కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/01 పేజీ 1
  • ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒప్పించడమనే కళతో హృదయాలను చేరడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి ఇతరులకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీ బోధ ఒప్పించేలా ఉండాలి
    మన రాజ్య పరిచర్య—2010
  • “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో” తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 2/01 పేజీ 1

ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?

1 అపొస్తలుడైన పౌలు, ఒప్పించే పరిచారకుడన్న పేరును పొందాడు. (అపొ. 19:26) రాజైన అగ్రిప్ప కూడా ఆయనతో “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ [“క్రైస్తవుడయ్యేలా ఒప్పింప,” NW] జూచుచున్నావే” అని అన్నాడు. (అపొ. 26:28) పౌలు పరిచర్యను అంత ఒప్పింపచేసేదిగా చేసిందేమిటి? ఆయన వింటున్నవారికి తగ్గట్టుగా తన వాదనలను మలచుకుంటూ లేఖనాల్లో నుంచి సహేతుకంగా తర్కించాడు.—అపొ. 28:23.

2 పౌలును అనుకరిస్తూ, మనం కూడా పరిచర్యలో ఒప్పింప చేసేవారంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ, వాళ్లు చెప్పేదాన్ని వింటున్నప్పుడూ అంతర్దృష్టిని ఉపయోగించడం ద్వారానే. (సామె. 16:23) దాన్ని సాధించడానికి మనకు మూడు ప్రాముఖ్యమైన విషయాలు సహాయపడతాయి.

3 జాగ్రత్తగా ఆలకించండి: అవతలి వ్యక్తి మాట్లాడుతుండగా, దాంట్లో పరస్పర ఆమోదయోగ్యంగా ఉండే విషయాన్ని పట్టుకోడానికి ఆలకించండి. దాని ఆధారంగా సంభాషణను పెంపొందించవచ్చు. అతను అభ్యంతరం లేవదీసినట్లైతే, దాని వెనుకున్న కారణాన్ని వివేచించడానికి ప్రయత్నించండి. అలా చేయడం, ఆయన ఏం నమ్ముతున్నాడో, ఎందుకలా నమ్ముతున్నాడో, ఆయనలా నమ్మేలా చేసిందేంటో సరిగ్గా తెలుసుకునేందుకు సహాయపడుతుంది. (సామె. 18:13) నేర్పుగా ఆయన్నుంచే రాబట్టండి.

4 ప్రశ్నలు వేయండి: ఒకరు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్టు వ్యక్తంచేస్తే, “మీరు మొదటి నుంచి త్రిత్వాన్ని నమ్మేవారా?” అని మీరు అడగవచ్చు. ఆ తర్వాత, “ఈ అంశంపై బైబిలు ఏం చెబుతుందో తెలుసుకోడానికి మీరెప్పుడైనా సమగ్ర అధ్యయనం చేశారా?” అని అడగవచ్చు. “దేవుడు త్రిత్వంలో ఒక భాగమైతే, బైబిలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పివుండేదని మనం ఎదురు చూడమంటారా?” అని కూడా అడగవచ్చు. ఆ ప్రశ్నలకు ఆ వ్యక్తి ఇచ్చే జవాబు, మీరు లేఖనాల ఆధారంగా ఆయనతో తర్కించేలా సహాయం చేస్తుంది.

5 సరైన తర్కాన్ని ఉపయోగించండి: యేసు దేవుడని నమ్మిన ఒక స్త్రీని ఒక సాక్షి ఇలా ప్రశ్నించడం జరిగింది: ‘ఇద్దరు వ్యక్తులు సరిసమానులని ఉదహరించడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టైతే, వాళ్ల మధ్య ఎటువంటి కుటుంబ బాంధవ్యాన్ని మీరు ఉపయోగిస్తారు?’ ఆ స్త్రీ, “సోదర బాంధవ్యాన్ని ఉపయోగిస్తాను” అని జవాబిచ్చింది. దానికి ఆ సాక్షి, “బహుశా కవల సోదరుల బాంధవ్యాన్ని ఉపయోగిస్తే ఇంకా బావుంటుంది. అయితే, దేవున్ని తండ్రిగాను, తనను కుమారునిగాను దృష్టించమని బోధించడంలో యేసు ఏ సందేశాన్ని వ్యక్తం చేస్తున్నాడు?” అని అడిగాడు. దాంతో, వారిరువురిలో ఒకరు వయస్సులోనూ అధికారంలోనూ మరొకరికంటే ఎక్కువన్న విషయాన్ని ఆమె గ్రహించింది. (మత్త. 20:23; యోహా. 14:28; 20:17) ఒప్పింపచేసే కళతో ఆమె మనస్సునూ, హృదయాన్ని చేరుకోవడం జరిగింది.

6 నిజమే, మనం రాజ్య సందేశాన్ని ఎంత తర్కబద్ధంగా, ఎంత నిర్దిష్టంగా తెలియజేసినప్పటికీ సత్యాన్ని అందరూ స్వీకరించరు. అయితే పౌలులా మనమూ, మన టెరిటరీలో ఉన్న యథార్థ హృదయులను వెదకడంలోనూ, రాజ్య సందేశాన్ని అంగీకరించేలా వారిని ఒప్పింపచేయడంలోనూ శ్రద్ధతో కృషిచేద్దాం.—అపొ. 19:8.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి