మన ఆధ్యాత్మికతను కాపాడుకునేందుకు సహాయం చేసే ప్రాంతీయ సమావేశం
1. యెహోవా మనకు అప్పగించిన సువార్త ప్రకటనాపనిని నెరవేర్చేందుకు ఆయన చేసిన ఏర్పాట్లలో ఒకటి ఏమిటి?
1 యెహోవా దేవుడు మనకు అప్పగించిన సువార్త ప్రకటనాపనిలో భాగం వహించడానికి కావాల్సిన సమాచారాన్ని, శిక్షణను, ప్రోత్సాహాన్ని ఆయన మనకు మెండుగా దయచేస్తున్నాడు. (మత్త. 24:14; 2 తిమో. 4:17) అలా ఆయన దయచేస్తున్నవాటిలో ప్రతీ సంవత్సరం జరిగే ప్రాంతీయ సమావేశం ఒకటి. 2010 సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశం రోమీయులు 8:5వ వచనం, యూదా 17-19 వచనాల ఆధారంగా, “మీ ఆధ్యాత్మికతను కాపాడుకోండి” అనే అంశంతో రూపొందించబడింది. 2009 నవంబరులో ప్రాంతీయ సమావేశాలు మొదలౌతాయి.
2. (ఎ) ప్రాంతీయ సమావేశం మనకు ఏయే విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది? (బి) గతంలో జరిగిన ప్రాంతీయ సమావేశాలు మీకు పరిచర్యలో ఎలా సహాయం చేశాయి?
2 మనకు లభించే ప్రయోజనం: ఈ ప్రాంతీయ సమావేశ కార్యక్రమం కొన్ని ప్రమాదాల గురించి అంటే మన సమయాన్ని హరించివేసే, ప్రాముఖ్యమైన విషయాల నుండి మన మనస్సుల్ని మళ్లించే వాటిగురించి చర్చిస్తుంది. ఈ సమావేశంలో, విచ్ఛలవిడి స్వభావాన్ని ఎలా నిరోధించవచ్చో నేర్చుకుంటాం, ఆధ్యాత్మిక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుంటాం. ఒత్తిళ్లు పెరుగుతున్నప్పుడు, విశ్వాసానికి పెద్దపెద్ద పరీక్షలు ఎదురైనప్పుడు ఆయా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆధ్యాత్మికతను ఎలా బలపర్చుకోవచ్చో ఆదివారం గోష్ఠి చూపిస్తుంది. ఈ కార్యక్రమం మనం మన హృదయాలను కాపాడుకోవడానికి, ఆధ్యాత్మికతను నిలబెట్టుకోవడానికి, అలా చేసినవారికి వేచివున్న ఆశీర్వాదాలను మనసులో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది.
3. మీ ప్రాంతీయ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, మీ నిర్ణయం ఏమై ఉండాలి?
3 మీ ప్రాంతీయ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలిసిన వెంటనే సమావేశం జరిగే రెండు రోజులూ హాజరై పూర్తి కార్యక్రమానికి శ్రద్ధగా అవధానమిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. శ్రద్ధగలవారి పనులను యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండండి.—సామె. 21:5.
4. రాబోయే ప్రాంతీయ సమావేశంలో మనం ఏమి పొందుతాం?
4 ఈ మంచి బహుమతిని ఇస్తున్నది యెహోవాయే. క్రైస్తవ పరిచారకులుగా ఉండడానికి మనకు కావాల్సినవాటినే నమ్మకమైన దాసుని తరగతి సిద్ధం చేసింది. ‘నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవడానికి’ సహాయం చేసేందుకు యెహోవా ప్రేమతో చేసిన ఏర్పాట్లన్నిటికీ మనం ఆయనకు కృతజ్ఞులం.—హెబ్రీ. 10:23-25; యాకో. 1:17.