని ప్రజల ఆత్మీయ సమృద్ధి మరింత ఎక్కువగా స్పష్టమవుతూనే ఉంటుంది. బహిరంగ ప్రసంగాలకొరకైన ఏర్పాటు మనము ‘యెహోవాచేత ఉపదేశము నొందే’ అనేక మార్గాల్లో ఒకటైవుంది.—యెష. 54:13.