దప్పిగొన్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానించండి
1 ప్రవక్తయైన ఆమోసు ప్రవచించినట్లుగా, ఈనాడు మానవాళి “అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము”తో బాధపడుతోంది. (ఆమో. 8:11) ఆధ్యాత్మికంగా పిడచగట్టుకుపోయిన ఈ స్థితిలో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు, విధేయులైన మానవులను పాపమరణాల నుండి పూర్వపు స్థితికి తీసుకొచ్చేందు కొరకైన దేవుని ఏర్పాట్లను గురించి మనం వారికి చెబుతాము, ఆ ఏర్పాట్లు ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయంలో “జీవజలముల నది”గా వర్ణించబడ్డాయి. “జీవజలమును ఉచితముగా పుచ్చు”కొనడానికి నీతి నిమిత్తం దప్పిగొన్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానించే ఆధిక్యత మనకుంది. (ప్రక. 22:1, 17) ఈ ఫిబ్రవరి నెలలో దీన్ని మనమెలా చేయగలం? మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్నో లేదా సగం ధరకుగానీ, ప్రత్యేకధరకుగానీ ఇచ్చే పుస్తకాల జాబితాలోని ఏదైనా ఒక పాత ప్రచురణనో ప్రతిపాదించడం ద్వారా చేయవచ్చు. ప్రాంతీయభాషల్లో ఈ పుస్తకాల్లో ఏదీ లభించనట్లయితే, నిత్య జీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్నిగానీ లేదా కుటుంబ సంతోషానికి గల రహస్యము పుస్తకాన్నిగానీ ప్రతిపాదించవచ్చు. ఈ క్రింది అందింపులను మీరు ప్రయత్నించవచ్చు:
2 ఆరోగ్య విషయాల ఎడల అనేకమంది ప్రజలు శ్రద్ధను చూపిస్తారు గనుక, మీరిలా చెప్పడం ప్రతిభావంతంగా ఉండవచ్చు:
◼ “మంచి వైద్యానికి అయ్యే ఖర్చులు పెరగడం వల్ల అనేకమంది కలతచెందుతున్నారు. బహుశా మీరు దీన్ని గురించి ఆలోచించే ఉంటారు. [ప్రతిస్పందించనివ్వండి.] ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారమేమైనా ఉందా? [జవాబు కొరకు వేచివుండండి.] ఇదిగో ఇక్కడ ఒక అద్భుతమైన ఉత్తరాపేక్ష ఉంది.” ప్రకటన 21:3, 4 వచనాలను చదవండి. తర్వాత నిరంతరము జీవించగలరు పుస్తకం 162వ పేజీ తెరిచి అక్కడున్న చిత్రాన్ని చూపించి, దాన్ని వివరించేందుకు 164వ పేజీలో ఉన్న 17, 18 పేరాలను ఉపయోగించండి. “అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో ఈ ప్రచురణ చర్చిస్తుం[దని]” చెబుతూ ముగించండి. పుస్తకాన్ని ప్రతిపాదించి, తిరిగి సందర్శించడానికి ఏర్పాట్లు చేసుకోండి.
3 పునర్దర్శనం చేసేటప్పుడు, మీరిలా చెబుతూ చర్చను పునఃప్రారంభించవచ్చు:
◼ “క్రిందటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు, ఆరోగ్య సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. రోగగ్రస్థుల్లేని కాలం ఎప్పటికైనా వస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] అవధానాన్ని ఆకట్టుకొనే ఈ వ్యాఖ్యానాన్ని గమనించండి.” యెషయా 33:24 వచనాన్ని చదవండి. దేవుడు కోరుతున్నాడు అనే బ్రొషూరులోని 5వ పాఠాన్ని తెరిచి 5-6 పేరాలను, వాటికి సంబంధించి పాఠం ప్రారంభంలో ఇవ్వబడిన ప్రశ్నలను అడుగుతూ, ఉదాహరించబడిన లేఖనాల్లో కొన్నింటిని తెరిచి చూస్తూ చర్చించండి. రోగాన్నీ మరణాన్నీ తీసివేయడమనేది భూమి ఎడల దేవుని ఆది సంకల్ప నెరవేర్పులో భాగమేనని చెప్పండి. అదే పాఠంలోని 1-4 పేరాలనూ, 7వ పేరానూ చర్చించేందుకు పునర్దర్శనం కొరకు ఏర్పాట్లు చేసుకోండి.
4 అకాల మరణానికి గురైన వారిని గూర్చిన తాజా వార్త ప్రజల మనస్సుల్లో ఇంకా ఉంటే, మీరిలా చెప్పడానికి ప్రయత్నించవచ్చు:
◼ “[వార్తాంశాన్ని ప్రస్తావించండి] గురించి మీరు వినే ఉంటారు. విషాదకరమైనరీతిలో జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయినప్పుడు, వాళ్లను కోల్పోయిన కుటుంబాలను ఎలా ఓదార్చాలో అనేకులకు తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు?” ప్రతిస్పందించనివ్వండి. జ్ఞానము పుస్తకంలోని 86వ పేజీ తెరిచి, అక్కడున్న పునరుత్థానాన్ని గూర్చిన చిత్రాన్ని చూపించండి. “పరదైసు భూమిపై జీవించేందుకు నీతిమంతులూ, అనీతిమంతులూ లేపబడతారని తెలుసుకొని అనేకులు ఆశ్చర్యచకితులౌతారు. [87వ పేజీనందలి 17వ పేరాలో ఉదాహరించబడిన అపొస్తలుల కార్యములు 24:15వ వచనాన్ని చదివి, అదే పేరాలో ఉన్న వివరణనివ్వండి.] భవిష్యత్తు కొరకైన దేవుని సంకల్పాన్ని గూర్చిన అనేక ఆసక్తికరమైన ఇతర వివరాలను గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. మీరొక ప్రతిని తీసుకొని, చదవాలని నేను కోరుతున్నాను.” ఆ వ్యక్తి ప్రత్యేకంగా శ్రద్ధనూ ఆసక్తినీ చూపే విషయాలను నోట్ చేసుకుని, పునర్దర్శించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
5 మీరు పునర్దర్శనం చేసేటప్పుడు, మీరిచ్చే అందింపును గృహస్థునికి సరిగ్గా సరిపోయేలా మలుచుకోండి. బహుశా మీరిలా చెప్పవచ్చు:
◼ “క్రిందటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు, భూమి విషయంలో దేవుని సంకల్పాన్ని గూర్చిన మీ అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను. [ఆ వ్యాఖ్యానాన్ని ప్రస్తావించండి.] మీకు ఆసక్తికరంగా ఉంటుందని నేను అనుకున్న కొంత సమాచారాన్ని తీసుకొచ్చాను.” దేవుడు కోరుతున్నాడు బ్రొషూర్ను 5వ పాఠంవైపుకి త్రిప్పండి. గృహస్థుడు ఆసక్తి చూపిస్తున్నంతవరకూ ఎన్ని పేరాలను వీలైతే అన్ని పేరాలను చదివి చర్చించండి. ఆ పాఠాన్ని కొనసాగించేందుకు పునర్దర్శనం కొరకు సమయాన్ని ఏర్పాటుచేసుకున్న తర్వాత, సంఘ కూటం జరిగే వేళల్ని చూపుతున్న హ్యాండ్బిల్ను గృహస్థునికి ఇవ్వండి. బహిరంగ కూటం గురించి వివరించి, హాజరుకమ్మని అతన్ని ఆహ్వానించండి.
6 పాత పుస్తకాల్ని ప్రతిపాదిస్తున్నప్పుడు, ఒక కరపత్రంలోని విషయాల్ని ఉన్నతపరుస్తున్న సరళమైన అందింపును మీరు అందించాలనుకుంటే, మీరిలా చెప్పవచ్చు:
◼ “శాంతియుతమైన నూతనలోకంలో జీవితము అనే పేరుగల ఈ కరపత్రాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను.” మీరు దాన్ని అతని చేతికిచ్చి, ఆ కరపత్రంలోని మొదటి పేరాను మీరు చదువుతుండగా అతన్ని చూడమని ఆహ్వానించండి. అక్కడున్న ప్రశ్నలకు అతన్ని జవాబు చెప్పనివ్వండి. రెండవ పేరాను చదివి, మీరు ఏ పుస్తకాన్ని ప్రతిపాదిస్తున్నా సరే, ఆ పుస్తకంలో పరదైసును గూర్చిన చిత్రంవున్న పేజీవైపుకి త్రిప్పండి. “భవిష్యత్తు కొరకైన బైబిల్లోని అద్భుతమైన వాగ్దానాల్ని గూర్చిన మరిన్ని వివరాల్ని ఈ పుస్తకం ఇస్తోంది” అని చెబుతూ కొనసాగించండి. ఆ పుస్తకాన్ని ప్రతిపాదించి, పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకోండి.
7 ఆకట్టుకునే రీతిలో మనం ఇతరులను ఆహ్వానించడం, వాళ్లు జీవ జలాల దగ్గరకు అంటే యెహోవా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంచిన జీవజలాల దగ్గరకు వచ్చేలా చేయవచ్చు. కాబట్టి, దప్పిగొనిన ప్రతి ఒక్కరికీ ‘రమ్ము!’ అని చెబుదాం.—ప్రక. 22:17.