మీ పరిచర్యలో ఫలవంతంగా ఉండండి
1 ఆకాశంలో అంధకారం అలుముకుంటుంది; చెవులకు చిల్లులుపడేంతటి భయానకమైన ధ్వని విపరీతంగా పెరిగిపోతుంది. పొగలాంటి మేఘాలు పైకి లేస్తున్నాయి. ఏమిటది? లక్షలాది మిడతల దండు దేశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి వస్తోంది! ప్రవక్తయైన యోవేలు వర్ణించిన ఈ సన్నివేశం నేడు దేవుడి అభిషిక్త సేవకులు మరియు వారి సహచరులైన గొప్ప సమూహము చేసే బోధనా పనిలో నెరవేరుతోంది.
2 కావలికోట మే 1, 1998 సంచిక పేజీ 11 పేరా 19 ఇలా పేర్కొంది: “దేవుని ఆధునికకాల మిడుతలదండు క్రైస్తవ మత సామ్రాజ్య ‘పట్టణములో’ సమగ్రమైన సాక్ష్యాన్నిచ్చింది. (యోవేలు 2:9) . . . వాళ్ళు యెహోవా సందేశాన్ని ప్రకటిస్తుండగా, కోట్లాది గృహాల్లో ప్రవేశిస్తూ, వీధుల్లో ఉన్న ప్రజల్ని సమీపిస్తూ, ఫోన్లద్వారా వారితో మాట్లాడుతూ, సాధ్యమైన ప్రతి మార్గంలో వారిని కలుసుకుంటూ వాళ్లింకా అనేక ఆటంకాల్ని అధిగమిస్తూనే ఉన్నారు.” దేవుడు నియమించిన పనిలో భాగం వహించగలగడం గొప్ప ఆధిక్యత కదా?
3 తమ పొట్ట నింపుకోవాలన్నదే ఏకైక లక్ష్యంగల అక్షరార్థ మిడతల్లా కాక, యెహోవా సేవకులుగా మనం ఎవరికి బోధిస్తున్నామో వారి విషయమై గొప్ప చింత కల్గి ఉన్నాం. దేవుడి వాక్యంలో ఉన్న మహిమాన్విత సత్యాలను తెలుసుకోవడానికి, వారి నిత్య రక్షణకు దారితీయగల చర్యలను తీసుకోవడానికి వారు పురికొల్పబడేలా వారికి సహాయం చేయాలనీ మనం కోరుకుంటాం. (యోహా. 17:3; 1 తిమో. 4:16) కనుక, మనం పరిచర్యను చేసే విధానం ఫలవంతంగా ఉండాలని కోరుకుంటాం. ప్రజలకు బోధించేందుకు మనం ఏ మార్గాన్ని ఉపయోగించినప్పటికీ, మంచి ఫలితాలను తేగల రీతిలో మంచి ఫలితాలను తేగల సమయంలో దానిని చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. “ఈ లోకపు నటన గతించుచున్నది” గనుక, శాయశక్తులా ఫలవంతంగా ఉండాలన్న సవాలును ఎదుర్కోగల్గేలా నిశ్చయపర్చుకునేందుకు, మనం ఉపయోగించే పద్ధతులనూ మనం సమీపించే విధానాన్నీ విశ్లేషించుకోవడం మంచిది.—1 కొరిం. 7:31.
4 మనం ప్రజలను కలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రయాసపడుతుండగా, ఇంటింటి పరిచర్య మన పరిచర్యలో ముఖ్య మార్గంగా ఉంది. తరచూ ప్రజలు ఇండ్లలో ఉండడంలేదనీ, మీరు సందర్శించే వేళలో నిద్రపోతున్నారనీ మీరు కనుగొంటున్నారా? మీరు వారితో సువార్త సందేశాన్ని పంచుకోలేకపోవడం ఎంత నిరాశాజనకమైన విషయం! మీరు ఈ సవాలును ఎలా ఎదుర్కోగలరు?
5 అనుకూలంగా, సహేతుకంగా ఉండండి: మొదటి శతాబ్దపు ఇశ్రాయేలులో జాలరులు రాత్రుల్లో చేపలు పట్టేవారు. రాత్రివేళే ఎందుకు? వాళ్ళకు అది అత్యంత అనుకూలమైన సమయం కానప్పటికీ, మరిన్ని చేపలను పట్టడానికి అదే మంచి సమయం. అది చాలా ఫలితాన్ని తెచ్చే సమయం. ఈ పద్ధతిపై వ్యాఖ్యానిస్తూ, కావలికోట జూన్ 15, 1992 (ఆంగ్లం) ఇలా పేర్కొంది: “మనము కూడ మనుష్యులను వెదకుటకు మన ప్రాంతాన్ని అధ్యయనం చేయాలి. అధికసంఖ్యాకులు ఇండ్లలో ఉండేదెప్పుడు, ఏ సమయంలో అయితే వినడానికి సుముఖత చూపిస్తారు అని అధ్యయనం చేయాలి.” సాంఘిక అలవాట్లను గురించి జాగ్రత్తగా పరిశీలించగా, అనేక నగర శివార్లలోని, నివాస ప్రాంతాల్లోని ప్రజలు మనం శనివారాలు లేదా ఆదివారాల్లో ఉదయాన కాస్త త్వరగా వెళితే ఇంటి దగ్గర కనిపిస్తారు కానీ ఆ సమయంలో సాధారణంగా మనల్ని ఆహ్వానించరు. మీ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి అయితే, మీ సందర్శనాన్ని ఉదయం కాస్త ఎండ వచ్చాక లేదా మధ్యాహ్నానికి మార్చుకోగలరా? మన పరిచర్యలో మన ఫలవంతాన్ని అధికం చేసుకునేందుకు అలాగే నిజ క్రైస్తవ ప్రేమకు నిదర్శనంగా మన పొరుగువారి ఎడల పరిగణను చూపించేందుకు ఇది చక్కని మార్గం.—మత్త. 7:12.
6 ఫిలిప్పీయులు 4:5లో, అపొస్తలుడైన పౌలు “మీ సహనమును [“సహేతుకతను,” NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రేరేపిత నిర్దేశానికి అనుగుణ్యంగా, మనం ఆసక్తిగాను ఉత్సాహంగాను బోధించే నియామకాన్ని చేపడుతుండగా, మనం సమతుల్యత గలవారముగా, సహేతుకతగలవారముగా ఉండాలని కోరుకుంటాం. మనం ‘ఏదీ దాచక, బహిరంగముగా, ఇంటింటా తెలియజేయాలని’ కోరుకుంటాం. సహేతుకమైన, ఫలితాన్నిచ్చే సమయాల్లో మన ఇంటింటి పరిచర్య చేసేలా నిశ్చయపరచుకోవాలనుకుంటాం. (అపొ. 20:20) మొదటి శతాబ్దపు ఇశ్రాయేలులోని జాలరుల్లాగా, మనం చింతించేది మరింత ఫలితాన్నిచ్చే ‘చేపలు పట్టే’ సమయాలేవి అనేదానిని గురించే కాని మనకు అనుకూలమైన సమయాలను గురించి కాదు.
7 ఎలాంటి మార్పులను చేసుకోవచ్చు? చాలా తరచుగా, ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటాలు శని, ఆదివారాల్లో ఉదయం 9:00 గంటలకు లేదా 9:30 గంటలకు జరుగుతాయి. ఆ తర్వాత, వెంటనే సేవా ప్రాంతంలో ఇంటింటి పరిచర్య చేయడానికి గుంపు బయలుదేరుతుంది. అయినప్పటికీ, నివాస ప్రాంతాల్లో ఇంటింటి పరిచర్యకు వెళ్ళక ముందు వీధి సాక్ష్యం, వ్యాపార ప్రాంతాల్లో సాక్ష్యం లేదా పునర్దర్శనాలు వంటి వివిధ రూపాల పరిచర్యలో గుంపు భాగం వహించే ఏర్పాటును కొన్ని పెద్దల సంఘాలు చేశాయి. ఇతర సంఘాలు ప్రాంతీయ పరిచర్య కొరకైన సేవా కూటాలను ఇంకాస్త సమయం గడిచిన తర్వాత, ఉదయం 10:00 గంటలకు, 11:00 గంటలకు లేదా మధ్యాహ్నం 12:00 గంటలకు జరుపుకునే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత, గుంపు నేరుగా ఇంటింటి పరిచర్యలో ప్రవేశించి, మధ్యాహ్నమంతా కూడా ప్రాంతీయ పరిచర్యలోనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో, ప్రాంతీయ పరిచర్య కొరకు, ఉదయం కాక, మధ్యాహ్న సమయం సమావేశం కావడమే మంచిది. అలాంటి సర్దుబాట్లు, ఇంటింటి పనిలో ఫలోద్పాదన పెరుగుదలకు దోహదపడగలదు.
8 వివేచించేవారిగా, నేర్పుగలవారిగా ఉండండి: మనం ఇంటింటా ప్రజలను కలుస్తుండగా, మన సందేశం ఎడల వైవిధ్యభరితమైన ప్రతిస్పందనలు వస్తాయి. కొందరు గృహస్థులు ఆహ్వానిస్తారు. ఇతరులు నిర్లక్ష్యాన్ని కనబరుస్తారు. కొందరు వాదించేవారిగా లేక కోప్పడేవారిగా ఉండవచ్చు. చివరి తరహాలాంటి వారి విషయానికి వస్తే, లేఖనముల నుండి తర్కించడం (ఇంగ్లీష్) పుస్తకం 7వ పేజీలో, “సత్యానికి గౌరవం చూపించని ప్రజలతో ‘గెలిచే వాదాలను’” చేయడానికి ప్రయత్నించకూడదని మనకు గుర్తు చేయబడింది. గృహస్థుడు శత్రుభావంతో ఉన్నట్లయితే, మనమక్కడి నుండి బయలుదేరడమే మనకు క్షేమకరం. మనతో మాట్లాడాలని, మన దృక్కోణాన్ని అంగీకరించాలని మనం ప్రజలను బలవంతపెడ్తూ, వాళ్ళను రెచ్చగొట్టకూడదు. మనం మన సందేశాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దము. అది సహేతుకంగా ఉండదు. అది ఇతర సాక్షులకూ, అలాగే మన పనిమొత్తం మీదకే సమస్యలను తెచ్చిపెట్టగలదు.
9 ఒక టెరిటరీలో పరిచర్య ఆరంభించే ముందు, తమను సందర్శించవద్దని చెప్పిన నివాసుల చిరునామాల కోసం టెరిటరీ కార్డును చెక్ చేయడం జ్ఞానపూర్వకమైన పని. అలాంటి చిరునామాలుంటే, అలా చెప్పిన వ్యక్తులు నివసించే వీధుల్లో సేవచేస్తున్న ప్రతి ప్రచారకుడికి తెలపాలి. సేవా పైవిచారణకర్త నిర్దేశం లేకుండా ఎవరు కూడా తమకు తాముగా నిర్ణయించుకుని ఆ ఇండ్లను సందర్శించకూడదు.—జనవరి, 1994 మన రాజ్య పరిచర్య, ప్రశ్నా భాగం చూడండి.
10 మనం ఇంటింటా చేస్తుండగా మనం వివేచనను చూపడం ద్వారా మన ఫలవంతాన్ని అధికం చేసుకోగలం. మీరు ఒక ఇంటిని సమీపిస్తుండగా, అంతా గమనించండి. అన్ని కర్టెన్లూ కిటికీ తెరలు దించివేయబడ్డాయా? అక్కడ ఏదైనా పని జరుగుతున్న శబ్దం ఏమీ వినబడడం లేదా? అంటే ఇంట్లోవాళ్ళు నిద్రపోతున్నారేమో. మనం వాళ్ళను తర్వాత ఎప్పుడైనా కలిస్తే ఆ గృహస్థులతో మరింత ఫలవంతంగా మాట్లాడగల్గుతామేమో. ఆ ఇంటి నెంబరు వ్రాసుకుని, ప్రస్తుతానికి ఆ ఇంటిని వదిలిపెట్టడమే మంచిది. మీరు ఆ ప్రాంతాన్ని వదిలివెళ్ళే ముందు మరోసారి ఆ ఇంటికి వెళ్ళి చూడండి లేదా కొంచెం సమయం తర్వాత మరొకసారి వెళ్ళి చూడాలని నిర్ణయించుకోండి.
11 ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, ఎవరినైనా నిద్రనుండి మేల్కొలిపినవారమవ్వవచ్చు, లేక నిద్రాభంగం కలిగించినవారమవ్వవచ్చు. అతడికి చికాకు కలగడమో, కోపం రావడమో జరగవచ్చు. మనమెలా ప్రతిస్పందించాలి? “శాంతగుణముగలవాడు వివేకముగలవాడు” అని సామెతలు 17:27 ఉపదేశిస్తుంది. మనం మన పరిచర్య విషయమై క్షమాపణ కోరుకోము గానీ, వాళ్ళను అననుకూల సమయంలో సందర్శించినందుకు మనం చాలా విచారిస్తున్నామని తప్పకుండా వ్యక్తం చేయగల్గుతాం. మరో సమయం వారికి అనుకూలమౌతుందేమో నమ్రతగా అడిగి, తిరిగి వస్తామని ప్రతిపాదించండి. మృదువైన స్వరంలో వ్యక్తి ఎడల శ్రద్ధను తెలియజేసే వ్యక్తీకరణ అలాంటి వ్యక్తిని కాస్త నెమ్మదిపరుస్తుంది. (సామె. 15:1) తను ఎప్పుడూ నైట్ షిఫ్ట్‌లే చేస్తానని గృహస్థుడు చెప్పినట్లయితే, టెరిటరీ కార్డులో ఈ విషయాన్ని నోట్ చేయవచ్చు. అలా భవిష్యత్తులో చేసే సందర్శనాలను సముచితమైన సమయంలోనే చేయవచ్చు.
12 మనం మన టెరిటరీని బాగా పూర్తి చేయడానికి ప్రయాసపడుతుండగా వివేచనను ఉపయోగిస్తే సముచితంగా ఉంటుంది. మనం మొదటిసారి సందర్శించినప్పుడు చాలా మంది ఇండ్లలో ఉండరు గనుక, వాళ్ళతో రక్షణ సందేశాన్ని పంచుకునేందుకు వాళ్ళను కలిసేందుకు మనం అదనపు ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంటుంది. (రోమా. 10:13) కొన్నిసార్లు, ప్రచారకులు ఇండ్లలో ప్రజలను కలిసే ప్రయత్నంలో వారి ఇండ్లను ఒక్క రోజులోనే అనేక సార్లు సందర్శిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. ఇది పొరుగువాళ్ళ దృష్టిలో పడకుండా పోదు. యెహోవాసాక్షులు తమ వీధిలో ‘అస్తమానం తిరుగుతుంటారు’ అనే ప్రతికూలమైన అభిప్రాయాన్ని ఇది కలిగించవచ్చు. దీనిని మనమెలా నివారించవచ్చు?
13 వివేచనను ఉపయోగించండి. ఆ ఇండ్లను మళ్ళీ సందర్శించేటప్పుడు, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్న సూచన ఏమైనా ఉందా? మెయిల్‌బాక్స్ గుండా తపాలాలు, కరపత్రాలు ఉన్నట్లు అనిపించిందంటే, ఆ వ్యక్తి ఇప్పటికీ ఇంట్లో లేడని అర్థం. ఈ సారి తలుపుదగ్గరకు వెళ్ళడం వల్ల ఫలితం ఉండదు. ఆ రోజే వేరే వేరే సమయాల్లో, బహుశ సాయంకాలం, అట్లా కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా, ఆ వ్యక్తిని కలవలేనట్లయితే, ఒకవేళ సాయంత్రాల్లో ఫోన్ ద్వారా ఆ వ్యక్తిని కలవవచ్చు. అలా కానట్లైతే, ఒక కరపత్రాన్ని లేక హ్యాండ్‌బిల్లును నేరుగా తలుపులోపల వేయవచ్చు. ముఖ్యంగా ఆ ప్రాంతం తరచూ పూర్తి చేయబడుతున్నదైతే. తర్వాతి సారి ఆ ప్రాంతాన్ని చేసినప్పుడు ఆ వ్యక్తిని కలవవచ్చేమో.
14 వాతావరణం బాగోలేనప్పుడు గృహస్థుడితో వాళ్ళ ఇంటి తలుపుదగ్గర ఎక్కువ సేపు సంభాషించకూడదు. వాళ్ళు ఇంట్లోకి ఆహ్వానించినట్లైతే, వాళ్ళ నేల మురికవ్వకుండా ఉండేలా జాగ్రత్తపడండి. కుక్క మొరుగుతున్నట్లయితే, వివేచన చూపించండి. అపార్ట్‌మెంట్ కట్టడాల్లో పనిచేస్తున్నప్పుడు, తగ్గు స్వరంలో మాట్లాడండి, అక్కడి నివాసులకు చికాకు కలిగేలా, మీ సాన్నిధ్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్లుగా చప్పుడు చేయకండి.
