అనుకూల దృక్పథంతో సువార్తను అందించడం
1 మనమందరం మనం చేసే పనిలో, ముఖ్యంగా శిష్యులను చేసే పనిలో ఆనందాన్ని మరియు నెరవేర్పును కనుగొనాలని ఇష్టపడతాం. మనకు ఏది అలాంటి సంతృప్తిని తెస్తుంది? మనం ఇతరులకు సహాయపడే పనిలో నిమగ్నమై ఉంటూనే మనం మన అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడంతో అది ఆరంభమౌతుంది. (సామె. 11:25) సువార్తను అందించే మన విధానం మనం చెప్పే దానిని మనం నిజంగా నమ్ముతున్నామని చూపించాలి. మనం మన హృదయంలో ఉన్నది మాట్లాడుతున్నట్లైతే మన యథార్థత మరియు వ్యక్తిగతంగా ఉన్న నమ్మకం ప్రకాశమానమౌతాయి. (లూకా 6:45) మన అందింపును అభ్యసించి చూడడం ద్వారా మనం ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడేటప్పుడు మనకు మరింత ఆత్మవిశ్వాసమున్నట్లు భావిస్తాము. ముఖ్యంగా మనం సెప్టెంబరులో నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రతిపాదించేటప్పుడు ఇది మరింత విలువ గలదై ఉంటుంది. అనుకూల దృక్పథంతో సువార్తను అందించేందుకు ఈ క్రింది సలహాలు సహాయకరంగా ఉంటాయని మీరు కనుగొనవచ్చు.
2 “కుటుంబ జీవితము” అనే పుస్తకాన్ని మీరు ప్రతిపాదించేటప్పుడు మొదటి సందర్శనంలోనే మీరు ఈ విధంగా చెప్పగలరు:
◼ “మన పొరుగువారితో మాట్లాడినప్పుడు, చాలా మంది ప్రజలు తమ కుటుంబాల భవిష్యత్తును గూర్చి చింతిస్తున్నట్లు మేం కనుగొన్నాం. తమ కుటుంబాలు తమ చుట్టు ప్రక్కల ఉన్న వ్యక్తులు తరచూ కనబరచే కోరదగని గుణాల వలన బాధించబడినట్లు, గాయపరచబడినట్లు వారు కనుగొంటారు. చాలా మంది ప్రజలు ఇలాంటి దృక్పథాన్ని కనబరచడాన్ని మీరు గమనించారా? [2 తిమోతి 3:2, 3 చదివి, ప్రతిస్పందనకు తావివ్వండి.] చాలా మంది ప్రజలు ఇలాగే ఉంటారని సూచిస్తూ, మన చుట్టూ సమస్యలున్నప్పటికీ మనమెలా పటిష్ఠమైన సంతోషభరితమైన కుటుంబాన్ని నిర్మించుకోవచ్చు అనేదానిని గూర్చి సలహాను కూడా బైబిలు ఇస్తుంది.” కుటుంబ జీవితము పుస్తకంలోని 182వ పేజీలో ఆరంభమయ్యే 5, 6 పేరాలలోని ఎంపిక చేసుకున్న వాక్యాలను చదివి సరైన నిర్దేశాల ప్రకారం మనం నిత్య భవిష్యత్తుతో కూడిన కుటుంబాన్ని నిర్మించుకోగలమని చూపండి. రూ. 20.00 చందాకు పుస్తకాన్ని ప్రతిపాదించండి.
3 కుటుంబ భవిష్యత్తును గూర్చి మీరు చర్చించినవారిని పునర్దర్శించినప్పుడు మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “నేను క్రితంసారి వచ్చినప్పుడు, చుట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కుని నిలదొక్కుకోగల పటిష్ఠమైన కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి మనం మాట్లాడాము. బలమైన ఒక కుటుంబాన్ని నిర్మించుకునే ఒక మార్గమేమిటంటే మంచి సంభాషణ జరిగేలా చూడడమే. సంభాషణ అనేది కుటుంబం యొక్క జీవరక్తమని పిలువబడుతూ ఉంది. ఈ విషయంలో బైబిలు సలహాను గమనించండి.” సామెతలు 18:13 మరియు 20:5 లను బైబిలు నుండి లేదా కుటుంబ జీవితము అనే పుస్తకం 34వ పేజీ నుండి చదవండి. బైబిలులో కనబడే ఫలాని సమయానికన్న తేడా లేని జ్ఞానాన్ని ఈ పుస్తకం ఆచరణాత్మకంగా అన్వయిస్తుందని పేర్కొనండి. ప్రతి పేజీ క్రింది భాగాన ఉన్న ప్రశ్నలవైపుకు శ్రద్ధను మళ్ళించి, పుస్తకాన్ని ఎలా పఠించవచ్చో చూపించండి. తరువాతి సందర్శనం కొరకు అనుమతిని పొందండి.
4 “నిరంతరము జీవించగలరు” పుస్తకాన్ని ప్రతిపాదించేటప్పుడు మీరు ఈ విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “పొరుగువారితో మాట్లాడినప్పుడు చాలా మంది సురక్షితమైన సమాజాన్ని శాంతియుతమైన లోకాన్ని వాంఛిస్తున్నారని నేను గ్రహించాను. మానవుడు అలాంటి పరిస్థితులను సాధించకపోవడానికి గల కారణాన్ని గూర్చి మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] కొందరు నాయకులు యథార్థత కలిగి కొంత మంచి చేసేవారే కావచ్చు, కాని బైబిలు బుద్ధిపూర్వకంగా ఎలా ఉపదేశిస్తుందో గమనించండి.” కీర్తన 146:3, 4 చదివి; “మానవుని అవసరాలను తృప్తిపరచగల వారెవరైనా ఉన్నారా?” అని అడగండి. 5, 6 వచనాలను చదవండి. నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 156 నుండి 162 వరకున్న పేజీల్లోని చిత్రాలను చూపించి, దేవుని పరిపాలన వలన కలిగే ప్రయోజనాల వైపుకు శ్రద్ధ మళ్ళించండి. పుస్తకాన్ని ప్రతిపాదించండి.
5 దేవుని ఆధిపత్యాన్ని గూర్చి మొదట చర్చించబడినట్లైతే, పునర్దర్శనంలో మీరీ సలహాను ప్రయత్నించవచ్చు:
◼ “నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు, భూమిపై శాంతిని తీసుకు రావడంలోని మానవుని పరాజయాన్ని గూర్చి మనం చర్చించాం. అలాంటి పరాజయానికి బైబిలు ఇస్తున్న కారణాన్ని మనం కనుగొన్నామని మీకు జ్ఞాపకముండవచ్చు. [కీర్తన 146:3 మళ్ళీ చదవండి.] మన నిరీక్షణలను మానవులపై ఉంచకూడదని దేవుడు ఎందుకు ఉపదేశిస్తున్నాడో మీరు గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] శాశ్వత పరిష్కారం కొరకైన ఏ నిరీక్షణయైనా దేవుని నుండే వస్తుందని బహుశా మీరు ఒప్పుకుంటారు. మనమీ నమ్మకం కలిగి ఉండగల కారణం కీర్తన 146:10లో వివరించబడింది. [చదవండి.] మనం దేవుని రాజ్యంలో ప్రజలమై ఉండాలంటే మనమేమి చేయాలి?” నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 250వ పేజీలోకి వెళ్ళి, 2వ పేరాను చదివి, హెబ్రీ 11:6 ను ఉన్నతపర్చండి. బైబిలు పఠనం ద్వారా లక్షలాది మంది నిత్యజీవానికి నడిపే జ్ఞానాన్ని ఎలా సంపాదించారో ప్రదర్శిస్తామని ప్రతిపాదించండి. తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోండి.
6 అంగడంగడికి పరిచర్య చేసేటప్పుడు, “కుటుంబ జీవితము” పుస్తకముతో మీరు ఈ చిన్న అందింపును ఉపయోగించవచ్చు:
◼ “నేడు మేము సమాజంలోని వ్యాపారస్థులకు ప్రత్యేక సేవ చేస్తున్నాము. మనమందరం మన ప్రాంతంలోని విడాకుల మరియు కౌమార నేరాల పెరుగుదలను గూర్చి వ్యాకులపడుతున్నాం. ఈ ధోరణులను విజయవంతంగా ఎదుర్కొనేందుకు ఏదైనా మార్గముందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] కొన్ని పరిష్కారాలున్నాయి.” కుటుంబ జీవితము అనే పుస్తకంలోని విషయసూచికను తీసి, కొన్ని అధ్యాయాల శీర్షికలను చదవండి. ఈ పుస్తకంలో ఇవ్వబడిన సలహా మానవ తత్త్వశాస్త్రాలపై కాదు కాని, మరింత ఉన్నతమైన మూలం నుండి వచ్చిన అంటే మానవ జాతి సృష్టికర్త ఇచ్చిన పరిష్కారాలపై ఆధారపడి ఉందని అని వివరించండి. పుస్తకాన్ని ప్రతిపాదించండి.
7 “కుటుంబ జీవితము” అనే పుస్తకాన్ని మీరు ఎవరికైతే ఇచ్చారో ఆ వ్యాపారిని పునర్దర్శించినప్పుడు మీరీ విధంగా చెప్పవచ్చు:
◼ “నేను క్రితంసారి వచ్చినప్పుడు, కుటుంబంలో శిరస్సత్వానికి లోబడడం, సంభాషణ, తర్ఫీదు మరియు శిక్షణ వంటి వాటిపై దేవుని సలహను అనుసరించడం ద్వారా అనేక కుటుంబ సమస్యలు పరిష్కరించబడగలవని నేను పేర్కొన్నాను.” 5వ పేజీలోని మొదటి పేరాను తీసి చదివి, సంతోషభరితమైన కుటుంబ జీవితము వలన కలిగే ప్రయోజనాలను గూర్చి చదవండి. ఈ పుస్తకాన్ని చదవడం చాలా చాలా కుటుంబాలను సంతోషభరితంగా చేసిందని పేర్కొని, మనం ఈ పుస్తకాన్ని పఠించే పద్ధతిని వివరించండి. వారి వ్యాపార స్థలాన్ని లేదా వారి ఇంటిని క్రమంగా సందర్శించి, ఈ పుస్తకం నుండి ఉచిత పఠనాన్ని నిర్వహిస్తామని ప్రతిపాదించండి.
8 మనం ‘దేవుని జతపనివారిగా’ సువార్తను అందించేటప్పుడు అనుకూల భావంతో ఉండేందుకు మనకు ప్రతి కారణముంది. (1 కొరిం. 3:9) గృహస్థుని అవసరాలనుబట్టి విభిన్న అందింపులను మరియు ప్రచురణలను ఉపయోగించడాన్ని గూర్చి మనం అనుకూల భావంతో ఉందాము. మనం ఈ దృక్పథాన్ని కాపాడుకోవడం ద్వారా యెహోవా నుండి మెండుగా ఆశీర్వాదాలు లభిస్తాయి.