క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
1 1997 ఫిబ్రవరిలో ఆరంభమయ్యే క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం “ఇవ్వడంలో ఉన్న గొప్ప ఆనందాన్ని అనుభవించండి” అనే అంశాన్ని వృద్ధిచేస్తుంది. (అపొ. 20:35) సంతోషం అంటే “క్షేమం మరియు సంతృప్తిగల స్థితి” అని వర్ణించబడింది. నేడు చాలా మంది ప్రజలు జీవితం నుండి తాము పొందగల ఆహ్లాదాన్నంతటినీ జుర్రుకుంటారు, అయితే వాళ్ళలా చేసినా అది తాత్కాలికమే. అది నిజమైన సంతోషం కాదు. అయితే, మనం నిత్య ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో యెహోవా మనకు నేర్పిస్తున్నాడు. (యెష. 48:17; 1 యోహా. 2:17) మనం ఆత్మీయ రీతిలో ఇవ్వడం ద్వారా గొప్ప సంతోషాన్ని ఎలా పొందగలమో క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం నొక్కిచెబుతుంది.
2 పరిచర్యలో మనల్ని మనం సమర్పించుకునే ఆచరణాత్మక మార్గాలను మనం నేర్చుకుంటాం. ప్రయాణ కాపరులు ఇవ్వనున్న కొన్ని ప్రసంగ శీర్షికలు ఏవంటే: “అన్యాయపు సిరి ద్వారా స్నేహితులను చేసుకోవడం,” “‘మనుష్యులకు ఈవులను’ గూర్చిన దైవిక ఏర్పాటును గౌరవించండి,” “నిజమైన సంతోషం యొక్క అనేక కోణాలను అనుభవించండి.” సమావేశంలో బాప్తిస్మం పొందాలని ఆశించేవారందరూ సంఘాధ్యక్షునికి తెలపాలని కోరుకోవచ్చు, అలా వారితో బాప్తిస్మ ప్రశ్నలను సమీక్షించేందుకు ఆయన పెద్దలను ఏర్పాటు చేయగలుగుతాడు. యెహోవాతో పవిత్రమైన బంధంలో సేవచేయడం క్రొత్తగా బాప్తిస్మం పొందినవారికి గొప్ప సంతోషాన్ని తెస్తుంది.
3 యెహోవా యొక్క అధికారాన్ని సరైన విధంగా గుర్తించడం కూడా నిజమైన సంతోషాన్ని మరియు భద్రతను తెస్తుంది. ప్రజలందరూ దీనిని తెలుసుకోవలసిన అవసరం ఉంది. అలా, “దేవుని సంతోషభరిత ప్రజలతో ఐక్యంకండి” అనే అంశాన్ని ప్రాంతీయ సమావేశంలోని బహిరంగ ప్రసంగం వృద్ధిచేస్తుంది. సత్యం మీద ఆసక్తిని చూపించిన వారందరిని ఈ ప్రసంగం కొరకు రమ్మని ఆహ్వానించాలని నిశ్చయపరచుకోండి. సాతాను అధికారంలో ఉన్న ఈ లోకంలో మానవ పరిపాలన క్రింద వారు యథార్థమైన భద్రతను, శాశ్వతమైన సంతోషాన్ని కనుగొనలేకపోయారు. (ప్రసం. 8:9) యెహోవా యొక్క సంతోషం గల ప్రజలతో సహవసించడంలో వారు ఎంత సంతోషాన్ని కనుగొంటారో!—కీర్త. 144:15 బి.
4 ఈ విధానంలో పరిస్థితులు మరింత చెడుగా మారుతున్నప్పటికీ, ఆత్మీయంగా ఇవ్వడంలో సంతోషాన్ని అనుభవిస్తున్న వారు సంతోషం గల దేవుని చేత నిరాశపరచబడరు. (1 తిమో. 1:11, NW) ఇది సత్యమని క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం చూపిస్తుంది. దానిని వదులుకోకండి!