15 పద్ధతిగానూ, హుందాగానూ ఉండండి: మంచి సంస్థీకరణతో, మనం పెద్దవైన, బాగా కనిపించేంతటి గుంపులను పరిచర్య ప్రాంతంలో సమావేశపరచం. పెద్ద ప్రచారకుల గుంపు అనేక కార్లూ, మోటార్ సైకిళ్ళూ, స్కూటర్లూ, లేదా వ్యాన్లతో తమ ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొందరు గృహస్థులు భయపడవచ్చు. మనం నివాస ప్రాంతాలను “ఆక్రమించు”కోబోతున్నామన్న తలంపును కలిగించాలని మనమనుకోం. పరిచర్య ప్రాంతంలో పనిచేసేందుకు గల ఏర్పాట్లను ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటాల్లో చేసుకోవడం మంచిది. ఒక కుటుంబంలాగా, ప్రచారకులు చిన్న గుంపులతో వెళ్తే, గృహస్థులు భయపడరు, ఆ ప్రాంతంలో సేవ చేస్తుండగా, పునఃసంస్థీకరణ అంత పెద్ద అవసరమూ కాదు.
16 క్రమపద్ధతిగా ఉండేందుకుగాను, టెరిటరీలో పరిచర్య చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను నడవడిని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. పిల్లలు పెద్దవారితోపాటు ఇంటింటికి వెళ్తుండగా మంచి నడవడి గలవారై ఉండాలి. చిన్న పిల్లలు ఇంటివాళ్ళ లేదా దారిన వెళ్ళేవాళ్ళ అవధానాన్ని అనవసరంగా ఆకట్టుకోకుండా ఉండేందుకుగాను వారిని ఆడుకోవడానికైనా, ఊరికే అక్కడికిక్కడికి తిరగడానికైనా అనుమతించకూడదు.
17 టీ, కాఫీ బ్రేక్‌ల విషయంలో సమతుల్యత అవసరం. మనరాజ్య పరిచర్య, జూన్ 1995 పేజీ 3 ఇలా అంటోంది: “మనం పరిచర్యలో ఉన్నప్పుడు, టీ త్రాగడానికి వెళ్ళడంవల్ల విలువైన సమయాన్ని కోల్పోవచ్చు. అయినప్పటికీ, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం మనలను పునరుత్తేజపరచి, కొనసాగడానికి మనకు సహాయపడవచ్చు. అయితే, అనేకులు పరిచర్యకు కేటాయించిన సమయంలో టీ త్రాగడానికి సహోదరులతో కలిసే బదులు ప్రజలకు సాక్ష్యమివ్వడంలో బిజీగా ఉండడానికి ఇష్టపడతారు.” అల్పాహారం తీసుకోవడానికి ఆగాల వద్దా అన్నది వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ, సహోదరీ సహోదరుల పెద్ద గుంపు టీ స్టాల్‌లో లేక ఒక రెస్టారెంట్‌లో సమావేశం అవ్వడం కొన్నిసార్లు గమనించబడింది. ఆర్డర్ చేసినవి సప్లయ్ చేసే వరకు వేచివుండి సమయం వృథాకావడమే కాక, ఒక గుంపు అక్కడ ఉండడం మిగతా కస్టమర్లకు భయం కలిగించవచ్చు. కొన్నిసార్లు, ఉదయం ప్రాంతీయ పరిచర్యలో కలిగిన అనుభవాలను పెద్దగా చర్చించుకోవడం జరుగుతుంది, ఇది మన పరిచర్యకుండే హుందాతనాన్ని హరించివేస్తుంది. అది పరిచర్య ఫలవంతాన్ని తగ్గించివేస్తుంది. ప్రచారకులు వివేచనాపూర్వకంగా ఉంటూ, ఒక వ్యవస్థాపనలో పెద్ద గుంపుగా వెళ్ళి, పరిచర్యకు చెందవలసిన సమయాన్ని అనవసరంగా పోనివ్వరు.
