కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/96 పేజీ 2
  • జనవరిలోని సేవాకూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరిలోని సేవాకూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • జనవరి 1తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 8తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 15తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 22తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 29తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 1/96 పేజీ 2

జనవరిలోని సేవాకూటాలు

జనవరి 1తో ప్రారంభమయ్యే వారం

పాట 133 (68)

7 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

13 నిమి: “అంతర్దృష్టితో ప్రకటించండి.” ముఖ్యమైన విషయాల్ని చర్చించండి, ఒకటి లేక రెండు అందింపులను ప్రదర్శించండి. ప్రస్తుతం స్టాకులోవున్న పాత పుస్తకాల్ని సంఘానికి తెలియజేయండి.

10 నిమి: “కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి సమతూకమైన దృష్టిని కల్గివుండడం.” అనుబంధ శీర్షిక. ప్రశ్నా జవాబులు. స్థానికంగా అన్వయించండి. కంప్యూటర్‌నందైనా లేక వేరేవిధంగానైనా ఇతరులచే మన ప్రసంగాల్ని, కూటాల్లోని భాగాల్ని సిద్ధం చేయించుకోవడానికి వ్యతిరేకంగా ఇవ్వబడిన హెచ్చరికవైపు అవధానాన్ని నిలపండి. సంఘ రికార్డుల్ని, అవి మీ సంఘంలో కాగిత రూపంలో భద్రం చేయబడినా కూడా, వాటిని రహస్యంగా ఉంచవలసిన అవసరతను ఉద్ఘాటించండి. సంఘ పని నిమిత్తం సొసైటీచే ఇవ్వబడిన ఫారమ్‌లను ఉపయోగించాలనే ఉపదేశాన్ని నొక్కి చెప్పండి మరియు సొసైటీ ముద్రిత ఫారమ్‌లను ఇచ్చినట్లైతే, వ్యక్తిగతంగా తయారు చేసుకున్న ఫారమ్‌లను ఉపయోగించడం తగని విషయమని తెలియజేయండి.

15 నిమి: స్థానిక అవసరతలు. (లేక “మీ అత్యవసర భావాన్ని కాపాడుకోండి,” అక్టోబరు 1, 1995, కావలికోట, 25-8 పేజీల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.)

పాట 28 (5) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 8తో ప్రారంభమయ్యే వారం

పాట 138 (71)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. స్థానికంగానూ ప్రపంచవ్యాప్తంగానూ సువార్త ప్రకటింపబడడానికి ఇవ్వబడిన ఆర్థిక మద్దతును గురించి తగినరీతిగా మెచ్చుకోండి.

15 నిమి: అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డు యొక్క భద్రతా విలువ. అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డును అందరూ సరియైన రీతిలో నింపడం యొక్క ప్రాముఖ్యతను గురించి, ఎల్లవేళలా దానిని దగ్గర ఉంచుకోవడం గురించి, పిల్లలు తమవద్ద ఎల్లవేళలా గుర్తింపు కార్డును కల్గివుండే అవసరతను గురించి సంఘంతో పెద్ద చర్చిస్తాడు. కార్డు యొక్క పేరు సూచిస్తున్నట్లుగానే, అది వైద్య సంరక్షణగా ఏది అవసరమో (లేక ఏది అవసరం కాదో) అడ్వాన్స్‌ నోటీసును ఇస్తోంది. ఇలా ప్రతి సంవత్సరం ఎందుకు చెయ్యాలి? గడువు తీరిపోయిన లేక ఒకరి నమ్మకాల్ని ఇక ప్రతిబింబించని కార్డుగా పరిగణింపబడిన దానికన్నా తాజా కార్డు మరింత సమ్మతింపదగినది. మీకై మీరు మాట్లాడలేనట్లైతే ఆ కార్డు మీ తరుపున మాట్లాడ్తుంది. కార్డులు ఈ రాత్రి ఇవ్వబడతాయి. వాటిని జాగ్రత్తగా ఇంటిలో పూరించాలి కాని వాటిపై సంతకం చేయరాదు. గత రెండేళ్లుగా చేస్తున్నట్లే పుస్తక పఠన నిర్వాహకుని పర్యవేక్షణ క్రింద సంఘ పుస్తక పఠనాలు జరిగే స్థలంలోనే మీరు సంతకం చేయడం, సాక్షులు సంతకం చేయడం జరగాలి. కార్డు కల్గినవారు సంతకం చెయ్యడాన్ని, సాక్షి సంతకం చేసేవారు చూడాలి. జనవరి 15తో ప్రారంభమయ్యే వారంలో జరగబోయే పుస్తక పఠనం తర్వాత ఇది జరుగుతుంది. (అనుసరించాల్సిన పద్ధతిని గూర్చిన మరిన్ని వివరాల కొరకు జనవరి 1994 మన రాజ్య పరిచర్య 2వ పేజీని చూడండి. అక్టోబరు 15, 1991లో వ్రాసిన ఉత్తరాన్ని కూడా చూడండి.) బాప్తిస్మం పొందిన ప్రచారకులు అందరూ అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులను పూర్తిచేయవచ్చు. బాప్తిస్మం పొందని ప్రచారకులు, తమ స్వంత పరిస్థితులకు నమ్మకాలకు ఈ కార్డులో ఉపయోగించిన పరిభాషను తీసుకోవడం ద్వారా స్వంత డైరెక్టివ్‌ కార్డును తయారు చేసుకోవడానికి ఇష్టపడవచ్చు. బాప్తిస్మం పొందని తమ పిల్లలు గుర్తింపు కార్డుని పూరించడానికి తల్లిదండ్రులు సహాయపడగలరు.

