‘ప్రభువు కార్యమునందు చేయడానికి ఎంతో ఉంది’
1 ఏప్రిల్, మే నెలల కొరకు ఎదురు చూడడానికి మనకు దైవపరిపాలనా కార్యక్రమముల సోత్సాహ పట్టిక నిజంగా ఉంది! ఏప్రిల్ 14న మనం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తాము. సాధ్యమైనంత ఎక్కువ మందిని: పరిచయస్థులైన వ్యాపారులను, అవిశ్వాసులైన బంధువులను, తోటి విద్యార్థులను, క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారిని, బైబిలు విద్యార్థులను ఆ ప్రాముఖ్యమైన సందర్భంలో హాజరవ్వాలని ప్రోత్సహించాలి. ఒక్కరిని కూడా మరువకుండా ఉండేందుకు, మీరు ఆహ్వానించాలనుకునే వారి పట్టికను తయారు చేసుకోండి.
2 తరువాయి వారం ఏప్రిల్ 23న, “అబద్ధ మతాంతం సమీపించింది” అనే అంశంపై ప్రత్యేక బహిరంగ ప్రసంగాన్ని వినడానికి రమ్మని జ్ఞాపకార్థ దినానికి హాజరైన వారినందరినీ మనం ప్రోత్సహిస్తాము. సూటియైన వర్తమానాన్ని వినే అనేకమంది ఆసక్తిగల ప్రజలు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గాక, క్రమంగా సంఘంతో సహవసించవలసిన ప్రాముఖ్యతను గుర్తిస్తారని ఆశించబడుతుంది.
3 ప్రత్యేక రాజ్య వార్త విడుదల చేయబడనుంది: ఏప్రిల్ 23న జరిగే కూటంలో అతిముఖ్యమైనదేమంటే, మే 14 వరకూ విస్తృతంగా పంచిపెట్టబడనున్న సమయోచితమైన నాలుగు పుటల రాజ్య వార్త సంఖ్య 34 విడుదలే. ఈ జ్ఞాపకార్థ దిన కాలంలో ‘ప్రభువు కార్యమునందు చేయడానికి ఎంతో ఉంది’ అని మీరు అంగీకరించరా?—1 కొరిం. 15:58.
4 రాజ్య వార్త ప్రతులు ప్రతి సంఘానికి పంపించబడతాయి. రాజ్య వార్త ఉన్న అట్టపెట్టెలను సురక్షితమైన స్థలంలో భద్రంగా ఉంచాలి, ఏప్రిల్ 23న కార్యక్రమమంతా ముగిసే వరకు వాటిని తెరవకూడదు. ఆ సమయంలో సహోదరులకు మరియు ప్రజలకు రాజ్య వార్త పంపకానికి లభ్యమవుతుంది. ఏప్రిల్ 23న జరిగే సంఘ కూటాల, ప్రాంతీయ సమావేశాల, లేదా ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాల అంతంలో హాజరైన వారికందరికీ ఒక్కో ప్రతి ఇవ్వబడుతుంది, ఆ విధంగా వారికి దానిలోని విషయం బాగా పరిచయమై, తద్వారా దానిని పంచిపెట్టడానికి వారు సంసిద్ధులవుతారు.
5 పెద్దలకు చేయడానికి ఎంతో ఉంటుంది: ఈ నెల ఆరంభంలో, ప్రత్యేక ప్రచార వివరాలను గూర్చి చర్చించుకోవడానికి పెద్దల సంఘం కూడుకోవాలి. సంఘాలు తమకు నియమించబడిన ప్రాంతాన్నంతటినీ పూర్తి చేయడానికి పాటుపడాలి. ప్రచారం ముగియక ముందే, గత ఆరు నెలల్లో చేయని ప్రాంతాలను పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి. పని ప్రాముఖ్యత దృష్ట్యా, పరిచర్య కొరకు సాధ్యమైనంత సమయాన్ని కేటాయించాలని మనం కోరుకుంటాం. ఎప్పటికన్నా ఎక్కువమంది ప్రచారకులు సహాయ పయినీర్లుగా చేరుతారనడంలో సందేహం లేదు. అనేక మంది బైబిలు విద్యార్థులు కూడా బాప్తిస్మం పొందని ప్రచారకులుగా క్రొత్తగా ఆమోదించబడిన వారిగా మనతో చేరుతుండవచ్చు. మనం దేవుని పనిలో కృషి సలుపుతున్నప్పుడు, మనకు ఎంత ఆనందకరమైన సమయం ఉంటుందో!
