సమయోచితమైన రాజ్య వార్త ప్రపంచవ్యాప్తంగా అందించబడవలసి ఉంది
1 ఆదివారము, ఏప్రిల్ 23న “అబద్ధమతం యొక్క అంతం సమీపించింది” అనే అవధానాన్ని ఆకట్టుకొనే అంశంపై ఒక ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఇవ్వబడుతుంది. ఆ నాటి కూటం ముగింపులో, ఆలోచనను రేకెత్తించే నాలుగు పుటల రాజ్య వార్త విడుదల చేయబడుతుంది. అందులో ఉండే సమయోచిత వర్తమానం ఏప్రిల్ 24 నుండి మే 14 వరకున్న మూడు వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా అందజేయబడుతుంది.
2 ప్రపంచమందలి అన్ని భాగాల్లోని ప్రజలు కలవరంతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నప్పటికీ, వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు. ఏమి జరుగుతున్నదనే దాన్ని గూర్చి యథార్థంగా కలతచెందే వారికి రాజ్య వార్తలో ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే అది మానవుని నడిపింపుకు అమోఘమైన మూలమగు దేవుని వాక్యం వైపుకు వాళ్ళను నడుపుతుంది. (కీర్త. 119:105) మనమందరం ఏప్రిల్ 23న రాజ్య వార్త విడుదల చేయబడినప్పుడు దాని ప్రతిని పొందాలని ఎదురు చూస్తాము. ఈ మధ్య కాలంలో, మూడు వారాల విస్తృతమైన ప్రచారం కొరకు సిద్ధపడడానికి ఎంతో ఉంది.
3 ఉత్సుకతతో పాలుపంచుకోవాలని అందరినీ ప్రోత్సహించండి: ఈ పనిలో ఎవరు పాలు పంచుకోవచ్చు? ఇప్పటికే ప్రచారకునిగా ఉన్న ప్రతి ఒక్కరు అలా చేయడానికి తప్పకుండా ఆసక్తి కలిగి ఉంటారు! సంఘ కూటాలకు క్రమంగా హాజరవుతున్న బైబిలు విద్యార్థుల విషయమేమిటి? కొందరు కొంత కాలంగా మనతో సహవసిస్తున్నారు మరియు క్రమబద్ధమైన అభివృద్ధిని సాధిస్తున్నారు. వారు తమ జీవితాలను లేఖనాధార సూత్రాలకు అనుగుణ్యంగా మార్చుకున్నట్లయితే, వారు రాజ్యప్రచారకులుగా ఎంచబడడానికి యోగ్యతను సంపాదించుకున్నారా? బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్న ప్రచారకుడు విద్యార్థితో ఈ విషయాన్ని గూర్చి చర్చించవచ్చు, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనాలని విద్యార్థి కోరుకుంటున్నట్లయితే, ఇద్దరు పెద్దలు మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరించబడియున్నాము అనే పుస్తకమందలి 98, 99 పుటల్లోని సమాచారాన్ని అతనితో పునఃసమీక్షిస్తారు. బాప్తిస్మం పొందని ప్రచారకులుగా యోగ్యత పొందేవారు ఈ ప్రచారమందు పూర్తి భాగాన్ని కలిగి ఉండగలిగేలా దీనిని సాధ్యమైనంత త్వరగా చేయాలి. ఇంతవరకూ బాప్తిస్మం పొందని ప్రచారకులుగా ఎంచబడడానికి యోగ్యత పొందని బైబిలు విద్యార్థులు కూడా సమయోచితమైన ఈ రాజ్య వార్తను పరిచయస్థులకు లేదా కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలని ప్రోత్సహించబడవచ్చు.—కావలికోట, (ఆంగ్లం) నవంబరు 15, 1988, పుట 17, పేరా 8 చూడండి.
4 ఈ పని కష్టమైనది కాదు; ప్రతి ఒక్కరూ భాగం కలిగి ఉండగలరు. ఇంటింటా రాజ్య వార్తను అందించడానికి కుటుంబ సభ్యులందరూ సంసిద్ధులై ఉండగలిగేలా తల్లిదండ్రులు వారపు కుటుంబ బైబిలు పఠనంలో భాగంగా, ఆ కరపత్రంతో అభ్యాస కార్యక్రమాలను చేర్చవచ్చు. సాధారణంగా సరళమైన సమాచారమే శ్రేష్ఠమైనది. చిన్న ఉపోద్ఘాతం తర్వాత, గృహస్థునికి రాజ్య వార్తను అందించి, చదవమని అతనిని ప్రోత్సహించండి. గృహస్థులు ఆసక్తి కనబరచినప్పుడు, ఆసక్తిని పెంపొందింపజేయడానికి పునర్దర్శించగలిగేలా వివరాలను రాసి పెట్టుకోండి. (1 కొరిం. 3:6, 7) సరళమైన బాగా సిద్ధం చేయబడిన సమాచారమే విజయానికి కీలకము.
5 ఏప్రిల్, మే నెలల్లోను ‘చేయడానికి ఎంతో’ ఉంది. తదుపరి నెల మన రాజ్యపరిచర్య సంచికలో ‘ప్రభువు కార్యమునందు చేయడానికి ఎంతో ఉంది,’ అనే పేరున్న అనుబంధంలో అదనపు సమాచారం అందజేయబడుతుంది.—1 కొరిం. 15:58.