20 నిమి: “వినువారు మాత్రమేగాక చేసేవారై ఉండండి.” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించేకొద్దీ అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం, సంపుటి 2, 521వ పేజీ, 1, 2 పేరాల ఆధారంగా విధేయత యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించండి.

పాట 70 (39) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 15తో ప్రారంభమయ్యే వారం

పాట 77 (41)

12 నిమి: స్థానిక ప్రకటనలు. ఇంటి వద్ద లేని వారిని గూర్చిన పెరుగుతున్న సమస్యను క్లుప్తంగా చర్చించండి. నడిచిపోతున్న, రోడ్డు ప్రక్కన నిల్చున్న లేక కార్లలో కూర్చున్న ప్రజల్ని సమీపించేందుకు చొరవ తీసుకోవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకొనమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి.

18 నిమి: “కొందరిని రక్షించేందుకు పునర్దర్శించండి.” సూచించబడిన సలహాలను పునఃసమీక్షించండి. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి బైబిలు పఠనాల్ని ఆరంభించే లక్ష్యాన్ని సిఫారసు చేయండి.

15 నిమి: “మన పత్రికల్ని బాగా ఉపయోగించండి” అనుబంధ శీర్షికలోని 1 నుండి 13 పేరాల ఆధారంగా సేవాధ్యక్షుడు ఇచ్చే ఉత్తేజపూరితమైన ప్రసంగం.

పాట 156 (118) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 22తో ప్రారంభమయ్యే వారం

పాట 200 (108)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

18 నిమి: “1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 1.” పాఠశాల అధ్యక్షుని ప్రసంగం. అక్టోబరు 1995 మన రాజ్య పరిచర్యలో ఉన్న దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఉపదేశాల్లో విద్యార్థి అసైన్‌మెంట్‌ల కొరకు ఇవ్వబడిన సూచనల్ని పునఃసమీక్షించండి.

17 నిమి: “మన పత్రికల్ని బాగా ఉపయోగించండి.” అనుబంధ శీర్షికలోని 14 నుండి 17 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల్ని అన్ని వేళలా పంచిపెట్టడానికి ప్రత్యేకమైన ప్రయత్నాన్ని చెయ్యమని నొక్కి చెప్పండి. పత్రికలు వివిధ భాషల్లో ప్రచురింపబడ్తున్నందున, అనేక భాషల్లో—కనీసం మన ప్రాంతంలో మనం క్రమంగా కలుసుకొనే ప్రజలు మాట్లాడే భాషల్లోనైనా పత్రికల్ని మనతోపాటు తీసుకెళ్తాం. మన పత్రికలు క్లుప్తమైన తాజా సమాచారాన్ని అందజేస్తాయి గనుక మనం వాటిని పంచిపెట్టడం ఆసక్తిని పెంపొందింపజేయడానికి ఓ కార్యసాధకమైన మార్గం కాగలదు. ఆసక్తిగల వారిని కనుగొంటే, దానిని గురించి వ్రాసుకొని, పునర్దర్శనం చేయండి. పత్రికా మార్గాల్ని పెంపొందింపజేయడానికి ప్రయత్నించండి. పేరా 14లో వర్ణించబడినట్లుగా ఒక కుటుంబంలోని సభ్యులు, అభ్యాస కార్యక్రమాన్ని ప్రదర్శించాలి. అందింపుల్ని పెంపొందింపజేయడానికి కొన్ని అభ్యాస సిద్ధమైన సలహాల్ని కూడా సూచించండి.

పాట 92 (51) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 29తో ప్రారంభమయ్యే వారం

పాట 31 (66)

7 నిమి: స్థానిక ప్రకటనలు.

18 నిమి: “ధైర్యంగా మాట్లాడండి.” పెద్దచే నిర్వహింపబడే ప్రసంగం, చర్చ. స్థానిక ఆదివార సేవా ఏర్పాట్లను పునఃసమీక్షించండి. మంచి మద్దతునుబట్టి మెచ్చుకోండి, మెరుగుపర్చుకోవాల్సిన వాటిని గురించి సలహాలను ఇవ్వండి.

20 నిమి: ఫిబ్రవరి నెలలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రతిపాదించండి. యథార్థ హృదయంగల వారికి బైబిలు మూల సత్యాల్ని బోధించడంలో ఈ పుస్తకం ఓ శక్తివంతమైన పనిముట్టని ప్రేక్షకులకు జ్ఞాపకం చేయండి. ఫిబ్రవరి, సెప్టెంబరు 1995 మన రాజ్య పరిచర్య సంచికల్లో 4వ పేజీనందు ఈ పుస్తకాన్ని ప్రతిపాదించడానికి సంబంధించి ఇవ్వబడిన సలహాలను పునఃసమీక్షించండి. కుటుంబము అనే పుస్తకం ఓ ఆచరణాత్మకమైన పుస్తకం మరియు దీన్ని ప్రతిపాదించడం సులభం గనుక ఈ పుస్తక ప్రతుల్ని కూడా ఎప్పుడూ దగ్గర ఉంచుకోమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి. నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి ఒకటి, కుటుంబము అనే పుస్తకం నుండి ఒకటి అందింపులను ప్రదర్శించండి. ఈ వారాంతమందు సేవలో ఉపయోగించడానికి నిరంతరము జీవించగలరు మరియు కుటుంబము ప్రతుల్ని తీసుకెళ్లమని అందరికీ జ్ఞాపకం చెయ్యండి.

పాట 143 (76) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి