జ్ఞాపకార్థ ఆచరణ కాలం, పరిచర్యలో ఎక్కువగా భాగం వహించేందుకు అనువైన సమయం
1. దైవభయంగల ఇశ్రాయేలీయుల మీద ‘నియామక పండుగలు’ ఎలాంటి ప్రభావం చూపించాయి?
1 ప్రాచీన ఇశ్రాయేలీయులు సంవత్సరంలోని నియమిత సమయాల్లో ‘యెహోవా నియామక పండుగలను’ ఆచరించారు. (లేవీ. 23:2) అలా వారు దేవుని మంచితనం గురించి ధ్యానించడానికి సమయం వెచ్చించడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందారు, స్వచ్ఛారాధనలో ఉత్సాహంగా ఉండేందుకు అది వారిని ప్రోత్సహించింది.—2 దిన. 30:21-31:2.
2, 3. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మన ఆధ్యాత్మిక కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం ఎందుకు సరైనది, జ్ఞాపకార్థ ఆచరణ మనం ఎప్పుడు ఆచరిస్తాం?
2 ఆధునిక కాలాల్లో, ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మనకు ఆనందాన్నిచ్చే దైవపరిపాలనా కార్యకలాపాలు అధికమౌతాయి. యెహోవా తన అద్వితీయ కుమారున్ని పంపించడం ద్వారా ఆయన మనకు ఇచ్చిన అమూల్యమైన బహుమానం గురించి ఆ సమయంలో లోతుగా ధ్యానిస్తాం. (యోహా. 3:16; 1 పేతు. 1:18, 19) దేవుడు, ఆయన కుమారుడు చూపించిన ప్రేమ గురించి మనం ధ్యానించడం ద్వారా, యెహోవాను స్తుతించేందుకు, ఆయన చిత్తం చేయడానికి కృషి చేసేందుకు ప్రేరేపించబడతాం.—2 కొరిం. 5:14, 15.
3 ఈ సంవత్సరం ప్రభువు రాత్రి భోజనం గురువారం, మార్చి 24న సూర్యాస్తమయం తర్వాత ఆచరిస్తాం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మన పరిచర్యను ఎలా విస్తృతం చేసుకోవచ్చు?
4, 5. (ఎ) ఎక్కువమందికి రాజ్య సువార్త గురించి సాక్ష్యమిచ్చేందుకు కొందరికి ఏమి సహాయం చేసింది? (బి) స్థానికంగా ఏది ప్రభావవంతంగా ఉన్నట్లు మీరు కనుగొన్నారు?
4 చాలామందికి సాక్ష్యమివ్వడం: క్షేత్రసేవలో పాల్గొంటున్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువమందికి సాక్ష్యమిచ్చే మార్గాల కోసం అన్వేషించండి. ప్రజలు ఎక్కువగా ఇళ్ళలో ఉన్నప్పుడు అంటే మధ్యాహ్నం లేక సాయంకాల సమయాల్లో, ఇంటింటి పరిచర్యలో పాల్గొనే విధంగా మీరు ప్రణాళిక వేసుకోగలరా? మీ పుస్తక అధ్యయన గుంపులోని కొందరు పుస్తక అధ్యయనానికి ముందు సేవలో భాగం వహించడానికి ఇష్టపడుతున్నట్లయితే, దగ్గరి క్షేత్రంలో పని చేయడానికి వీలుగా సేవ కోసం క్లుప్తమైన కూటాన్ని పుస్తక అధ్యయన పైవిచారణకర్త ఏర్పాట్లు చేయవచ్చు.
5 ఎక్కువమందికి సాక్ష్యమిచ్చే మరొక మార్గం బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యం ఇవ్వడం. జపాన్లో ఒక సహోదరి తనకు పూర్తికాల ఉద్యోగం ఉన్నా, సహాయ పయినీరు సేవ చేయాలని కోరుకుంది. ఉద్యోగానికి వెళ్ళే ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఆమె వీధి సాక్ష్యం ఇవ్వవచ్చని ఒక పెద్ద సలహా ఇచ్చాడు. ఆమె తన బిడియాన్ని, కొందరు ప్రయాణికుల అపహాస్యాన్ని అధిగమించిన తర్వాత, ఆమె దాదాపు 40 మంది వ్యక్తులతో పత్రికా మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది, వీరిలో ప్రయాణికులు, స్టేషన్లో పనిచేసేవారు, దగ్గర్లోని దుకాణదారులు ఉన్నారు. ఆమె నెలకు సగటున 235 పత్రికల చొప్పున అందించింది. ప్రతీదినం ప్రజలతో లేఖనాంశాలను చర్చించేందుకు కొద్ది క్షణాలు తీసుకోవడం ద్వారా ఆమె ఆరు బైబిలు అధ్యయనాలను ప్రారంభించగలిగింది.
6. యౌవనులు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఎలా విస్తృతం చేసుకోవచ్చు?
6 సాక్ష్యమిచ్చేందుకు అవకాశాలు: పాఠశాలకు వెళ్ళే చాలామంది ప్రచారకులకు సంవత్సరంలో ఆయా సమయాల్లో సెలవులు దొరుకుతాయి. ఈ సెలవులు సహాయ పయినీర్లుగా సేవ చేయడానికి అనువైన సమయాలు. దానితోపాటు, క్రైస్తవ యౌవనులు పాఠశాలలో సాక్ష్యమివ్వడం ద్వారా తమ పరిచర్యను విస్తృతం చేసుకోవచ్చు. తోటివిద్యార్థులు మీ నమ్మకాల విషయంలో ఎంతో జిజ్ఞాసతో ఉన్నారని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు. తరగతి గదిలో జరిగే చర్చల్లో లేదా పాఠశాల వ్యాసాల్లో సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇతరులు, మన వీడియోలను ఉపయోగించడం ద్వారా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. కొందరు తమ తోటి విద్యార్థులతో బైబిలు అధ్యయనాలు ప్రారంభించి, వారు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొనేందుకు సహాయం చేశారు. “యెహోవా నామమును స్తుతించ[డానికి]” ఇవి కొన్ని చక్కని మార్గాలు.—కీర్త. 148:12, 13.
7. (ఎ) ఇతరులకు సాక్ష్యమిచ్చేందుకు లభించే అవకాశాన్ని ఒక సహోదరుడు ఎలా ఉపయోగించుకున్నాడు? (బి) మీరు అలాంటి అనుభవాన్ని చవి చూశారా?
7 మీ దినచర్యలో, మన మహోన్నతుడైన దేవుని గురించి, ఆయన అద్భుతమైన వాగ్దానాల గురించి ప్రజలతో మాట్లాడగల వివిధ మార్గాలను అన్వేషించండి. ప్రతీరోజు ఒకే రైలులో ప్రయాణించే ఒక సహోదరుడు అనువైనప్పుడు తన తోటి ప్రయాణికులకు సాక్ష్యం ఇస్తాడు. ఉదాహరణకు, తాను ఎక్కబోయే తర్వాతి రైలు కోసం ఆయన వేచివున్నప్పుడు, ఒక యౌవనస్థునికి ప్రతీరోజు ఐదు నిమిషాలు సాక్ష్యం ఇచ్చేవాడు. తత్ఫలితంగా ఆ యౌవనస్థుడు, అతని సహోద్యోగి బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. ప్రయాణంలోనే వారితో బైబిలు అధ్యయనం ఆరంభమైంది. కొద్ది రోజులుగా వారి సంభాషణలను వింటున్న వయస్సు పైబడిన ఒక స్త్రీ ఆ సహోదరుని దగ్గరకు వచ్చి, బైబిలు అధ్యయనం కోసం అడిగింది. ఆమె కూడా రైలులో ప్రయాణిస్తున్న రోజుల్లో తన అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా, ఆ సహోదరుడు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పది మందితో అధ్యయనం చేశాడు.
8. వయస్సు పైబడిన కారణంగా లేక ఆరోగ్య సమస్యల కారణంగా పరిమితం చేయబడ్డవారు పరిచర్యలో తమ భాగాన్ని విస్తృతం చేసుకొనేందుకు వారికి ఎలాంటి సేవా పద్ధతి సహాయం చేయవచ్చు?
8 మీ వయస్సు పైబడుతున్న కారణంగా లేక ఆరోగ్య సమస్యల కారణంగా మీరు చేయగలిగినది పరిమితమైనట్లయితే అప్పుడేమిటి? మీరు యెహోవాను అధికంగా స్తుతించే మార్గాలు ఇంకా ఉండి ఉండవచ్చు. మీరు టెలిఫోను సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించారా? ఈ విధమైన సాక్ష్యం ఎలా ఇవ్వాలో మీకు తెలియకపోతే, దాని గురించి మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్తతో మాట్లాడండి. ఈ రకంగా సాక్ష్యమిస్తున్న ప్రచారకులు మీతో కలిసి పని చేయడానికి ఆయన ఏర్పాటు చేయవచ్చు. జతగా కలిసి పనిచేయడం ద్వారా మీరు పరస్పరం నేర్చుకోవడానికి, సమర్థంగా సాక్ష్యం ఇవ్వడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. టెలిఫోను సాక్ష్యం ఇచ్చేందుకు మంచి సలహాలను ఫిబ్రవరి 2001 మన రాజ్య పరిచర్యలోని 5-6 పేజీల్లో చూడవచ్చు.
9. సంఘంతో కలిసి బహిరంగ పరిచర్యలో భాగం వహించేలా అర్హులయ్యేందుకు మనం బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?
9 కొత్తవారు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా యెహోవాకు తాము చేసే స్తుతిని అధికం చేసేందుకు ఇష్టపడేలా వారు ప్రోత్సాహం పొందవచ్చు. మీరు క్షేత్రసేవలోని ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పడం ద్వారా, బైబిలు బోధలను వివరించేందుకు, తమ విశ్వాసాన్ని సమర్థించుకొనేందుకు వారికి క్రమంగా శిక్షణ ఇవ్వడం ద్వారా నియమిత ప్రకటనా పనిలో భాగం వహించడంలో వారికి ఉన్న ఎలాంటి భయాన్నైనా అధిగమించేందుకు సహాయం చేయవచ్చు. (1 పేతు. 3:15) సువార్త ప్రకటించడం ప్రారంభించాలనే తన కోరికను ఒక బైబిలు విద్యార్థి వ్యక్తం చేసినట్లయితే, సంఘ పైవిచారణకర్తతో మాట్లాడండి. సంఘంతో కలిసి పరిచర్యలో పాల్గొనడానికి అర్హుడో కాదో నిర్ధారించేందుకు ఆయన విద్యార్థితో మాట్లాడడానికి ఏర్పాటు చేస్తాడు. విశ్వసర్వాధిపత్యం గురించిన వివాదంలో తన పక్షాన నిలుస్తున్న కొత్తవారిని చూసి యెహోవా హృదయం ఎంతగా సంతోషిస్తుందో కదా!—సామె. 27:11.
10. (ఎ) సహాయ పయినీరుగా సేవ చేసేందుకు ఒక మంచి సమయ పట్టిక మనకు ఎలా సహాయం చేయగలదు? (బి) గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీరు సహాయ పయినీరుగా సేవ చేయడానికి ఏర్పాట్లు చేసుకోగలిగారా? ఎలా చేసుకోగలిగారు?
10 మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? సహాయ పయినీరుగా చేయవలసిన 50 గంటలను గంభీరంగా పరిగణించాలి. (మత్త. 5:37) దీనర్థం మీరు వారానికి దాదాపు 12 గంటలు క్షేత్ర సేవలో వెచ్చించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. 5వ పేజీలో సూచించబడిన సమయ పట్టికలో ఏదైనా మీ పరిస్థితులకు అనుకూలంగా ఉందా? అలా కుదరకపోతే, మార్చి, ఏప్రిల్ లేక మే నెలల్లో మీరు సహాయ పయినీరు చేసేందుకు మీకు దోహదపడే సమయ పట్టికను మీరు తయారు చేసుకోగలరా? మీ పరిచర్యను విస్తృతపరచుకోవాలనే మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాను కోరండి.—సామె. 16:3.
11. పెద్దలు, పరిచర్య సేవకులు, సహాయ పయినీర్లుగా సేవ చేసేవారికి ఎలా సహకారం అందించవచ్చు?
11 ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో యెహోవాను ప్రత్యేకంగా స్తుతించాలనే మీ ప్రయత్నాలకు పెద్దలు, పరిచర్య సేవకులు పూర్తి సహకారం అందిస్తారు. బహుశా, వారిలో చాలామంది సహాయ పయినీరు సేవ చేస్తారు. పెద్దలు, పరిచర్య కోసం అదనపు క్షేత్రసేవా కూటాలను ఏర్పాటు చేస్తారు, అవసరమైతే మధ్యాహ్నం, వారంలోని సాయంకాలాల్లో లేక వారాంతాల్లో క్షేత్రసేవా కూటాలను ఏర్పాటు చేస్తారు. అలాంటి క్షేత్రసేవా కూటాలను ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేయాలి, నాయకత్వం వహించేది ఎవరు అనేవి నిర్ణయించేందుకు, పయినీరు సేవ చేయాలనే ఖచ్చితమైన ప్రణాళిక ఉన్న వారితో లేక పయినీరు సేవ చేయాలని అనుకుంటున్న వారితో పెద్దలు మాట్లాడవచ్చు. మీరు సేవ చేయాలని ప్రణాళిక వేసుకున్న రోజుల్లో, సమయాల్లో మీతోపాటు ఇతర ప్రచారకులు కలిసి పనిచేసేలా ఏర్పాట్లు చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తారు. ఈ విధంగా, ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని, మంచి ఫలితాలు సాధించవచ్చు.—సామె. 20:18.
12. యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించేందుకు మనల్ని ఏమి ప్రేరేపిస్తుంది?
12 మీకు సాధ్యమైనంత మేరకు చేయండి: సహాయ పయినీరుగా సేవ చేయడానికి మీ పరిస్థితులు మిమ్మల్ని అనుమతించనట్లయితే, ‘శక్తికి మించికాదు గానీ, మన శక్తి అనుమతించినంత మేరకు’ మనం చేసే ప్రయత్నాలను, త్యాగాలను యెహోవా అంగీకరిస్తాడని గుర్తుంచుకోండి. (2 కొరిం. 8:12) మనం యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. దావీదు మంచి కారణంతో ఇలా వ్రాశాడు: “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” (కీర్త. 34:1) ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మన దృఢసంకల్పం కూడా అదే అయి ఉండాలి.
[3వ పేజీలోని బాక్సు]
మీ పరిచర్యను ఎలా విస్తృతపరచుకుంటారు?
◼ ప్రజలు ఇంట్లో ఉండే సమయంలో ప్రకటించండి
◼ బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యమివ్వండి
◼ పని స్థలాల్లో లేక పాఠశాలలో సాక్ష్యమివ్వండి
◼ టెలిఫోను సాక్ష్యమివ్వండి
◼ సహాయ పయినీరుగా సేవ చేయండి
[5వ పేజీలోని చిత్రం]
సహాయ పయినీరు సమయ పట్టిక నమూనా ప్రతీవారం క్షేత్ర సేవలో 12 గంటలు వెచ్చించే సమయ పట్టికను తయారు చేసుకొనే పద్ధతులు
ఉదయాలు—సోమవారం నుండి శనివారం
మరే ఇతర దినానికైనా ఆదివారాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.
దినం సమయం గంటలు
సోమవారం ఉదయం 2
మంగళవారం ఉదయం 2
బుధవారం ఉదయం 2
గురువారం ఉదయం 2
శుక్రవారం ఉదయం 2
శనివారం ఉదయం 2
మొత్తం గంటలు: 12
రెండు పూర్తి రోజులు
వారంలో ఏ రెండు రోజులనైనా ఎన్నుకోవచ్చు
(ఎన్నుకున్న రోజుల ఆధారంగా, ఈ సమయ పట్టికద్వారా నెలలో మొత్తం 48 గంటలు మాత్రమే చేయగలరు.)
దినం సమయం గంటలు
బుధవారం రోజంతా 6
శనివారం రోజంతా 6
మొత్తం గంటలు: 12
రెండు సాయంత్రాలు, వారాంతం
వారంలో ఏ రెండు రోజులనైనా ఎన్నుకోవచ్చు
దినం సమయం గంటలు
సోమవారం సాయంత్రం 1 1/2
బుధవారం సాయంత్రం 1 1/2
శనివారం రోజంతా 6
ఆదివారం సగం రోజు 3
మొత్తం గంటలు: 12
మూడు మధ్యాహ్నాలు, శనివారం
మరే ఇతర దినానికైనా ఆదివారాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.
దినం సమయం గంటలు
సోమవారం మధ్యాహ్నం 2
బుధవారం మధ్యాహ్నం 2
శుక్రవారం మధ్యాహ్నం 2
శనివారం రోజంతా 6
మొత్తం గంటలు: 12
వ్యక్తిగత సేవా సమయ పట్టిక
ప్రతీసారి ఎన్ని గంటలు చేస్తారో నిర్ణయించుకోండి.
దినం సమయం గంటలు
సోమవారం
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం
శనివారం
ఆదివారం
మొత్తం గంటలు: 12