కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/02 పేజీలు 3-6
  • క్షేత్రసేవకు సూచించబడిన అందింపులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షేత్రసేవకు సూచించబడిన అందింపులు
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణను ప్రారంభించేవి
  • దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయడానికి సూచనలు
  • జ్ఞానము పుస్తకం పరిచయం చేయడానికి సూచనలు
  • కావలికోట, తేజరిల్లు! పత్రికలు స్వీకరించినవారిని పునర్దర్శిస్తున్నప్పుడు, మీరిలా అనవచ్చు:
  • 192 పేజీల పాత పుస్తకాలను అందిస్తున్నప్పుడు, ఈ అందింపును మీరు ప్రయత్నించవచ్చు:
  • ఇతర ప్రచురణలు
  • సూటిగా ప్రస్తావించడం
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
  • అభివృద్ధికై యెహోవాపై ఆధారపడండి
    మన రాజ్య పరిచర్య—1997
  • ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • బ్రోషూర్లతో రాజ్య సువార్తను ప్రకటించండి
    మన రాజ్య పరిచర్య—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 1/02 పేజీలు 3-6

భద్రపరచుకోండి

క్షేత్రసేవకు సూచించబడిన అందింపులు

ఈ పేజీలను ఎలా ఉపయోగించాలి?

ఇక్కడ ఇవ్వబడిన అందింపుల్లో చాలామటుకు గతంలో మన రాజ్య పరిచర్య సంచికల్లో వచ్చినవే. వీటిలో మీకు ఇష్టమైనన్నింటిని సాక్ష్యపు పనిలో ఉపయోగించడానికి ప్రయత్నించండి, వచ్చే ఫలితాలు ఏమిటో చూడండి. ఈ పేజీలను భద్రపరచుకొని, క్షేత్రసేవకు సిద్ధపడుతున్నప్పుడు చూసుకుంటుండండి.

మీరు చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా త్వరగా చెప్పగలిగితే, ఎదుటి వ్యక్తిలో దేవుని వాక్యంపై ఆసక్తిని కలిగించవచ్చు. ఒక నిర్దిష్టమైన ప్రశ్నను అడగండి, తర్వాత క్లుప్తంగా లేఖనాధారిత సమాధానాన్ని చదవండి. ఈ సూచనలను మీరు ప్రయత్నించవచ్చు:

“మీరు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, అది ఆశాజనకంగా ఉంటుందా లేక సందేహాత్మకంగా ఉంటుందా? [జవాబు చెప్పనివ్వండి.] నేడు మనం చూస్తున్న కలవరపరిచే సంఘటనల గురించి, వాటి పరిణామాల గురించి బైబిలు ముందే తెలియజేసింది.”​—2 తిమో. 3:1, 2, 5; సామె. 2:21, 22.

“ఆరోగ్య సంక్షేమం గురించి ప్రజలు నేడు చాలా ఆలోచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని మీకు తెలుసా?”​—యెష. 33:24; ప్రక. 21:3, 4.

“ఈ ప్రపంచాన్నంతటినీ చివరికి ఒకే ఒక ప్రభుత్వం పరిపాలిస్తుందని, బైబిలు ప్రవచించిందన్న విషయం మీకు తెలుసా?”​—దాని. 2:44; మత్త. 6:9, 10.

“యేసుక్రీస్తు ఈ భూలోకాన్ని పరిపాలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు?”​—కీర్త. 72:7, 8.

ఒక హిందువుతో: “మీకు మీ మతం ముఖ్యమే. కానీ మనందరం శాంతిగా జీవించాలని ఇష్టపడుతున్నామన్న విషయంలో మీరు ఏకీభవిస్తారనుకుంటున్నాను. మీకు ఈ భూమిపై శాంతియుతమైన వాతావరణం కనిపిస్తుందా? [జవాబు చెప్పనివ్వండి.] దుష్టత్వాన్ని లేకుండా చేస్తేనే శాంతి ఉంటుంది. దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఈ వాగ్దానాన్ని చూడండి.”​—కీర్త. 72:7,8; 46:9.

