దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి
1 యేసు మహాగొప్ప బోధకుడు. ప్రజలు “ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.” (మార్కు 1:22) మనలో ఎవ్వరమూ యేసు అంతటి మాట్లాడే, బోధించే వారము కాకపోయినప్పటికీ, ఆయనను అనుకరించడానికి మనము కృషిచేయగలము. (అపొ. 4:13) మాట్లాడే సామర్థ్యం, బోధించే సామర్థ్యం అభివృద్ధి చేసుకోవడానికి మనం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగం వహించడం సహాయం చేస్తుంది.
2 1999లోని అసైన్మెంట్ నెంబరు 1 ప్రాముఖ్యంగా 1997లోని కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలలోని శీర్షికలను ఆధారం చేసుకొని ఏర్పాటు చేయబడింది. మనం ఇందులోని సమాచారాన్ని ముందుగా చదివి, తర్వాత పాఠశాల కార్యక్రమంలో వినినట్లైతే మన ఆధ్యాత్మిక విషయాల అవగాహన బాగా పెరుగుతుంది. ఉపదేశ ప్రసంగం ఎవరికైతే ఇవ్వబడిందో వారు సమాచారం యొక్క ఆచరణాత్మక అన్వయింపును చేస్తూ, ఆ సమాచారాన్ని ఆసక్తికరంగాను, ఉత్తేజకరంగాను అందించాలి. అసైన్మెంట్ నెం. 3 కుటుంబ సంతోషము పుస్తకము మీద, అసైన్మెంట్ నెం. 4 చర్చనీయ బైబిలు అంశములు అనే చిన్నపుస్తకంపై ఆధారపడి ఉంటాయి. అయితే, ఈ అసైన్మెంట్ల నెంబర్లు మారుతూ ఉండవచ్చు. అసైన్మెంట్లను ఇవ్వడానికి ముందు పాఠశాల పైవిచారణకర్త జాగ్రత్తగా ఆలోచించాలి. కుటుంబ సంతోషము పుస్తకము నుండి ప్రసంగం ఇచ్చే విద్యార్థులందరూ తమ స్వంత కుటుంబ జీవితంలో మాదిరికరంగా ఉండాలి.
3 సలహాను అన్వయించండి, బాగా సిద్ధపడండి: ప్రతి ఒక్కరూ మాట్లాడే, బోధించే కళను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. (1 తిమో. 4:13) అందుకని, మనం సలహా కోసం ఎదురుచూడాలి కానీ, దానిని నివారించేందుకు ప్రయత్నించకూడదు. (సామె. 12:15; 19:20) కూటాల్లో, క్షేత్ర పరిచర్యలో సత్యాన్ని ప్రభావవంతంగా అందించడమంటే కేవలం వాస్తవాలు చెప్పడం లేదా యాంత్రికంగా లేఖనాలను చదవడం కంటే ఎంతో ఇమిడి ఉంది. మనల్ని వినేవారి హృదయాలను చేరి, వారిని పురికొల్పవలసిన అవసరతవుంది. సత్యాన్ని మన హృదయంలో నుండి దృఢంగా మాట్లాడడం ద్వారా మనం ఇలా చేయగలము. (అపొస్తలుల కార్యములు 2:37 పోల్చండి.) దీన్ని సాధించడానికి పాఠశాల నుండి మనం పొందే సలహా సహాయం చేస్తుంది.
4 మీరు అసైన్మెంట్ తీసుకొన్న వెంటనే, పాఠశాల నిర్దేశక పుస్తకములో వివరించబడిన, మీరు పనిచేయవలసిన ప్రసంగ లక్షణాన్ని గూర్చి ఆలోచించండి. మీరు మునుపు తీసుకొన్న సలహాను అన్వయించుకోవడానికి ఏమి చేయాలో కూడా ఆలోచించండి. మీకు ఇవ్వబడిన అంశాన్ని గూర్చి, సెట్టింగ్ అవసరమైనట్లైతే దానిని గూర్చి, మీకు అప్పగింపబడిన సమాచారానికి ఆయా లేఖనాలు ఎలా వర్తిస్తాయో వాటిని గూర్చి ధ్యానించండి. బోధించడం మరియు ఇతరులను పురికొల్పడంలో ఆ సమాచారాన్ని ఎంత శ్రేష్టమైన రీతిలో ఉపయోగించవచ్చునన్న దాని గురించి ఆలోచించండి.—1 తిమో. 4:15, 16.
5 పాఠశాలలో మీ పేరును నమోదు చేయించుకోవడం భయమనిపిస్తే, దానిని గురించి ప్రార్థించండి తర్వాత మీ భావాలను గురించి పాఠశాల పైవిచారణకర్తతో చర్చించండి. 1999లో అందించబడుతున్న దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి మంచి లాభాన్ని పొందడం ద్వారా ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందగలరు.