(1) ప్రశ్న, (2) లేఖనం, (3) అధ్యాయం
బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని ప్రతిపాదించే సులభమైన పద్ధతి ఏమిటంటే, (1) అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నను అడగడం, (2) సముచితమైన లేఖనాన్ని చదవడం, (3) ఆ విషయాన్ని చర్చించే అధ్యాయంలోని శీర్షిక క్రింద ఉన్న ఉపోద్ఘాత ప్రశ్నలను చదవడం ద్వారా గృహస్థుని దృష్టిని ఆ అధ్యాయం వైపు మళ్ళించడం. ఆ గృహస్థుడు ఆసక్తి చూపించినట్లయితే, మీరు ఆ అధ్యాయ ప్రారంభంలో ఉన్న పేరాలను ఉపయోగిస్తూ బైబిలు అధ్యయనాన్ని ప్రదర్శించవచ్చు. అధ్యయనం ప్రారంభించడానికి ఈ పద్ధతిని మొదటి సందర్శనంలో లేక పునర్దర్శనం చేస్తున్నప్పుడు ఉపయోగించవచ్చు.
◼ “బైబిల్లో ఇక్కడ తెలియజేయబడినట్లుగా, సర్వశక్తిగల మన సృష్టికర్తను గూర్చి తెలుసుకోవడం మానవమాత్రులకు సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా?” అపొస్తలుల కార్యములు 17:26, 27 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత మొదటి అధ్యాయాన్ని చూపించండి.
◼ “మనం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, ఇక్కడ వివరించబడిన ఓదార్పును, నిరీక్షణను మనం పొందడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా?” రోమీయులు 15:4 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 2వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఈ మార్పులు తీసుకొచ్చే శక్తే మీకుంటే మీరు వాటిని తీసుకువస్తారా?” ప్రకటన 21:4 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 3వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఈ ప్రాచీన కీర్తనలో వర్ణించబడిన పరిస్థితులు మన పిల్లలు ఎప్పటికైనా అనుభవించగలరని మీరు అనుకుంటున్నారా?” కీర్తన 37:10, 11 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 3వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఈ మాటలు నెరవేరే రోజు ఎప్పటికైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా?” యెషయా 33:24 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 3వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “బ్రతికివున్నవారు ఏమి చేస్తున్నారో మృతులకు తెలుసా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రసంగి 9:5 చదివి, 6వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “యేసు ఈ లేఖనాల్లో పేర్కొన్నట్లు, చనిపోయిన ప్రియమైనవారిని మనం ఒకరోజు మళ్ళీ చూడడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా?” యోహాను 5:28, 29 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 7వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఈ ప్రఖ్యాత ప్రార్థనలో పేర్కొన్నట్లుగా దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుచున్నట్లు భూమ్మీద నెరవేరడం ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు?” మత్తయి 6:9, 10 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 8వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఈ ప్రవచనం వర్ణిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నామని మీరు అనుకుంటున్నారా?” 2 తిమోతి 3:1-4 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 9వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “మానవజాతి సమస్యలు విశమిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తున్నాయని చాలామంది ఆలోచిస్తారు. ఈ వచనంలోని వివరణ దానికిగల కారణం కావచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?” ప్రకటన 12:9 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 10వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ఇలాంటి ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా?” యోబు 21:7 చదివి ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 11వ అధ్యాయాన్ని చూపించండి.
◼ “ప్రజలు సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిల్లోని ఈ సలహా అన్వయించుకోవడం సహాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా?” ఎఫెసీయులు 5:33 చదివి, ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 14వ అధ్యాయాన్ని చూపించండి.
అధ్యయన ఏర్పాటును ప్రదర్శించిన తర్వాత రెండుసార్లు అధ్యయనం నిర్వహించబడి, అధ్యయనం కొనసాగుతుందనే నమ్మకం కలిగినట్లయితే ఒక బైబిలు అధ్యయనాన్ని రిపోర్టు చేయవచ్చు.