“సమస్యల గురించి వినీ వినీ అనేకమంది అలసిపోయారు. వారు పరిష్కారాలను వినాలని కోరుకుంటున్నారు. కానీ మన సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఎక్కడ లభిస్తాయి?”​—2 తిమో. 3:16, 17.

ఒక ముస్లింతో: “మన నేపథ్యం ఏదైనా, నేటి లోకంలో మనందరమూ ఒకే మాదిరిగావున్న అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ఈ తరం ఎదుర్కొంటున్న గొప్ప సమస్యలకు నిజంగా శాశ్వతమైన పరిష్కారం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? ఆ సమస్యలకు పరిష్కారం ఆబ్రాహాము సంతానము ద్వారానే వస్తుంది.”​—ఆది. 22:18.

“స్త్రీ పురుష భేదాలవల్ల, వేరే మతం, లేక వేరే జాతి అన్న భేదాలవల్ల నేడు అనేకమంది బాధలకు గురవుతున్నారు కదా! ఇలాంటి పక్షపాతాల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడని మీరనుకుంటున్నారు?”​—అపొ. 10:34, 35.

సంభాషణను ప్రారంభించేవి

ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలోని ప్రశ్నలు రీజనింగ్‌ పుస్తకంలోని అంశాలనుండి సేకరించబడినవి. వాటి ఎదురుగా ఉన్న నంబర్లు, ఆ పుస్తకంలో సమాధానాలు లభించే పేజీలను సూచిస్తున్నాయి:

మనమెందుకు వృద్ధులమవుతాము, ఎందుకు మరణిస్తాము? (98)

మరణించినవారి స్థితి ఏమిటి? (100)

దేవుణ్ణి నమ్మడానికి సరైన కారణాలేమైనా ఉన్నాయా? (145)

దేవుడు మానవులపట్ల నిజంగా శ్రద్ధ కలిగివున్నాడా? (147)

దేవుడు నిజంగా ఒక వ్యక్తేనా? (147)

మంచివాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా? (162)

నిజమైన సంతోషకరమైన భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి స్వర్గానికే వెళ్ళాలా? (163)

దేవుని నామము తెలుసుకోవడము, ఉపయోగించడము ఎందుకు ప్రాముఖ్యం? (196)

యేసుక్రీస్తు నిజమైన దేవుడా? (212)

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది? (227)

మానవ జీవితానికున్న సంకల్పమేమిటి? (243)

వివాహబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఏమి సహాయపడుతుంది? (253)

మతాలన్నీ దేవునికి అంగీకారమేనా? (322)

ఏది సరైన మతమో ఒక వ్యక్తి ఎలా తెలుసుకోగలడు? (328)

నేటి లోకంలో సాతాను ప్రాబల్యం ఎంతగా ఉంది? (364)

దేవుడు కష్టాలను ఎందుకు అనుమతిస్తున్నాడు? (393)

చెడుతనం ఇంతగా పెరిగిపోవడానికి కారణమేమిటి? (427)

ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు​—దేవుడా లేక సాతానా? (436)

దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయడానికి సూచనలు

“చాలామంది దేవుణ్ణి నమ్ముతారనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారనడంలో సందేహంలేదు. దేవుణ్ణి నమ్మే వాళ్ళందరు, ఆయన మననుండి ఏదో కోరుతున్నాడని ఏకీభవిస్తారు. కానీ ఆయన అసలు ఏమి కోరుతున్నాడన్న విషయంలో మాత్రం అందరూ ఏకీభవించరు.” తర్వాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 1వ పాఠాన్ని తెరిచి, చర్చించండి.

