ప్రశ్నాభాగం
◼ జ్ఞానము పుస్తకంలో ఒక వ్యక్తితో ఎంత కాలం నియత బైబిలు పఠనాన్ని నిర్వహించాలి?
యెహోవా నేడు తన సంస్థను ఆశీర్వదిస్తున్నాడు. మనం దీని రుజువును ప్రతి సంవత్సరం వేల కొలది క్రొత్తవాళ్ళు సత్యం పక్షాన స్థానాన్ని తీసుకుంటుండగా చూస్తున్నాము. దీనిని సాధించడంలో జ్ఞానము అనే పుస్తకం ఫలకరమైన ఉపకరణమని నిరూపించబడుతుంది. బైబిలు విద్యార్థి కాస్త త్వరగా ఆత్మీయ అభివృద్ధి సాధించేందుకు, బహుశా కొన్ని నెలల్లో బాప్తిస్మం పొందేంత త్వరగా అభివృద్ధి సాధించేందుకు సహాయపడేందుకే ఈ పుస్తకం రూపకల్పన చేయబడిందని జనవరి 15, 1996 సంచిక కావలికోట చూపించింది.
ఈ కారణాన, అదే కావలికోట 17వ పేజీలో, “జ్ఞానము పుస్తకం నుండి ఒక వ్యక్తి తన బైబిలు పఠనాన్ని పూర్తి చేసి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత . . . ఆయనతో నియత పఠనాన్ని నిర్వహించవలసిన అవసరం లేదు” అని సలహా ఇచ్చింది.
జ్ఞానము పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత బాప్తిస్మం పొందని వ్యక్తిని గూర్చి ఏమిటి? జ్ఞానము పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత, అదే విద్యార్థితో అదనపు పుస్తకాలను పఠించవలసిన అవసరం లేదని కావలికోటలో సూచించబడిన విషయాన్ని జూన్ 1996 మన రాజ్య పరిచర్య 6వ పేజీ 23వ పేరా మనకు గుర్తు చేసింది. ఆ తర్వాత బైబిలు విద్యార్థికి సహాయపడడంలో మనకు ఆసక్తి లేదని భావమా? కాదు. సత్యాన్ని గూర్చిన ప్రాథమిక జ్ఞానాన్ని ప్రజలు పొందాలని మనం కోరుకుంటాం. అయితే, చాలా కొద్ది కాల వ్యవధిలోనే, యథార్థహృదయుడైన సగటు విద్యార్థి యెహోవాను సేవించడానికి బుద్ధిపూర్వకమైన తీర్మానాన్ని తీసుకునేందుకు కావలసినంత జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు సమర్థుడైన ఉపాధ్యాయుడు తోడ్పడగలడని అపేక్షించబడుతుంది. వ్యక్తిగత పరిస్థితులనుబట్టి కొందరు బైబిలు విద్యార్థులు వారంలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు పఠించాలని కోరుకునే సాధ్యత కూడా ఉండవచ్చు.
కొందరు విద్యార్థులు ఇతరుల కన్నా చాలా నెమ్మదిగా అభివృద్ధి సాధిస్తారని ఒప్పుకోవలసిందే. కాని జ్ఞానము పుస్తకాన్ని పఠించిన తర్వాత, ఒకవేళ సాధారణ తీసుకునేదాని కన్నా ఎక్కువ సమయమే తీసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి తాను సంఘంతో సహవసించాలని కోరుకుంటున్నాడా అనేది తీర్మానించుకోనట్లయితే, ప్రచారకుడు సంఘ సేవా కమిటీలోని ఒక పెద్దతో పరిస్థితిని గూర్చి చర్చించవచ్చు. అస్పష్టమైన, లేదా అసాధారణమైన పరిస్థితులు ఇమిడి ఉన్నప్పుడు, అదనపు సహాయాలు అందించబడవచ్చు. జనవరి 15, 1996 కావలికోట 17వ పేజీలోని 11, 12 పేరాలలో చెప్పబడిన సూత్రానికి ఇది అనుగుణ్యంగా ఉంది.
సత్యాన్ని గూర్చి పొందిన ప్రాథమిక జ్ఞానం ఎడల గల మెప్పు కూడా క్రైస్తవ కూటాలకు హాజరయ్యేందుకు విద్యార్థిని పురికొల్పాలి. తాను యెహోవాను సేవించాలని కోరుకుంటున్నట్లు విద్యార్థి కొన్ని రుజువులను ఇచ్చేందుకు ఇది కారణం కాగలదు. జ్ఞానము పుస్తకం నుండి దీర్ఘకాల పఠనం తర్వాత కూడా అలాంటి ఆత్మీయ మెప్పుదల అనేది నిదర్శనం కానట్లయితే ఆ పఠనాన్ని ఆపివేయమని సలహా ఇవ్వబడవచ్చు.