6 శనివారాల్లోను, ఆదివారాల్లోను గుంపు సాక్ష్యముండేందుకు సంఘ పుస్తక పఠన నిర్వాహకులు కచ్చితమైన ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరు చురుకైన పాత్రను కలిగి ఉండాలని ప్రోత్సహించాలి. వారాంత పరిచర్యే కాకుండా, ప్రచార కాలంలో కనీసం వారంలో ఒక్కసారైనా సాయంకాల సాక్ష్యం ఉండేలా పట్టిక వేయాలి. అదనపు భాగాన్ని కలిగి ఉండాలనుకునే విద్యార్థులకు సహాయపడడానికి పాఠశాల విడిచి పెట్టిన తర్వాత పరిచర్య కొరకు కలవడానికి కొందరు ఇష్టపడవచ్చు.
7 ప్రతిరోజు ప్రచారకులు మరియు పయినీర్లు పరిచర్యను ముందుగా ఆరంభించుకోగల్గేలా ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటాలను పట్టిక వేయాలి. ఈ కూటాలు క్లుప్తంగా ఉండాలి. ప్రతి ఒక్క కూటం సరళమైన రాజ్య వార్త అందింపును చూపించాలి. పరిచర్య కొరకైన మధ్యాహ్న కూటాల్లో రాజ్య వార్తను స్వీకరించిన వారిని పునర్దర్శించడానికి ఒకటి రెండు సలహాలను చేర్చవచ్చు. అయితే, కొందరు ప్రచారకులు ఉదయమూ సాయంకాలమూ పంపకంలో పాల్గొనడానికి ఇష్టపడుతుండవచ్చు. ఆ లక్ష్యం కొరకు కావలసినంత ప్రాంతం ఉండేలా సేవాధ్యక్షుడు చూడాలి. ఆసక్తిని కనబరచే ప్రతి ఒక్కరి పేరును, చిరునామాను ఇంటింటి రికార్డులో రాసుకోవాలి. రిమార్కుల కాలమ్‌లో క్లుప్త చర్చయొక్క ముఖ్యాంశాలను కూడా ఇమిడ్చవచ్చు. తర్వాత, ఆ వారంలో లేదా ఆ నెలలో పునర్దర్శనం చేయడానికి ఇది దారి తెరుస్తుంది.
8 ఒక సంఘం తన ప్రాంతాన్ని పూర్తి చేసుకోవడానికి మరొక సంఘం సహాయపడుతున్నట్లయితే, ఆసక్తి గల వ్యక్తుల పేర్లను, చిరునామాలను, ఆ ప్రాంతానికి బాధ్యత వహించే సంఘానికి ఇవ్వాలి.
9 తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మం పొందని ప్రచారకులవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? కొన్ని సంఘాల్లో, మంచి ప్రవర్తన గల పిల్లలు సమర్పించుకున్న తమ తల్లిదండ్రులతోపాటు సంవత్సరాలుగా పరిచర్యకు వెళ్తున్నారని, వారు సువార్త ప్రచారకులు కాకపోయినప్పటికీ, చక్కగా చేస్తున్నారని గమనించబడింది. తమ పిల్లలు ఈ ఆధిక్యతకు నిజంగా యోగ్యత గలవారేనానని తల్లిదండ్రులు యోచించి తీరాలి. పెద్దల్లో ఇద్దరు అన్ని విషయాలను కుటుంబ శిరస్సుతో చర్చించి, ఆ బిడ్డ బాప్తిస్మం పొందని ప్రచారకునిగా ఎంచబడగలడో లేదో నిర్ణయిస్తారు.—మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము, పుటలు 99-100.