“అనేక సమస్యలతో నిండివున్న నేటి కుటుంబ జీవితాలను చూసి, అసలు కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు రహస్యమేమిటి అని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా?” జవాబిచ్చిన తర్వాత, కుటుంబ సంతోషానికి నిజమైన రహస్యాన్ని దేవుడు బైబిల్లో వెల్లడిచేస్తున్నాడని చెప్పండి. యెషయా 48:17 చదవండి. తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 8వ పాఠం తెరచి, అందులో పేర్కొన్న కొన్ని బైబిలు వచనాలు చూపించండి, అవి కుటుంబంలోని ప్రతి సభ్యునికి నమ్మదగిన మార్గదర్శకాన్నిస్తున్నాయి. పాఠం మొదట్లో ఉన్న ప్రశ్నలను చదవండి. వాటికి సమాధానాలను చదవాలనుకుంటున్నారా అని ఆ వ్యక్తిని అడగండి.

“ప్రాథమిక బైబిలు బోధలు చక్కగా అర్థమయ్యేలా రూపొందించబడిన అధ్యయన కోర్సు ఈ బ్రోషుర్‌లో ఉంది. శతాబ్దాలుగా ప్రజలను కలవరపరుస్తున్న ప్రశ్నలకు సమాధానాలు మీకు ప్రతి పేజీలో దొరుకుతాయి. ఉదాహరణకు, భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?” 5వ పాఠాన్ని తెరిచి, పాఠం మొదట్లో ఉన్న ప్రశ్నలను చదవండి. వాటిలో ఎక్కువ ఆసక్తి కలిగించిన ప్రశ్న ఏదని గృహస్థుణ్ణి అడగండి. తర్వాత దానికి సంబంధించిన పేరా(ల)ను చదివి, తగిన లేఖనాలను చూపించండి. ఇదే విధంగా ఇతర ప్రశ్నలకు కూడా సంతృప్తికరమైన సమాధానాలు సులభంగా దొరుకుతాయని చెప్పండి. మరో ప్రశ్న గురించి చర్చించడానికి మళ్ళీ వస్తానని చెప్పండి.

“స్కూళ్ళలో జరుగుతున్న దౌర్జన్యాలన్నింటికి కారణం ఏమైవుంటుందని మీరు అనుకుంటున్నారు? తల్లిదండ్రులు సరిగా శిక్షణ ఇవ్వకపోవడమా? లేక సాతాను ప్రభావం లాంటిదేదైనా ఉందనుకుంటున్నారా?” జవాబు చెప్పనివ్వండి. ఆ వ్యక్తి సాతాను ప్రభావమే కారణమని అంటే, ప్రకటన 12:9, 12 చదవండి. లోకంలో అల్లకల్లోలం పెరిగిపోవడానికి గల కారణం వెనుక సాతాను పాత్ర గురించి చెప్పండి. ఆ తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 4వ పాఠాన్ని తెరచి, సాతాను ఎక్కడినుండి వచ్చాడని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా అని ఆయనను అడగండి. తర్వాత, మొదటి రెండు పేరాలను చదివి చర్చించండి. ఒకవేళ ఆ వ్యక్తి స్కూళ్ళలో దౌర్జన్యాలకు కారణం “తల్లిదండ్రులు శిక్షణ సరిగా ఇవ్వకపోవడమే” అని అంటే, 2 తిమోతి 3:1-3 చదివి, ఈ సమస్యకు ఏ లక్షణాలు కారణమని స్పష్టమవుతుందో సూచించండి. తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 8వ పాఠాన్ని తెరిచి, 5వ పేరాను చదివి చర్చను కొనసాగించండి.

“మన కుటుంబ జీవితాన్ని విజయవంతం చేసుకునేందుకు కావలసిన పరిజ్ఞానాన్ని, సృష్టికర్త ఇస్తాడని ఆశించడం సరైనదేనని మీకు అనిపిస్తుందా?” జవాబిచ్చిన తర్వాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయండి. 8వ పాఠం తెరచి, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వర్తించే బైబిలు సూత్రాలు దీంట్లో ఉన్నాయని తెలియజేయండి. పూర్తిగా ప్రయోజనం పొందడానికి, బ్రోషుర్‌ను బైబిలుతో ఎలా ఉపయోగించాలో చూపిస్తామని చెప్పండి.

