ఏప్రిల్ నెలలో పత్రికా కార్యక్రమానికి సిద్ధపడండి
మన 1996 క్యాలెండరులో చూపించబడినట్లు, ప్రభువు రాత్రి బోజనం ఈ సంవత్సరం ఏప్రిల్ 2న ఆచరించబడుతుంది. ఈ గొప్ప సందర్భంలో ప్రోత్సహించబడి, మనమందరం ఏప్రిల్ అంతా ఆసక్తిగా పత్రికలను పంచి పెట్టడంలో పాల్గొందాం. మనం ఎంత సమయోచితమైన పత్రికలను ఉపయోగిస్తున్నామో కదా! ఏప్రిల్ కావలికోట పత్రిక “నిత్యుడగు రాజును స్తుతించండి!” అనే గత సంవత్సర జిల్లా సమావేశ బహిరంగ ప్రసంగాంశంపై శ్రద్ధను కేంద్రీకరిస్తుంది. గత ఏప్రిల్‌లో ఇవ్వబడిన “అబద్ధ మతాంతం సమీపించింది” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగాంశంపై ఏప్రిల్ 15 కావలికోటలో ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 21న ఇవ్వబడే “వక్ర జనాంగం మధ్య నిందారహితులుగా ఉండడం” అనే ప్రత్యేక బహిరంగ ప్రసంగం రాజ్య కార్యక్రమానికి మరింత ప్రేరణనివ్వాలి. “ఇక యుద్ధాలు లేనప్పుడు” అనే అంశాన్ని చర్చిస్తున్న ఏప్రిల్ 22 తేజరిల్లు!ను (ఆంగ్లం) మనం అందిస్తాం.
గత ఏప్రిల్‌లోని రాజ్య వార్త ప్రచార కార్యక్రమం తరువాయిగా, ఈ ఏప్రిల్ పత్రికలను పంచిపెట్టే విశిష్ట నెలగా ఉంటుంది. పథకాలను వేసుకోవడానికి ఇదియే సమయం. అనేకులు సహాయ పయినీర్ల జాబితాలో పేరు చేర్చుకోవాలని ఆశించవచ్చు. అవసరాన్నిబట్టి ఏప్రిల్ పత్రికల అదనపు ప్రతుల కొరకు ఆర్డర్లు చేయాలి. పత్రికా దినాల కొరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పాల్గొనడానికి సాధ్యమయ్యే ప్రతి ఒక్కరితోను పథకాలను వేయాలి. మనమందరమూ “వాక్యప్రకారము ప్రవర్తించువారునై” ఉందుము గాక. కీర్తన 69:9నందు మెస్సీయ గురించి ముందుగా చెప్పబడినట్లు, మనం కూడా “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించు”నని అనగలుగుదము గాక.—యాకో. 1:22; యోహా. 2:17.