10 మీ సంఘ ప్రాంతంలోని ప్రచారకులెవరైనా యెహోవాకు స్తుతియాగమును అర్పించడంలో చురుగ్గా ఉండడం లేదా? (హెబ్రీ. 13:15) నిష్క్రియులుగా ఉన్న కొందరు బైబిలు యొక్క నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండడంలో కొనసాగుతున్నప్పటికీ, నిరుత్సాహము లేక జీవిత ఆతురతల వలన పరాజితులై ఉండవచ్చు. పెద్దల్లో ఒకరు స్నేహపూర్వకంగా సందర్శించడం వలన వారు తిరిగి సంఘంతో క్రమంగా సహవసించేందుకు, సరైన సమయంలో పరిచర్య పనియందు నవీకరించబడడానికి పురికొల్పబడవచ్చు.
11 ఈ ఆనందకరమైన పనిలో యోగ్యులైన అందరూ పాల్గొనవచ్చు: పిల్లలు లేదా యౌవన తొలి ప్రాయంలోనున్న వారైన మీలో కొందరు ఇంటింటి పరిచర్యలో పాల్గొనడం కష్టంగా ఉన్నట్లు భావిస్తున్నారా? ప్రకటనా పనిలో పరిమితమైన అనుభవం గల క్రొత్తవారైన మీ విషయమేమిటి? ఈ ప్రత్యేక రాజ్య వార్తతో కలిసి పని చేయడం అమిత ఆనందం కలిగించేదని మీరు కనుగొంటారు! ఒక క్లుప్తమైన అందింపే అవసరమై ఉంది.
మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “ఈ నెల మేము ప్రపంచమంతటా 232 దేశాల్లో ప్రాముఖ్యమైన ఒక వర్తమానాన్ని అందజేస్తున్నాము. ఈ వర్తమానం ప్రాముఖ్యమైనది, ఎందుకంటే, నేడు మనం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారముందని నమ్మడానికి అది గట్టి కారణాలను ఇస్తుంది. మీరు వ్యక్తిగత ప్రతిని కలిగి ఉండాలని మేము ఇష్టపడుతున్నాము.”
లేదా మీరు ఈ విధంగా ప్రయత్నం చేయవచ్చు:
◼ “ఈ నెల దాదాపు యాభై లక్షల మంది స్వచ్ఛందంగా ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని డజన్లకొలది భాషల్లో అందజేస్తున్నారు. నేడు మనమందరం ఎదుర్కుంటున్న సమస్యల అంతాన్ని చూడాలని ఇష్టపడుతున్న ప్రజల కొరకు ఇది తయారు చేయబడింది. ఇది మీ వ్యక్తిగత ప్రతి.”
ఈ సరళమైన అందింపు మీకు నప్పవచ్చు:
◼ “[రాజ్య వార్త అనే శీర్షికను చదివి] అనే పేరు గల ముఖ్యమైన వర్తమానాన్ని చదవమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాము. ఇక్కడ రెండవ పుటలో పెరుగుతున్న సమస్యలను గూర్చి ఇది ఏం చెబుతుందో గమనించండి . . . [రాజ్య వార్త నుండి ఎంపిక చేసిన వాక్యాన్ని చదవండి]. ఈ సమయోచిత వర్తమానంలో మిగిలి ఉన్న సమాచారాన్ని చదవడంలో మీరు ఆనందిస్తారని మాకు నమ్మకమే. ఇది మీ ప్రతి.”