“నేటి ఆధునిక జీవితంలోని సవాళ్ళన్నింటిని ఎదుర్కోవడానికి ప్రార్థన నిజంగా సహాయపడగలదని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ప్రార్థన తమకు అంతర్గత శక్తినిస్తుందని చాలామంది అంటారు. [ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.] కానీ, తన ప్రార్థనలకు జవాబు లభించడం లేదని ఒక వ్యక్తి అనుకోవచ్చు. [దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 7వ పాఠాన్ని తెరవండి.] మనకు ప్రార్థన అత్యధిక ప్రయోజనాలను ఎలా తేగలదో ఈ బ్రోషుర్‌ వివరిస్తుంది.”

“క్రైస్తవ మతానికి ఉన్నది ఒకే బైబిలైనా, ఆ మతం ఎందుకు ఇంతగా విభజించబడింది అన్నదాని గురించి, మేము ఇరుగుపొరుగువారితో మాట్లాడుతున్నాము. మీ అభిప్రాయం ప్రకారం, ఇంతటి తికమక ఎందుకుంది? [జవాబు చెప్పనివ్వండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 13వ పాఠాన్ని తెరిచి, ప్రారంభపు ప్రశ్నలను చదవండి.] మీరు ఈ పాఠాన్ని చదివితే ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తాయి.”

ఒక వ్యక్తికి కావలికోట, తేజరిల్లు! పత్రికలను ఇచ్చిన తర్వాత, ఈ బ్రోషుర్‌ నుండి ఒక చిన్న పేరాను చదివి వినిపించమంటారా అని అడగండి. అందుకు ఒప్పుకుంటే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 5వ పాఠాన్ని తెరవండి. పాఠం మొదట్లో ఉన్న ప్రశ్నలను చూపించి, మొదటి ప్రశ్నకు సమాధానం కోసం ప్రారంభపు పేరాను నేను చదువుతుండగా మీరు వినండి అని చెప్పండి. పేరా చదివిన తర్వాత, ఆ ప్రశ్నను అడిగి అతను చెప్పే సమాధానం వినండి. బ్రోషుర్‌ను ప్రతిపాదించండి, దానిని తీసుకుంటే ఆ ప్రశ్నల పట్టికలోని తర్వాతి రెండు ప్రశ్నలకు చెప్పే సమాధానాల కోసం తిరిగి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి.

జ్ఞానము పుస్తకం పరిచయం చేయడానికి సూచనలు

బైబిలు చేతిలో పట్టుకొని, ఇలా చెప్పడం ప్రారంభించండి: “మేము మీ వీధిలోని ప్రతి ఒక్కరితో ఒక లేఖనం గురించి మాట్లాడుతున్నాము.” యోహాను 17:3, చదివి ఇలా అడగండి: “ఇక్కడ మనకు ఏమి వాగ్దానం చేయబడింది, దాన్ని పొందాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? [జవాబు చెప్పనివ్వండి.] మరి వారి గురించిన పరిజ్ఞానము ఎలా లభిస్తుంది?” ఆ వ్యక్తి జవాబిచ్చిన తర్వాత, జ్ఞానము పుస్తకం చూపించి, ఇలా అనండి: “ఈ పుస్తకము బైబిలు గురించి ప్రజల్లో ఉన్న అతి సాధారణమైన ప్రశ్నలకు సమాధానాలివ్వడం ద్వారా నిత్యజీవానికి నడిపించే జ్ఞానమేమిటో తెలియజేస్తుంది.” ఆ వ్యక్తికి విషయసూచికను చూపించి, వాటిలోని ఏ విషయం గురించైనా, ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా అని అడగండి.

“మన చుట్టూ కనిపిస్తున్న లేక స్వయంగా అనుభవిస్తున్న అన్యాయాలను, బాధలను చూసినప్పుడు దేవుడసలు పట్టించుకుంటున్నాడా అని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? [జవాబు చెప్పనివ్వండి.] దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనీ మన కష్టసమయాల్లో మనకు సహాయం చేస్తాడనీ బైబిలు మనకు హామీ ఇస్తోంది.” కీర్తన 72:12-17 లోని భాగాలను చదవండి. జ్ఞానము పుస్తకములోని 8వ అధ్యాయం తెరిచి, దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు? అని లక్షలాదిమంది అడిగిన ప్రశ్నకు ఓదార్పుకరమైన జవాబును ఇది ఇస్తుందని చూపించండి. సాధ్యమైతే, 3 నుండి 5 పేరాల్లో వివరించిన లేఖన భావాలను కొన్నింటిని చర్చించండి, లేదా పునర్దర్శనంలో చర్చించండి.

