శాశ్వతమైన భవిష్యత్తును పొందేందుకు కుటుంబాలకు సహాయపడడం
1 “దురాశమంచిదే” అని ఒక ఆర్థిక సహాయదారుడు, అమెరికాలోని ఒక పోస్టుగ్రాడ్యుయేట్ తరగతిలో అన్నాడు. “నీవు దురాశపరుడివైనా మంచివాడవని భావించుకోవచ్చు.” తన భవిష్యత్తును కాపాడుకునేందుకుగాను స్వలాభాపేక్షను ప్రబోధించడమే ఈ లోక స్వభావం. దీనికి పూర్తి విరుద్ధంగా, ఓ క్రైస్తవుడు ‘తన్నుతాను ఉపేక్షించుకొనవలెను’ అని యేసు నేర్పించాడు, ఎందుకంటే “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” (మత్త. 16:24-26) శాశ్వతమైన భవిష్యత్తును పొందేందుకుగాను ఒక వ్యక్తి తన జీవితాన్నంతటినీ దేవుని చిత్తాన్ని చేయడంపైనే కేంద్రీకరించాలి, అది నేటి కుటుంబాలకున్న అతి ప్రాముఖ్యమైన లక్ష్యం. (కీర్త. 143:10; 1 తిమో. 4:8) కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకంలోని చివరి అధ్యాయంలో ఆ సమాచారం అందించడం జరిగింది. ప్రజలు జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైన విషయం ఏదో గ్రహించేందుకూ మరి తమ కుటుంబానికి ప్రయోజనకరమయ్యేట్లుగా తామెలా ప్రవర్తించగలరో తెలుసుకునేందుకూ కొత్త ప్రచురణ సహాయపడుతుంది. మనం సువార్తను అన్ని చోట్లా ప్రకటిస్తూ ఉండగా, కుటుంబ సంతోషం అనే పుస్తకాన్ని చదవమని మనం కలుసుకున్న వారిని ప్రోత్సహించేందుకు మనం ఏమి చెప్పవచ్చు? ఇక్కడ కొన్ని సలహాలున్నాయి:
2 ఇంటింటి సేవలోనూ వీధి సాక్ష్యం ఇచ్చేటప్పుడూ, “కుటుంబ జీవితాన్ని అనుభవించండి” అనే కరపత్రాన్ని ఉపయోగించి మీరు సంభాషణను ప్రారంభించవచ్చు. మీరు ఇలా అడగవచ్చు:
◼ “ఇప్పటి జీవితంలో మనకున్న చింతలవల్ల మనం సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడం నిజంగా సాధ్యమని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] అది సాధ్యమేనని ఈ కరపత్రం మనకు హామీనిస్తోంది. దీన్ని చదవడం మీకిష్టమేనా?” ఒకవేళ దాన్ని తీసుకుంటే ఇలా చెబుతూ సంభాషణను మీరు కొనసాగించవచ్చు: “ఈ విషయంలో మీకు ఆసక్తి ఉంది కనుక, కుటుంబంలో మీరు ఆనందాన్ని ఎలా పొందగలరన్న విషయంమీద వివరణాత్మకమైన సలహాలు ఈ పుస్తకంలో ఉన్నాయి, దీన్ని కూడా మీరు ఇష్టపడవచ్చు.” కుటుంబ సంతోషం పుస్తకంలోని విషయ సూచికను చూపించండి. ఆకర్షణీయమైన కొన్ని అధ్యాయాల పేర్లను సూచించండి. ఆ పుస్తకాన్ని 10వ పేజీకి తెరిచి, 17వ పేరాలోని చివరి వాక్యంనుండి 18వ పేరా చివరి వరకూ చదవండి. దాన్ని వారికి ప్రతిపాదించండి. వారికి చెప్పేందుకు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పి, మరలా మీరు వారిని ఎప్పుడు కలవగలరో అడిగి కనుక్కోండి.
