బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎలా ప్రతిపాదించాలి?
ఈ సంచికలోని మధ్య పేజీల్లో, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించేందుకు వివిధ రకాల సూచనలున్నాయి. మీరు ఆ సూచనలను సమర్థంగా ఉపయోగించేందుకు వాటిని మీ సొంత మాటల్లో చెప్పండి, మీ క్షేత్రంలోని ప్రజలకు అనుగుణంగా మీ ప్రతిపాదనను మలచుకొని చర్చను కొనసాగించేందుకు ఉపయోగించగల పుస్తకంలోని నిర్దిష్ట అంశాలతో సుపరిచితులవండి. మీ క్షేత్రానికి ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు.—మన రాజ్య పరిచర్య, జనవరి 2005, 8వ పేజీ చూడండి.
అంత్యదినాలు
◼ “మనం ఈ లోకపు ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామని చాలామంది నమ్ముతున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు బాగుపడతాయని నమ్మడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? [ప్రతిస్పందించనివ్వండి. 2 పేతురు 3:13 చదవండి.] అంత్యదినాల తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే విషయం మీద ఈ వ్యాఖ్యానం చూడండి.” 94వ పేజీలోని 15వ పేరా చదవండి.
కుటుంబం
◼ “సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని గడపడం మనందరికీ ఇష్టం. ఈ విషయాన్ని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనివ్వండి.] కుటుంబ సంతోషానికి దోహదపడగల ఒకదానిని కుటుంబంలోని ప్రతీ సభ్యుడు చేయాలనే దాని గురించి బైబిలు చెబుతోంది, అదే ప్రేమ చూపించడంలో దేవుణ్ణి అనుకరించడం.” ఎఫెసీయులు 5:1, 2 మరియు 135వ పేజీలోని 4వ పేరా చదవండి.
గృహవసతి
◼ “చాలా ప్రాంతాల్లో, స్తోమతకు తగిన మంచి గృహవసతిని కనుగొనడం చాలా కష్టమవుతోంది. ప్రతీ ఒక్కరికీ సరైన గృహవసతి ఉండే రోజు వస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. యెషయా 65:21, 22 మరియు 34వ పేజీలోని 20వ పేరా చదవండి.] దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుందో ఈ పుస్తకం వివరిస్తోంది.”
నిత్యజీవం
◼ “చాలామంది మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును కోరుకుంటారు. అలాంటి పరిస్థితే సాధ్యమైతే మీరు నిరంతరం జీవించడానికి ఇష్టపడతారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రకటన 21:3, 4; 53-54 పేజీల్లోని 17వ పేరాను చదవండి.] మనం నిత్యజీవాన్ని ఎలా సంపాదించుకోవచ్చు, ఆ వాగ్దానం వాస్తవమైనప్పుడు జీవితం ఎలా ఉంటుంది వంటి అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.”
ప్రార్థన
◼ “దేవుడు ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 1 యోహాను 5:14, 15 మరియు170-2 పేజీల్లోని 16-18 పేరాలు చదవండి.] ఈ అధ్యాయం, మనం దేవునికి ఎందుకు ప్రార్థించాలి, ఆయన మన ప్రార్థనలను ఆలకించాలంటే మనమేమి చేయాలి అనే విషయాలను కూడా వివరిస్తోంది.”
బైబిలు
◼ “ప్రజలు సాధారణంగా బైబిలును దేవుని వాక్యమని పిలుస్తారు. మానవులు వ్రాసిన పుస్తకాన్ని దేవుని వాక్యమని పిలవడం ఎంతవరకు సమంజసమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 2 పేతురు 1:21 మరియు 19-20 పేజీల్లోని 5వ పేరా చదవండి.] ఈ పుస్తకం ఇక్కడున్న ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబులను వివరిస్తుంది.” 6వ పేజీలోని ప్రశ్నలను చూపించండి.
◼ “ఈ రోజుల్లో ప్రజలకు మునుపటికన్నా అధిక సమాచారం అందుబాటులో ఉంది. అయితే, మనం సంతోషకరమైన, విజయవంతమైన జీవితాలను గడిపేందుకు సహాయం చేసే చక్కని సలహా ఎక్కడ లభించవచ్చని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 2 తిమోతి 3:16, 17 మరియు 23వ పేజీలోని 12వ పేరా చదవండి.] మనం దేవుణ్ణి సంతోషపెట్టే విధంగానే కాక, మనం కూడా ప్రయోజనం పొందే విధంగా ఎలా జీవించవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది.” 122-3 పేజీల్లోని పట్టికను, చిత్రాన్ని చూపించండి.
మతం
◼ “చాలామంది ప్రపంచ మతాలను మానవజాతి సమస్యలకు కారణంగానే దృష్టించడం ప్రారంభించారు గానీ ఒక పరిష్కారంగా మాత్రం కాదు. మతం ప్రజలను సరైన దిశలో నడిపిస్తోందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత మత్తయి 7:13, 14 మరియు145-6 పేజీల్లోని 5వ పేరా చదవండి.] ఈ అధ్యాయం, దేవుడు ఆమోదించే ఆరాధనను గుర్తించే ఆరు అంశాలను వివరిస్తోంది.” 147వ పేజీలోని పట్టికను చూపించండి.
మరణం/పునరుత్థానం
◼ “చనిపోయినప్పుడు నిజంగా ఏమి సంభవిస్తుందని చాలామంది ఆలోచిస్తారు. అప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మనకు సాధ్యమేనా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ప్రసంగి 9:5 మరియు58-9 పేజీల్లోని 5-6 పేరాలు చదవండి.] పునరుత్థానానికి సంబంధించిన బైబిలు వాగ్దానం నుండి చనిపోయినవారు ఎలా ప్రయోజనం పొందుతారో కూడా ఈ పుస్తకం వివరిస్తోంది.” 75వ పేజీలోని చిత్రాన్ని చూపించండి.
◼ “మన ప్రియమైనవారు ఎవరైనా చనిపోతే, వారిని మనం మళ్ళీ చూడాలనుకోవడం సహజం. ఈ విషయాన్ని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనివ్వండి.] చాలామంది పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానాన్నిబట్టి ఓదార్పు పొందారు. [యోహాను 5:28, 29 మరియు 72వ పేజీలోని 16-17 పేరాలను చదవండి.] ఇక్కడున్న ప్రశ్నలకు కూడా ఈ అధ్యాయం జవాబిస్తుంది.” 66వ పేజీలోని ఉపోద్ఘాత ప్రశ్నలను చూపించండి.
యుద్ధం/శాంతి
◼ “అన్ని ప్రాంతాలవారూ శాంతిని కోరుకుంటారు. భూమ్మీద శాంతి నెలకొంటుంది అనే నమ్మకం కేవలం ఒక కలని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 46:8, 9 చదవండి.] ఈ పుస్తకం, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి, ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఎలా నెలకొల్పుతాడో వివరిస్తుంది.” 35వ పేజీలోని చిత్రాన్ని చూపించి, 34వ పేజీలోని 17-21 పేరాలను చర్చించండి.
యెహోవా దేవుడు
◼ “దేవుణ్ణి విశ్వసించే చాలామంది ఆయనకు సన్నిహితమవడానికి ఇష్టపడతారు. ఆయనకు సన్నిహితమవమని బైబిలు మనల్ని ఆహ్వానిస్తున్నట్లు మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యాకోబు 4:8ఎ మరియు 16వ పేజీలోని 20వ పేరా చదవండి.] ప్రజలు తమ సొంత బైబిలును ఉపయోగిస్తూ దేవుణ్ణి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేసేందుకు ఈ పుస్తకం తయారుచేయబడింది.” 8వ పేజీలోని ఉపోద్ఘాత ప్రశ్నలను చూపించండి.
◼ “చాలామంది దేవుని నామం పరిశుద్ధపరచబడాలని లేక, పవిత్రపరచబడాలని ప్రార్థిస్తారు. ఆ నామం ఏమిటని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 83:18 మరియు 195వ పేజీలోని 2-3 పేరాలు చదవండి.] యెహోవా దేవుని గురించి, మానవజాతిపట్ల ఆయన సంకల్పం గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో ఈ పుస్తకం వివరిస్తోంది.”
యేసుక్రీస్తు
◼ “భూవ్యాప్తంగా ప్రజలు యేసుక్రీస్తు గురించి విన్నారు. కొందరు ఆయన కేవలం ఒక అసాధారణ వ్యక్తి అనే అంటారు. మరికొందరు ఆయనను సర్వశక్తిగల దేవునిగా ఆరాధిస్తారు. యేసుక్రీస్తు విషయంలో మన నమ్మకాలు అంత ప్రాముఖ్యమని మీరు అనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యోహాను 17:3 మరియు37-8 పేజీల్లోని 3వ పేరా చదవండి. అధ్యాయం శీర్షిక క్రింద ఉన్న ఉపోద్ఘాత ప్రశ్నలవైపు దృష్టిని మళ్ళించండి.
విషాదం/బాధ
◼ “ఒక విషాద సంఘటన సంభవించినప్పుడు, దేవునికి నిజంగా ప్రజలపట్ల శ్రద్ధ ఉందా, ఆయన వారి బాధలను గమనిస్తున్నాడా అనే అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తారు. మీరు ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 1 పేతురు 5:7, 11వ పేజీలోని 11వ పేరాను చదవండి.] దేవుడు మానవజాతి బాధలను పూర్తిగా ఎలా నిర్మూలిస్తాడు అనే విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తోంది.” 106వ పేజీలోని ఉపోద్ఘాత ప్రశ్నలను చూపించండి.
[5వ పేజీలోని బాక్సు]
విరాళ ఏర్పాటు గురించి ప్రస్తావించే పద్ధతులు
“మీరు ఈ రోజు మా ప్రపంచవ్యాప్త పని కోసం కొంత విరాళం ఇవ్వాలనుకున్నట్లయితే, నేను దానిని ఆనందంగా స్వీకరిస్తాను.”
“మా సాహిత్యాలకు చార్జి తీసుకోము, అయితే మా ప్రపంచవ్యాప్త పనికి మీరు ఇవ్వాలనుకున్న విరాళాలను మేము స్వీకరిస్తాం.”
“ఈ పనిని మేమెలా చేయగలుగుతున్నామని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఎలాగంటే, మా ప్రపంచవ్యాప్త పని స్వచ్ఛంద విరాళాల మద్దతుతోనే నిర్వహించబడుతోంది. మీరు ఈ రోజు కొంత విరాళం ఇవ్వాలనుకున్నట్లయితే, నేను దానిని సంతోషంగా స్వీకరిస్తాను.”