“మనలో చాలామంది తమ ప్రియమైనవారిని మరణంలో కోల్పోయారు. వారిని మళ్ళీ చూడగలమా అని మీరెప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి.] మన ప్రియమైనవారు మరణం నుండి రక్షింపబడగలరని యేసు నిరూపించాడు. [యోహాను 11:11, 25, 44 చదవండి.] ఇది శతాబ్దాల క్రితం జరిగిన విషయమే అయినా, దేవుడు మన కోసం ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో ఇది చూపిస్తోంది.” జ్ఞానము పుస్తకములోని 85వ పేజీ తెరిచి, కాప్షన్‌ చదవండి. ఆ తర్వాత 86వ పేజీలోని చిత్రాన్ని చూపించి దానిపై వ్యాఖ్యానించండి. “మనుష్యులు ఎందుకు వృద్ధులై మరణిస్తున్నారో మీకు తెలుసుకోవాలని ఉందా?” అని అడగడం ద్వారా పునర్దర్శనానికి పునాదివేయండి. 6వ అధ్యాయం చర్చించడానికి మళ్ళీ సందర్శించండి.

“మానవులు ఎక్కువ కాలం జీవించాలని ఎందుకు పరితపిస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా?” జవాబిచ్చిన తర్వాత, జ్ఞానము పుస్తకములోని 6వ అధ్యాయము తెరిచి, 3వ పేరా చదవండి. అందులో పేర్కొన్న లేఖనాలపై తర్కించండి. పేరా చివర్లో ఉన్న రెండు ప్రశ్నలను చదివి, వాటికి సమాధానాలను తెలుసుకోవాలనుకుంటున్నారేమో అడగండి. అనుకూలమైన జవాబిస్తే, తర్వాతి కొన్ని పేరాలను చర్చించండి.

“ఈ విషయాన్ని మీరు నమ్ముతారా అని మేము ప్రజలను అడుగుతున్నాము . . .” ఆదికాండము 1:1 చదివి, “ఈ మాటలతో మీరు ఏకీభవిస్తారా?” అని అడగండి. ఆ వ్యక్తి ఏకీభవిస్తే, “నేను కూడా ఏకీభవిస్తాను, కానీ, దేవుడే అన్ని సృష్టించాడన్నప్పుడు, దుష్టత్వానికి కూడా ఆయనే బాధ్యుడు అని మీరు భావిస్తున్నారా?” అని అడగండి. ఆ వ్యక్తి చెప్పింది విన్న తర్వాత ప్రసంగి 7:29 చదవండి. జ్ఞానము పుస్తకములోని 8వ అధ్యాయం తెరిచి, 2వ పేరా చదవండి. ఒకవేళ ఆయన ఆదికాండము 1:1తో ఏకీభవించకపోతే, సృష్టికర్త ఉన్నాడని తెలిపే రుజువులను పరిశీలించమని ఆయనను ప్రోత్సహించండి.​—రీజనింగ్‌ పుస్తకంలోని 84-6 పేజీలను చూడండి.

“నేటి నైతిక విలువలు చాలా వేగంగా మారిపోతున్నాయి కాబట్టి, మన జీవితాలకు ఒక నమ్మదగిన మార్గనిర్దేశకము అవసరముందన్న విషయాన్ని మీరు అంగీకరిస్తారా? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు చాలా పురాతన పుస్తకమైనప్పటికీ, ఇది ఆధునిక జీవితానికీ, సంతోషకరమైన కుటుంబ జీవితానికీ అవసరమైన ఆచరణాత్మకమైన సలహాలను ఇస్తుంది.” ఆ తర్వాత, జ్ఞానము పుస్తకములోని 2వ అధ్యాయం తెరిచి, 10వ పేరాను, 11వ పేరాలోని మొదటి వాక్యమును, 2 తిమోతి 3:16, 17ను కూడా చదవండి.

“మన భవిష్యత్తు ఏమిటో, ఈ భూమి భవిష్యత్తు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] భవిష్యత్తు గురించి బైబిలు ఒకే ఒక్క మాటలో జవాబిస్తుంది​—పరదైసు! మొదటి మానవ దంపతులను సృష్టించినప్పుడు దేవుడు వారిని ఉంచింది అక్కడే. అదెలా ఉండేదన్న దాని గురించిన ఈ వర్ణనను చూడండి.” జ్ఞానము పుస్తకములోని 8వ పేజీ తెరిచి, “పరదైసులో జీవితం” అనే ఉపశీర్షిక క్రింది 9వ పేరా చదవండి. ఆ తర్వాత, 10వ పేరాలోని అంశాలను చర్చించి, అందులో పేర్కొన్న యెషయా 55:10, 11 లేఖనాలను చదవండి. పునఃస్థాపిత పరదైసులో జీవితం ఎలా ఉంటుందనే దాని గురించి 11 నుండి 16 పేరాల్లో తెలియజేయబడిన విషయాలను చర్చించడానికి మళ్ళీ వస్తానని చెప్పండి.

కావలికోట, తేజరిల్లు! పత్రికలు స్వీకరించినవారిని పునర్దర్శిస్తున్నప్పుడు, మీరిలా అనవచ్చు:

“ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీకు కావలికోట పత్రిక ఇవ్వగలిగినందుకు సంతోషించాను. ఆ పత్రిక పూర్తిపేరు, కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అని బహుశా మీరు గమనించే ఉంటారు. ఈ రోజు నేను మీకు ఆ రాజ్యం ఏమిటి, అది మీకు మీ కుటుంబానికి ఏమి చేయగలదు అన్నది వివరంగా చెబుతాను.” ఆ తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 6వ పాఠం తెరిచి, ఆ వ్యక్తికి ఎంత సమయముంటే అంత సమయం చదివి చర్చించండి.

“ఈ మధ్య నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కావలికోట, తేజరిల్లు! పత్రికలను ఇచ్చాను. ఆ పత్రికలు బైబిలుపట్ల, అందులోని నైతిక మార్గనిర్దేశాలపట్ల ప్రజల గౌరవాన్ని పెంచుతాయి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తున్నాను, అందుకే దాన్ని అర్థం చేసుకునేందుకు సహాయకరంగా ఉండే ఒక విషయాన్ని మీకు చూపించడానికి మళ్ళీ వచ్చాను.” దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌నుగానీ, జ్ఞానము పుస్తకమునుగానీ పరిచయం చేసి, బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి.

192 పేజీల పాత పుస్తకాలను అందిస్తున్నప్పుడు, ఈ అందింపును మీరు ప్రయత్నించవచ్చు:

“నేడు ఉన్నతమైన విద్య అవసరమనే దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. కాని, జీవితంలో సంతోషాన్ని సాఫల్యాన్ని పొందడానికి ఎలాంటి విద్యనార్జించాలని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి. తర్వాత సామెతలు 9:10, 11 చదవండి.] ఈ పుస్తకం [మీరు ఇచ్చే పుస్తకం పేరు చెప్పండి] బైబిలు ఆధారంగా రూపొందించబడింది. నిత్యజీవానికి నడిపించగల జ్ఞానానికి ఒకే ఒక మూలం ఏమిటో ఈ పుస్తకం వివరిస్తుంది.” ఆ పుస్తకంలోని నిర్దిష్టమైన ఒక ఉదాహరణను చూపించి, చదవమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి.

ఇతర ప్రచురణలు

ఇతర పుస్తకాలు, బ్రోషుర్ల కోసం సూచించబడిన అందింపులు, వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో దిగువ ఇవ్వబడిన ఉపశీర్షికల క్రింద కనబడతాయి:

సూటిగా ప్రస్తావించడం

బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి, ఈ దిగువ ఇవ్వబడిన సూటిగా చేసే ప్రస్తావనల్లో ఒకదాన్ని ప్రయత్నించి చూడండి:

“బైబిల్లోని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు కేవలం కొద్ది నిమిషాల్లోనే మీరు జవాబును కనుగొనగలరని మీకు తెలుసా? ఉదాహరణకు, . . .” ఆ తర్వాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లో ఆ వ్యక్తికి ఏ పాఠం తగినదని మీకనిపిస్తుందో దాని ఆరంభంలోనున్న ఒక ప్రశ్నను అడగండి.

“మా ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమం గురించి మీకు చూపించడానికి వచ్చాను. దానికి కేవలం అయిదు నిమిషాలు పడుతుంది. మీరు అయిదు నిమిషాలు వెచ్చించగలరా?” జవాబు సరే అని వస్తే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని మొదటి పాఠం ఉపయోగించి అధ్యయనం చేసే విధానం చూపించండి, మీరు ఎంపిక చేసుకున్న ఒకటి లేక రెండు లేఖనాలను మాత్రమే చదవండి. ఆ తర్వాత, ఇలా అడగండి: “మనం తర్వాతి పాఠం పూర్తి చేయడానికి, దాదాపు 15 నిమిషాలు మీరెప్పుడు వెచ్చించగలరు?”

“చాలా మంది దగ్గర బైబిలు ఉంది, కానీ, భవిష్యత్తు గురించి మనందరిలో తలెత్తే ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు అందులో ఉన్నాయని వాళ్ళు గుర్తించరు. వారానికి ఒక గంట లేదా కాస్త అటు ఇటుగా గడుపుతూ ఈ అధ్యయన సహాయకాన్ని [దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ లేదా జ్ఞానము పుస్తకం] ఉపయోగించడం ద్వారా, కేవలం కొన్ని నెలల్లోనే మీరు బైబిలు గురించిన ప్రాథమిక అవగాహనను పొందగలరు. ఈ అధ్యయన కార్యక్రమం ఎలా జరుగుగుతుందో చూపించడానికి నేను సంతోషిస్తాను.”

“మీకు ఉచిత బైబిలు కోర్సు గురించి చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. మీరు అనుమతిస్తే, సుమారు 200 దేశాల్లోని ప్రజలు తమ ఇండ్లలో బైబిలును కుటుంబ సమేతంగా ఎలా చర్చిస్తారో కొన్ని నిమిషాల్లో చూపిస్తాను. చర్చ కొరకు మనం వీటిలోని ఏ అంశాన్నైనా ఉపయోగించవచ్చు. [జ్ఞానము పుస్తకంలోని విషయసూచికను చూపించండి.] ముఖ్యంగా ఏ విషయంపై మీకు ఆసక్తిగా ఉంది?” ఆ వ్యక్తి ఎంపిక చేసుకునేంతవరకు ఆగండి. ఎంపికచేసుకున్న అధ్యాయాన్ని తెరచి, మొదటి పేరానుండి అధ్యయనం ప్రారంభించండి.

“నేను బైబిలు పాఠాలను ఉచితంగా నేర్పిస్తాను, క్రొత్త విద్యార్థులకు నేర్పించడానికి నాకు సమయం ఉంది. మేము బైబిలు అధ్యయనానికి ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నాము. [జ్ఞానము పుస్తకాన్ని చూపించండి.] ఈ కోర్సు కొన్ని నెలలే ఉంటుంది, ఇది, దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు? మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము? మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది? మనం దేవునికి సన్నిహితంగా ఎలా కాగలము? వంటి ప్రశ్నలకు జవాబులనిస్తుంది. ఒక పాఠం చూపించమంటారా?”

ఆసక్తిని కలిగించడంలో మంచి ఫలితాలనిచ్చే సమర్థవంతమైన అందింపును మీరు కనుగొంటే, నిస్సందేహంగా దాన్నే ఉపయోగిస్తుండండి! దాన్నే ఈ నెల సాహిత్యాల ప్రతిపాదనలకు అనుగుణంగా మలచుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి