రాజ్య వార్త నెం. 35ను విస్తృతంగా పంచిపెట్టండి
1 అక్టోబరు, నవంబరు నెలలు మనకందరికీ చాలా పని ఉన్న నెలలు. అక్టోబరులోని మొదటి 11 రోజుల్లో మనం కావలికోట, తేజరిల్లు!లకు చందాలను ప్రతిపాదిస్తాం. తర్వాత, ఆదివారం అక్టోబరు 12 నుండి ఆదివారం నవంబరు 16 వరకూ మనం ప్రపంచవ్యాప్త రాజ్య వార్త నెం. 35 పంపకపు పనిలో చేరుతాము. మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దగ్గరికీ ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని తీసుకువెళ్ళడం మన ఆధిక్యత. “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే ప్రశ్నకు జవాబది. ఈ ప్రత్యేక ప్రచార కాలంలో, వారాంతాల్లో కాక, వారపు మధ్యరోజుల్లో మనం రాజ్య వార్త నెం. 35ను పంచిపెడతాము. వారాంతాల్లో రాజ్య వార్తను పంచిపెట్టడమే కాక, పత్రికల సరిక్రొత్త సంచికలను చూపించి, పత్రికా చందాలను ప్రతిపాదిస్తాం.
2 ఎవరు భాగం కలిగి ఉండవచ్చు? మామూలుగానే, సంఘ పెద్దలు ఈ పనిలో ముందుంటారు. రాజ్య వార్తను పంచిపెట్టే పనిలో ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. ఈ ప్రచార నెలల్లో ఏదైనా ఒక నెల లేదా రెండు నెలల్లోనూ అనేక మంది ప్రచారకులు సహాయ పయినీర్ల జాబితాలో చేరుతారనడంలో సందేహం లేదు. మిగతా ప్రచారకులు పరిచర్యలో మామూలుగా వెచ్చించేదాని కన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు.
3 మీ బైబిలు విద్యార్థి జ్ఞానము పుస్తకంలో చాలా భాగం ముగించినవాడై, త్వరలో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనే యోగ్యతను చేరుకోబోతున్నాడా? రాజ్య వార్త ప్రచార పనిలో పాల్గొనేలా ఆయన కాస్త ముందుగానే బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడవ్వగలడేమో. ఈ కరపత్రాన్ని ఇతరులకు పరిచయం చేసేందుకు అవసరమైందల్లా ఒక సరళమైన అందింపు మాత్రమే. ఉదాహరణకు, ఒకరు ఇలా చెప్పవచ్చు: “ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనది కనుక, దీనిని ఈ నెలలో 169 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా ఒక ప్రతినివ్వాలని ఇష్టపడుతున్నాను.” చిన్నపిల్లలు కూడా ఉత్తేజకరమైన ఈ పనిలో అర్థవంతమైన భాగాన్ని కలిగి ఉండగలరు.
4 రాజ్య వార్త నెం. 35ను పంచిపెట్టడంలో పూర్తి భాగాన్ని కలిగివుండేందుకు పుస్తక పఠన నిర్వాహకులు తమ గుంపులోని ప్రతి సభ్యుడ్ని ప్రోత్సహించాలి. తమ గుంపులో నిష్క్రియులైన ప్రచారకులు ఉండవచ్చు. అయితే వాళ్ళు అవసరమైన ప్రోత్సాహాన్ని పొందినట్లయితే పరిచర్యలో మళ్ళీ క్రియాశీలురవుతారు. ఈ ప్రచార పని మొదలవ్వక ముందే, వాళ్ళలో ప్రతి ఒక్కరినీ పెద్దలు సందర్శించి, ఈ విధమైన పరిచర్యలో వాళ్ళను అనుభవజ్ఞులైన ప్రచారకుల వెంట పంపుతూ వాళ్ళకు సహాయపడేందుకు ఏ ఏర్పాట్లు చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
5 మనం పరిచర్య కోసం ఎప్పుడు కలుసుకోవచ్చు? ఈ కార్యక్రమానికంతటికీ అనుకూలమైన ఆచరణాత్మకమైన గుంపు సాక్ష్యపు ఏర్పాట్లు అవసరమౌతాయి. సాధ్యమైన చోటెల్లా, వారపు మధ్యలోని ప్రతిరోజూ, అలాగే వారాంతాల్లోనూ సాయంకాలాల్లో పరిచర్య కొరకైన కూటాలు సంస్థీకరించబడాలి. సాక్ష్యమిచ్చే సమయాన్ని ప్రచారకులూ అలాగే పయినీర్లు పూర్తిగా ఉపయోగించుకోగలిగే సమయాల్లోనే సేవా కూటాలు జరగాలి. పాఠశాల విద్యార్థులూ, షిఫ్ట్ డ్యూటీలు చేసే వారు, అలాగే మిగతా వాళ్ళ ప్రయోజనం కోసం మధ్యాహ్నం తర్వాత కూడా కలుసుకునే ఏర్పాట్లను చేయవచ్చు. ప్రతి ఒక్కరూ పరిచర్యలో పూర్తి భాగం వహించేలా కావలసినన్ని ఇళ్ళూ, కావలసినంత వ్యాపార స్థలమూ ఉండేలా సేవా పైవిచారణకర్త చూడాలి. తమ ప్రాంతంలో ప్రచారకులు చాలా మంది ఉన్నట్లయితే, కేటాయించబడిన ప్రాంతంలో ఎంత మంది పని చేయాలి అనే విషయంలో వాళ్ళు వివేచనగలవారై ఉండాలి.
6 ఇండ్లలో కలవని గృహస్థుల విషయమేమిటి? వాళ్ళు రాజ్య వార్త నెం. 35ను ఎందుకు చదవాలి అనే విషయాన్ని వివరించేందుకు ఎంత మంది గృహస్థులతో సాధ్యమౌతుందో అంత మందితో వ్యక్తిగతంగా మాట్లాడాలని మనం కోరుకుంటాం. మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గృహస్థులు లేనట్లయితే, ఆ ఇంటి చిరునామాను వ్రాసుకుని మరొక సారి మరొక సమయాన అక్కడికి తిరిగి వెళ్ళండి. మీరు ఆ గృహస్థులను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఈ ప్రచార కాలం యొక్క చివరి వారం వరకూ కూడా సఫలం కానట్లయితే, మీరు రాజ్య వార్త ప్రతిని దారిన పోయే వారి కంటపడని విధంగా, తలుపు సందులో జారవిడువాలి. నివాస ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు, వీధుల్లో నడుస్తున్న వ్యక్తులకు రాజ్య వార్తను అందించేందుకు అప్రమత్తులై ఉండండి. గ్రామ ప్రాంతాల్లోనూ, ప్రచార కాలంలో పూర్తిచేయగలిగే దానికన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పని చేసేటప్పుడు, గృహస్థులను కలవని ఇండ్లలో ఆ మొదటిసారే రాజ్య వార్త ప్రతిని జారవిడువవచ్చు.
7 మన లక్ష్యమేమిటి? నవంబరు 16న ఈ ప్రచార పని ముగియక ముందే తమ ప్రాంతమంతటా రాజ్య వార్త ప్రతులనన్నింటినీ ఉపయోగించేందుకు సంఘాలు గట్టి కృషిచేయాలి. మీ సంఘ ప్రాంతం చాలా పెద్దదైతే, మీరు ఒంటరిగా చేయడం సురక్షితమే అయితే, మీరు ఒక భాగస్వామితో కలిసి చేయడం కన్నా ఒంటరిగా చేయడమే ఆచరణయోగ్యమని మీరు కనుగొనవచ్చు. అర్హులైనవారికి—ఎంత మందికి అందజేయడం సాధ్యమౌతుందో అంతమందికి—సువార్తను అందజేయడానికి ఆ పద్ధతి మీకు సహాయపడుతుంది. (మత్త. 10:11) మీరు బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించడం కన్నా కొన్ని కరపత్రాలను మీ చేతిలోనూ, బైబిలును మీ పాకెట్లోగానీ పర్సులోగానీ ఉంచుకోవడమే మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆసక్తి చూపించేవారి చక్కని రికార్డును ఉంచుకోవాలని నిశ్చయించుకోండి.
8 మీరు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? సంఘానికి ఎన్ని అదనపు పత్రికలు అవసరమో పెద్దలు ముందే తెలుసుకుని, దాని ప్రకారం ఆర్డర్ చేయాలి. ప్రతి సంఘానికీ కరపత్రాలు పంపబడతాయి కనుక, రాజ్య వార్త నెం. 35 కోసం ఆర్డర్ పంపవలసిన అవసరం లేదు. కరపత్రాల పంపకం కోసం ప్రత్యేక, క్రమ, సహాయ పయినీర్లు ఒక్కొక్కరికీ 200 ప్రతులూ ఒక్కో ప్రచారకునికీ 40 ప్రతుల చొప్పున కేటాయించబడతాయి. అలా, మనకు పని కేటాయించబడింది. ఈ ఆహ్లాదకరమైన పనిలో పాల్గొనాలనే ఆతురతతో మీరున్నారా? అందుకు సందేహమే లేదు. రాజ్య వార్త నెం. 35లోని ప్రాముఖ్యమైన బైబిలాధార సందేశాన్ని సాధ్యమైనంత విస్తృతంగా అందజేద్దాం!