12 రాజ్య వార్తను అంగీకరించే ప్రతి ఒక్కరిని గూర్చి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోండి. నెమ్మదిగాను స్పష్టంగాను మాట్లాడండి; మీ అందింపును తొందరగా ముగించనవసరం లేదు. మన ప్రాంతాన్ని మనం సరిగ్గా పూర్తి చేయాలి, రాజ్య వార్తను చదవడానికి ఆసక్తిని కనబరచిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రతి ఇవ్వబడేటట్లు చూసుకోవాలి. ఇంట్లో ఎవరూ లేనట్లయితే, సరైన సమయంలో తిరిగి వెళ్ళి పునర్దర్శనం చేసి, గృహస్థునికి రాజ్య వార్తను అందించేలా ఇంటింటి రికార్డులో దానిని జాగ్రత్తగా రాసుకోవాలి. వీధి సాక్ష్యంలో సమాచారాన్ని చదవడానికి ఆసక్తిని చూపించే వ్యక్తికి ఇవ్వడానికి ఈ రాజ్య వార్తను ఉపయోగించవచ్చు. కాని కరపత్రాలు కదా అన్నట్లుగా ఈ ప్రతులను వివేక రహితంగా అందించకూడదు. బదులుగా బాటసారులను సమీపించి, ఇవ్వబడిన సమాచారం యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. ప్రయాణం చేసేటప్పుడు, లేదా మధ్యాహ్న భోజనం సమయంలో సహోద్యోగులకు సాక్ష్యమివ్వడం వంటి అనియత (ఇన్‌ఫార్మల్) సాక్ష్యంలో కూడా రాజ్య వార్తను ఉపయోగించాలి. ఇండ్లలోనే ఉండేవారు లేకపోతే రోగులైనవారు సందర్శకులకు, డాక్టర్లకు, నర్సులకు, సేల్స్‌మేన్‌లకు మరియు తమ ఇంటికి వచ్చే ఇతరులకు కూడా వాటిని అందించవచ్చు.
13 ఈ ప్రచార కాలంలో మీరు ఎన్ని పునర్దర్శనాలను చేస్తారు? రాజ్య వార్తలో ఆసక్తి చూపించే వారందరినీ పునర్దర్శించాలి గనుక, అనేక పునర్దర్శనాలను చేస్తారనడంలో సందేహం లేదు. మొదటి దర్శనంలో, రాజ్య వార్తను గూర్చి మాత్రమే చెప్పడం మంచిది. తర్వాత, పునర్దర్శనం చేసేటప్పుడు, రాజ్య వార్తలోని వర్తమానము యొక్క సమయోచితత్వమును గూర్చి కొన్ని వ్యాఖ్యానాలు చేయండి. గృహస్థుడు తాను చదివిన దాని మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా జాగ్రత్తగా వినండి. క్రొత్త పత్రికల్లో దేనిని అందించాలి, లేదా తర్వాతి చర్చలకు దేనిని సిద్ధపడాలి అనే దానిగూర్చి తెలుసుకోవడానికి అతని వ్యాఖ్యానాలు మీకు సహాయపడుతాయి. పునర్దర్శనంలో మీకు మంచి ప్రతిస్పందన లభించినట్లయితే, బైబిలు పఠనాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేయండి.—1 కొరిం. 3:6, 7.
14 ‘మీ ప్రయాసము వ్యర్థము కాదు’: ఈ పని అంతటికీ ప్రయోజనం ఉంటుందా? పౌలు కొరింథీయులకు ఈ విధంగా హామీ ఇచ్చాడు: ‘మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు.’ (1 కొరింథీ. 15:58) కొన్ని సంవత్సరాలుగా, రాజ్య వార్తను అందించాలన్న మన ప్రయత్నాలు గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. ఖాళీగావున్న అపార్ట్‌మెంటులోకి మారుతున్న దంపతులు ఒక సొరుగులో రాజ్య వార్త యొక్క ఒక పాత ప్రతిని కనుగొన్నారు. ఆ అపార్ట్‌మెంటంతటిలో విడిచిపెట్టబడిన వస్తువు అది ఒక్కటే. దాన్ని చదివిన తర్వాత, వారు స్థానిక సంఘాన్ని సంప్రదించి, ఒక బైబిలు పఠనం కావాలని అభ్యర్థించారు. వారు కూటాలన్నింటికీ హాజరవ్వడం మొదలెట్టారు, ఆ తర్వాత బాప్తిస్మం పొందాలన్న కోరికను వెలిబుచ్చారు. బహుశ, మీరు ఇచ్చే ఒక ప్రతి అలాంటి ఫలితాలను తేవచ్చు!—మన రాజ్యపరిచర్య (ఆంగ్లం) 12/74 పుట 1; అలాగే తేజరిల్లు! (ఆంగ్లం) నవంబరు 8, 1976, 15వ పుట కూడా చూడండి.
15 మన ముందు ఓ పెద్ద పని ఉంది. ప్రతి సంఘం మే 14లోగా లేదా రాజ్య వార్త పంపకం కొరకు ఆ సమయాన్ని పొడిగించడం అవసరమైతే, నెలాఖరుకెల్లా తన నియామక ప్రాంతాన్నంతటినీ ముగించాలన్నదే మన లక్ష్యం. పయినీర్లు రాజ్య వార్త యొక్క 250 ప్రతులను పొందేలా అవి పంపించబడుతున్నాయి. ప్రతి సంఘ ప్రచారకుడు 50 ప్రతుల వరకు పొందుతాడు. లిటరేచర్ కౌంటర్‌లో ఒక్కో కరపత్రానికి పది పైసల చొప్పున పయినీర్లకు మరియు ప్రచారకులకు లభ్యం చేయబడాలి, కాని వారు వాటిని ప్రజలకు ఉచితంగా పంచుతారు. మిగిలినవాటిని ఇతరులు ఉపయోగించుకోవడానికి వదిలిపెడుతూ, ప్రచారకులు మరియు పయినీర్లు తాము పంచిపెట్టగలిగినన్ని ప్రతులను మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో మంచి సహకారం ఈ ముఖ్యమైన వర్తమానం యొక్క సాధ్యమైనంత విస్తృత పంపకాన్ని నిశ్చయపరుస్తుంది. పెద్ద నియామక ప్రాంతాన్ని కలిగి ఉండడం వలన కొన్ని సంఘాలు మే నెల మధ్య భాగంలో కూడా తమ ప్రాంతాన్ని పూర్తి చేయలేకపోతే, ప్రతులు ఇప్పటికీ లభ్యమౌతున్నట్లయితే, దగ్గర్లో ఉన్న సంఘాలను సహాయానికి ఆహ్వానించడం ఆచరణయోగ్యంగా ఉంటుంది. మరితర సంఘాల్లో ప్రచారకులు సహాయ పయినీర్లుగా చేయడం ద్వారా లేదా తరచూ పరిచర్యలో పాల్గొనడం ద్వారా తమ పనిని అధికం చేస్తున్నట్లయితే, ఆ అవసరతను తీర్చవచ్చు.
16 మనం మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే యెహోవాయెడల పూర్ణాత్మతో కూడిన సమర్పణ అవసరం. (కొలొ. 3:23) జీవం ఇమిడి ఉంది. ప్రజలు నేటి ప్రపంచ పరిస్థితుల భావాన్ని నిర్లక్ష్యం చేయలేరు. సమయం గతించిపోతుంది. ఈ ప్రపంచ సమస్యలకు మానవుని వద్ద పరిష్కారం లేదన్న వాస్తవాన్ని వారు తప్పక గుర్తించాలి. పరిష్కారం దేవుని వద్దే ఉంది. దేవుని ఆశీర్వాదాన్ని పొందాలనుకునేవారు ఆలస్యం చేయకుండా, నిశ్చయంగా ఆయన ఆజ్ఞలకనుగుణంగా ప్రవర్తించాలి.
17 మే 14న ప్రచార ముగింపులో మనం మన చేతులకు విశ్రాంతినిస్తామా? లేదు! పౌలు ప్రేరేపిత ఉపదేశానికి అనుగుణ్యంగా మనం పనితొందర కలిగి ఉంటాము.