క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
1 మత్తయి 6:33లో యేసు చెప్పిన మాటలకు లోబడి, నిజ క్రైస్తవులందరూ ఎల్లప్పుడూ తమ జీవితాల్లో రాజ్యానికి ప్రథమ స్థానమిస్తారు. అందువల్ల, జనవరి 1994లో ప్రారంభమయ్యే ప్రాంతీయ సమావేశ కార్యక్రమానికి “రాజ్యమును మొదట వెదకుడి” అనే అంశం తగినదే.
2 ప్రారంభం నుండి కార్యక్రమం, రాజ్య వాస్తవాన్ని ఉన్నతపరుస్తూ, అది రాజ్యము, పరిపాలకులు, ప్రజలు, చట్టాలు కల్గిన కార్యశీలక ప్రభుత్వమని నొక్కిచెబుతుంది. వాస్తవానికి, ఈనాడు సమాజానికి ప్రయోజనకరమైన మానవ ప్రభుత్వ చట్టాల్లోని చాలామట్టుకు చట్టాలు బైబిలుపై ఆధారపడినవే.
3 మన జీవితంలోని అన్ని రంగాలలోను రాజ్యానికి ప్రథమ స్థానమియ్యడం ద్వారా మనం పొందే సంరక్షణ, ఆశీర్వాదాలు చర్చించబడతాయి. అనవసరమైన చింత లేకుండా ఎలా కాపాడుకోవచ్చునో చూపించడానికి సహాయకరమైన సలహా ఇవ్వబడుతుంది. మనం సామాన్య దృష్టినే కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యతను గూర్చిన ప్రసంగాలు, ప్రదర్శనలు, చర్చలు అందులో ఉంటాయి.
4 శనివారం కార్యక్రమంలో, యోగ్యత పొందిన వ్యక్తులు తమ సమర్పణను యెహోవాకు బహిరంగంగా ప్రకటించగల్గుతారు. మరి ఆదివారం, “దేవుని రాజ్యం మానవజాతి కొరకు ఏమి చేస్తుంది,” అనే అంశం గల బహిరంగ ప్రసంగానికి మనమంతా హాజరవ్వాలని కోరుకుంటాము.
5 మీరు ప్రాంతీయ సమావేశం యొక్క రెండు రోజులు కూడ హాజరవడానికి తప్పక ఏర్పాట్లు చేసుకోండి. ఉల్లాసవంతమైన సహోదరుల సహవాసంతోపాటు, సమావేశ కార్యక్రమం అందజేసే ఉత్తేజకరమైన, ఉల్లాసకరమగు ప్రోత్సాహాన్ని, మనలో ఎవ్వరూ పోగొట్టుకోవడానికి కోరుకోరు.