“గృహస్థునికి ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా బ్రోషురైనా ఇవ్వవచ్చు”
మనం ఆయా నెలల్లో మొదటిసారి కలిసినప్పుడే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ సమయంలో, గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు “ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా బ్రోషురైనా ఇవ్వవచ్చు” అని ప్రోత్సహించబడ్డాం. ఎందుకు?
బ్రోషుర్లలో, పాత పత్రికల్లో ప్రజలకు అవసరమైన ఎన్నో అంశాలు ఉంటాయి. వాటిలో ఏదో ఒక అంశం గృహస్థుల హృదయాలను తాకవచ్చు. అందుకే, పరిచర్య బ్యాగు సర్దుకునేటప్పుడు రకరకాల బ్రోషుర్లు, పాత పత్రికలు పెట్టుకోండి. మీ దగ్గర పాత పత్రికలు లేకపోతే పత్రికల కౌంటర్ నుండి తీసుకోవచ్చు. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే బైబిలు బోధిస్తోంది పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే, మీ దగ్గరున్న కొన్ని పత్రికలు లేదా బ్రోషుర్లు చూపించి వాళ్లకు నచ్చినవి తీసుకోమని చెప్పండి. వాళ్ల ఆసక్తిని పెంచడానికి తిరిగివెళ్లే ఏర్పాట్లు చేసుకోండి. కొంతకాలానికి వాళ్లు బైబిలు అధ్యయనాన్ని అంగీకరించవచ్చు.