క్రైస్తవ పరిచారకుల కోసం ఒక ఏర్పాటు
1. యెహోవా సంస్థ 1938లో ఏ కొత్త ఏర్పాటును మొదలుపెట్టింది, ఎందుకు?
1 యెహోవా సంస్థ 1938లో ఒక కొత్త ఏర్పాటును మొదలుపెట్టింది. కొన్ని సంఘాలు కలిసి జోన్ సమావేశాలకు అంటే ఇప్పుడు ప్రాంతీయ సమావేశాలని పిలువబడుతున్న వాటికి హాజరయ్యే ఏర్పాటు చేసింది. ఎందుకు అలాంటి ఏర్పాటు చేసింది? దానికి, ఇన్ఫార్మెంట్ (మన రాజ్య పరిచర్య) 1939 జనవరి సంచిక ఇలా సమాధానమిచ్చింది: “ఈ సమావేశాలు, తన రాజ్య సేవ జరిగేలా చూడడానికి యెహోవా చేసిన దైవపరిపాలనా వ్యవస్థీకరణలో ఒక భాగం. ఆ సమావేశాల్లో ఇవ్వబడిన ఉపదేశం, తమకు నియమించబడిన పనిని సరిగ్గా చేయడానికి ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం.” ప్రాంతీయ సమావేశాలు, “తమకు నియమించబడిన పనిని” సరిగ్గా చేసేలా ప్రచారకులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతున్నాయి. 1938లో కేవలం 58,000 మంది రాజ్య ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. కానీ ఆ సంఖ్య 2009లో 70,00,000 కన్నా ఎక్కువకు చేరుకుంది. ఈ అభివృద్ధినిబట్టి, ఆ సమావేశాలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయో అది నెరవేరిందని స్పష్టంగా తెలుస్తోంది!
2. రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశంలో ఏయే ప్రసంగాలు ఉంటాయి?
2 రాబోయే ప్రాంతీయ సమావేశ ముఖ్యాంశం: సెప్టెంబరు నుండి జరిగే ప్రాంతీయ సమావేశాల కోసం, ఆ సమావేశం ఇవ్వబోయే ప్రోత్సాహం కోసం మనమెంతో ఎదురుచూస్తున్నాం. “మీరు లోకసంబంధులు కారు” అన్నది దాని ముఖ్యాంశం, ఇది యోహాను 15:19 నుండి తీసుకోబడింది. క్రైస్తవ పరిచారకులకు తప్పకుండా ప్రయోజనకరంగా ఉండే కొన్ని ప్రసంగాలు ఏవి? శనివారం, “పూర్తికాల పరిచర్య మనల్ని ఎలా కాపాడుతుంది?” అనే ప్రసంగం ఇవ్వబడుతుంది. “క్రూరమృగంవల్ల,” “మహావేశ్యవల్ల,” “వర్తకులవల్ల” “కలుషితమవ్వకండి” అనే మూడు భాగాల గోష్ఠి కూడా ఉంటుంది. ఆదివారం, “లోకాన్ని కాదు, యెహోవాను ప్రేమించండి” అనే గోష్ఠి ఉంటుంది. “‘పరదేశులుగా, యాత్రికులుగా’ కొనసాగండి,” “ధైర్యంగా ఉండండి! మీరు లోకాన్ని జయించగలరు” అనే ఇతర ప్రసంగాలు కూడా ఉంటాయి.
3. ప్రాంతీయ సమావేశానికి హాజరై మనమెలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?
3 పరిచర్యలో క్రమంగా పాల్గొనడం మానేసిన ఒక సహోదరి ఇటీవల జరిగిన ప్రాంతీయ సమావేశాల్లో ఒకదానికి హాజరైన తర్వాత, ఆ సమావేశ కార్యక్రమం తను తన పరిస్థితులను పునఃపరిశీలించుకోవడానికీ “సాకులు చెప్పడం మానేసి పరిచర్యకు వెళ్లాలి” అని దృఢంగా తీర్మానించుకోవడానికీ సహాయం చేసిందని రాసింది. రాబోయే సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, లోకాన్ని కాదు గానీ యెహోవాను ప్రేమించడానికి మనందరికీ సహాయం చేస్తుంది. (1 యోహా. 2:15-17) క్రైస్తవ పరిచారకుల కోసం ప్రేమతో చేయబడిన ఈ ఏర్పాటు నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే, సమావేశానికి తప్పక హాజరై, జాగ్రత్తగా వినాలి!