క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
యెహోవా మహిమను పొందడానికి అర్హుడు. మనం యెహోవాను ఎలా మహిమపరుస్తాం? కొంతమందికి యెహోవాను మహిమపర్చడం ఎందుకు కష్టమవుతుంది? దేవుణ్ణి మహిమపర్చేవారికి ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను, 2008వ సేవా సంవత్సర ప్రాంతీయ సమావేశ కార్యక్రమం ఇస్తుంది. ప్రాంతీయ సమావేశ కార్యక్రమ ముఖ్యాంశం “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” (1 కొరిం. 10:31) ఆ రెండురోజులు లభించే సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఉపదేశంలో మనకోసం ఏమి వేచివుందో పరిశీలించండి.
జిల్లా పైవిచారణకర్త, “దేవుణ్ణి ఎందుకు మహిమపర్చాలి?,” “దేవుని నియమాలు పాటించడంలో మాదిరికరంగా ఉండండి” అనే అంశాలమీద ప్రసంగమిస్తారు. ఇంకా ఆయన “దేవుణ్ణి మహిమపరిచే ప్రజలు ఎవరు?” అనే బహిరంగ ప్రసంగాన్ని, “ప్రపంచవ్యాప్తంగా ఐకమత్యంతో దేవుణ్ణి మహిమపర్చడం” అనే ముగింపు ప్రసంగాన్ని ఇస్తారు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను కూడా ఆయన నిర్వహిస్తారు. ప్రాంతీయ పైవిచారణకర్త “దేవుని మహిమను ప్రతిబింబించడంలో ఆనందించండి,” “ప్రాంతీయ అవసరాలపట్ల శ్రద్ధ వహించడం,” 2 పేతురు 1:12 పై ఆధారపడిన “‘సత్యమందు స్థిరపరచబడి’ ఉండండి” అనే ప్రసంగాలను ఇస్తారు. వాటితోపాటు, “పయినీరు పరిచర్య దేవుణ్ణి మహిమపరుస్తుంది” అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. “మన జీవిత రంగాలన్నింటిలో దేవుణ్ణి మహిమపర్చడం” అనే ఆలోచనను రేకెత్తించే రెండు గోష్ఠి భాగాల్లో మొదటి గోష్ఠి 1 కొరింథీయులు 10:31 లోని ప్రేరేపిత మాటలకున్న లోతైన భావాన్ని పరిశీలిస్తుంది. “యెహోవాకు స్తుతికలిగేలా పవిత్ర సేవచేయడం” అనే గోష్ఠి మన ఆరాధనకు సంబంధించి వివిధ అంశాలను వివరిస్తుంది. ఆదివారం కావలికోట సారాంశంతోపాటు, దినవచనాన్ని కూడా మనం పరిశీలిస్తాం. బాప్తిస్మం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
అనేకమంది దేవుణ్ణి అంగీకరించేందుకు తిరస్కరిస్తున్నారు. చాలామంది యెహోవా మహిమ గురించి ఆలోచించలేనంతగా మానన పథకాల ద్వారా దారితప్పుతున్నారు. (యోహాను 5:44) అయితే ‘సమస్తమును దేవుని మహిమకొరకు’ ఎలా చేయాలి అనే విషయాన్ని పరిశీలించేందుకు సమయం వెచ్చించడం ప్రయోజనకరమనే నమ్మకం మనకుంది. సమావేశానికి హాజరై, రెండురోజుల కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు ప్రణాళిక వేసుకోండి.