3 సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని గూర్చిన మీ మొదటి సంభాషణ తర్వాత మీరు పునర్దర్శించినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “మీరు తీసుకున్న పుస్తకంలోనుండి ఒక విషయాన్ని మీకు చూపిద్దామనుకుంటున్నానండీ, అది మీకు నచ్చుతుందనుకుంటున్నాను. చివరి అధ్యాయం కుటుంబ సంతోషానికి అవసరమైన నిజమైన కీలకంపై అవధానమిస్తోంది. [183వ పేజీలోని 2వ పేరాను చదవండి.] దేవుని చిత్తాన్ని చేసేందుకు కలిసి పనిచేయడమే దానికి కీలకమని గమనించండి. దేవుని చిత్తం ఏమిటి దాన్ని ఇంట్లో ఎలా అన్వయించాలి అనే విషయాలను తెలుసుకునేందుకు కుటుంబాలు కలిసి పఠించాలని మేము సిఫారసు చేస్తున్నాము. మేము ఉచిత బైబిలు పఠన కోర్సులను ఇస్తున్నాము, దాన్ని పూర్తి చేసేందుకు కొన్ని నెలలు మాత్రమే పడుతుంది. మీరు అనుమతిస్తే దాన్ని ఎలా చేస్తామో మీకు చూపిస్తాను.” దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును గానీ, జ్ఞానము పుస్తకాన్ని గానీ, అంటే ఏది సమంజసంగావుంటే దాన్ని తీసుకుని తిరిగి వెళ్లండి.
4 మీ క్లాస్మేట్లతోనో లేక మీ ప్రాంతంలోని యౌవనస్థులతోనో మాట్లాడేటప్పుడు, బహుశ ఈ ప్రశ్నకు మంచి ప్రతిస్పందన దొరకవచ్చు:
◼ “తలిదండ్రులూ పిల్లలూ అరమరికలులేకుండా మాట్లాడుకోవడం రెండు పక్షాలవారికీ ఎంత ప్రాముఖ్యమంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ‘యథార్థమైన మరియు నిష్కపటమైన సంభాషణ’ అనే విషయాన్ని గూర్చి, కుటుంబ జీవితంపై రాసిన ఈ చిన్నపుస్తకం ఏం చెబుతుందో గమనించండి. [కుటుంబ సంతోషం పుస్తకంలోని 65వ పేజీలోని 4వ పేరానంతటినీ 5వ పేరాలోని మొదటి వాక్యాన్నీ చదవండి.] తర్వాతి పేరాలు, కుటుంబంలో సంభాషణను ఎలా మెరుగుపర్చుకోవచ్చు అనే విషయాలపై ఆచరణాత్మకమైన సలహాలనిస్తోంది. ఈ పుస్తకం పేరు కుటుంబ సంతోషానికిగల రహస్యము. ఈ పుస్తకాన్ని తీసుకుని చదవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.” చదివిన వాటిని గూర్చి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మరలా వస్తారని ఆయనకు వివరించండి.
5 తలిదండ్రులకూ పిల్లలకూ మధ్య ఉండవల్సిన సంభాషణనను గూర్చి ఓ యువకునితో మొదటిసారి మాట్లాడినట్లైతే, ఆ సంభాషణను మీరు ఇలా అభివృద్ధి చేసుకోవచ్చు:
◼ “మీ కుటుంబంలో మంచి సంభాషణ ఉండాలనే ప్రాముఖ్యమైన విషయంలో మీరు చూపిన ఆసక్తిని నేను మెచ్చుకుంటున్నాను. తలిదండ్రులూ పిల్లలూ కలిసి చర్చించుకోవల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏదంటారు మీరు?” ప్రతిస్పందించనివ్వండి. తర్వాత కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని 68వ పేజీకి తిప్పి, 11వ పేరాలో ఉన్న మొదటి సగభాగంలోని జవాబును చదవండి. “దేవుని జ్ఞానాన్ని పొందేందుకు వారం వారం బైబిలు పఠనం చేయడం ఎంతో చక్కని పద్ధతి.” దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును అందించండి. దానిలో ఉన్న 16 పాఠాలూ బైబిలు సమాచారంలో ఉన్న ముఖ్యమైనవాటిని అందిస్తాయని వివరంగా చెప్పండి. 2వ పేజీలో ఉన్న ఉపోద్ఘాతాన్ని చదివి, ఆ తర్వాత మొదటి పాఠాన్ని కలిసి చర్చించండి.
6 ఇంటింటి పనిలోగానీ లేక బహుశ ఓ పార్కులోగానీ లేక ప్లేగ్రౌండ్లోగానీ మీరు ఓ తల్లి/తండ్రినీ కలిస్తే ఇలా అంటూ మీరు వారి ఆసక్తిని రేకెత్తించవచ్చు:
◼ “ఈ రోజుల్లో పిల్లలను పెంచడం చాలా కష్టమైన పని అని మీరు తప్పకుండా ఒప్పుకుంటారు కదండీ. మీ కుటుంబాన్ని చెడు ప్రభావాలనుండి ఏది కాపాడగలదని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] నేను ఎంతో మెచ్చుకునే చక్కని సలహాలు ఇక్కడున్నాయి చూడండి.” కుటుంబ సంతోషం పుస్తకంలోని 90వ పేజీలో ఉన్న 1వ పేరాలోని ఉపమానాన్ని చెప్పి 2వ పేరాను చదవండి. వినాశకరమైన ప్రభావాల నుండి కుటుంబాలను కాపాడేందుకు ప్రభావవంతంగా పనిచేసే సమతుల్యమైన నడిపింపును అది ఎలా ఇస్తుందో వివరించండి. ఆ పుస్తకాన్ని అందించి, ఉత్పన్నమయ్యే ఏ ప్రశ్నకైనా జవాబునిచ్చేందుకు సిద్ధంగా ఉండండి.
7 “కుటుంబ సంతోషం” పుస్తకాన్ని అంగీకరించిన ఓ తల్లి/తండ్రిని మీరు సందర్శించేటప్పుడు మీ సంభాషణను మీరు ఇలా కొనసాగించవచ్చు:
◼ “మనం మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు, మీరు మీ పిల్లల విషయంలో నిజమైన శ్రద్ధను కనపరుస్తున్నారని చెడు ప్రభావాలనుండి వారిని కాపాడడానికి మీరు మీకు సాధ్యమయ్యేదంతా చేయాలని ఇష్టపడుతున్నారనీ నేను గమనించగలిగాను. మీరు ఇంకా చదివి ఉండకపోవచ్చు, కానీ నేను మీకు ఇచ్చి వెళ్లిన పుస్తకంలో మీరు గమనించాల్సిన ఓ ప్రాముఖ్యమైన వ్యాఖ్య ఉంది. [59వ పేజీలోని 19వ పేరాను చదవండి.] దేవునితో సంబంధాన్ని అభివృద్ధి చేసుకునేందుకుగాను ఆయన లిఖిత వాక్యమైన బైబిలు ద్వారా ఆయన్ను తెలుసుకోవడం ప్రాముఖ్యం. కుటుంబంగా మనం బైబిలును ఎలా పఠించవచ్చో నేను మీకు చూపేందుకు మీరు ఇష్టపడతారా?”
8 కుటుంబాలు సంతోషాన్ని కనుగొనే మార్గాన్ని ఈ లోక సలహాదారులు చూపించలేరుగానీ నిరాశను తప్పకుండా కలిగిస్తారు. ప్రతిచోటా ఉన్న ప్రజలు శాశ్వతమైన భవిష్యత్తును పొందేలా దేవుని వాక్యం నుండి సహాయాన్ని పొందేందుకుగాను కుటుంబ సంతోషం అనే పుస్తకాన్ని మనం విస్తృతంగా పంచిపెడదాం.—1 తిమో. 6:19.