18 ప్రజలు ఎక్కడ కనిపిస్తారో అక్కిడికి—వీధుల్లో, పార్కింగ్ ప్రాంతాల్లో, మరితర బహిరంగ స్థలాల్లోకి వెళ్ళి అనేకులు మంచి ఫలితాలను పొందారు. అక్కడ కూడా కేవలం మాటల్లో కాదు గానీ, మన సహేతుకత ద్వారా మనం మంచి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటాం. ప్రతి సంఘంలోని ప్రచారకులు తమ టెరిటరీ సరిహద్దుల విషయమై గౌరవంగా ఉంటారనీ, అలా వాణిజ్య ప్రాంతంలో బాటసారులనూ, బస్సులోను, రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారాల్లోను లేదా పెట్రోల్ బంక్‌లు వంటి 24 గంటలూ నడిచే వ్యాపారంలో పనిచేస్తున్నవారిలోను కంగారు కలిగించరు. మనం మన పరిచర్యను పద్ధతి ప్రకారం చేస్తున్నామని, హుందాగా ఉండే పద్ధతిలో చేస్తున్నామని నిశ్చయపరచుకునేందుకు, మరో సంఘం తన సంఘ సేవా కమిటీ ద్వారా వాళ్ళకు కొంత చేయూతనందించమని కొన్ని నిర్దిష్ట ఏర్పాట్లు చేస్తే తప్ప, మనం మనకు అసైన్ చేయబడిన సొంత టెరిటరీలో మాత్రమే చేస్తాం.—పోల్చండి 2 కొరింథీయులు 10:13-16.
19 బహిరంగ సాక్ష్యం సాధ్యమయ్యే అనేక ప్రాంతాలున్న కొన్ని సంఘాలు ఈ ప్రాంతాలను టెరిటరీలుగా సంస్థీకరించారు. ఒక్కో ప్రచారకునికి లేదా ఒక్కో గ్రూపుకు ఒక్కో టెరిటరీ కార్డు ఇవ్వబడుతుంది. దీనివల్ల మరింత ఫలవంతంగా ప్రాంతాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. 1 కొరింథీయులు 14:39లోని “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అనే సూత్రానికి అనుగుణ్యంగా, ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో మరీ చాలా మంది ప్రచారకులు పని చేసే పరిస్థితి తప్పుతుంది.
20 వ్యక్తిగతంగా మన రూపం ఎల్లప్పుడూ హుందాగా ఉండాలి; మన రూపం యెహోవా నామాన్ని వహిస్తున్న పరిచారకులకు ప్రాతినిధ్యం వహించేదై ఉండాలి. మనం ఉపయోగించే ఉపకరణాల విషయమైనా అంతే. పాతబడిన పుస్తక సంచీలు, చివర్లు చినిగిపోయిన లేదా మురికిగా ఉన్న బైబిలు కరపత్రాలు రాజ్య సందేశానికి గౌరవం ఇవ్వకుండా చేస్తాయి. మీ వస్త్రధారణా, కేశాలంకరణా “మీ చుట్టూ ఉన్న జనానికి మీరు ఎవరు, మీరు ఏమిటి మిమ్మల్ని ఏ కోవలో చేర్చవచ్చు వంటి విషయాలకు సంబంధించిన శీఘ్ర క్లుప్త సమాచారాన్నిస్తాయి” అని చెప్పబడుతుంది. కనుక, మన రూపం అలక్ష్యంగానో, అశుభ్రంగానో, అనాకర్షకంగానో మరీ విపరీతమైనదిగానో ఉండకూడదు. ఎల్లప్పుడూ “సువార్తకు తగినట్లుగా” ఉండాలి.—ఫిలి. 1:27; పోల్చండి 1 తిమోతి 2:9, 10.
21 “నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అని 1 కొరింథీయులు 9:26-27లో అపొస్తలుడైన పౌలు పేర్కొంటున్నాడు. పౌలును అనుకరిస్తూ, మనం ప్రభావవంతమైన ఫలవంతమైన పరిచర్యను చేయాలని నిర్ణయించుకున్నాం. యెహోవా యొక్క నేటి “మిడుతల దండు”లో భాగంగా సాక్ష్యపు పనిలో మనం ఎంతో పట్టుదలగా పాల్గొంటుండగా, మన టెరిటరీలోని అందరికీ రక్షణ సందేశాన్ని తీసుకువెళ్ళడంలో మనం క్రైస్తవ సహేతుకతను, వివేచననూ ఉపయోగించుదము గాక.