ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జూలైలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“ఈ కష్టసమయాల్లో, కుటుంబాలపై ఒత్తిడి తీసుకొచ్చే సవాళ్లను మనందరం ఎదుర్కొంటున్నాం. మన కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేసుకొనేందుకు సహాయం చేసే, నమ్మదగిన మార్గనిర్దేశం ఎక్కడ దొరుకుతుందనుకుంటున్నారు?” వాళ్లేమి చెబుతారో వినండి. గృహస్థుడు మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తే కావలికోట జూలై-సెప్టెంబరు ప్రతి ఒకటి చేతికిచ్చి 14, 15 పేజీల్లోని ఏదైనా ఉపశీర్షిక కింద ఉన్న సమాచారాన్ని, అక్కడున్న ఒక లేఖనాన్ని వాళ్ళతో చర్చించండి. ఆ పత్రికను తమ దగ్గర ఉంచుకోమని చెప్పి, మరో ప్రశ్న చర్చించడానికి పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జూలై - సెప్టెంబరు
“ఇటీవలి కాలాల్లో ప్రజలు ‘లోకాంతం’ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అది రాకుండా ఆపడానికి మనుష్యులు ఏమైనా చేయగలరని మీరు అనుకుంటున్నారా? [వాళ్లేమి చెబుతారో వినండి.] లోకాంతానికి సంబంధించి చాలామంది ‘హార్మెగిద్దోను’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఆ పదం ఎక్కడ నుండి వచ్చిందో నేను చూపించనా? [గృహస్థుడు అంగీకరిస్తే ప్రకటన 16:16 చదివి వినిపించండి. ఆ తర్వాత పత్రిక ముఖచిత్రాన్ని చూపించండి.] ‘లోకాంతం’ లేదా హార్మెగిద్దోను అంటే నిజంగా ఏమిటి, అది ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న సమాధానాలు ఈ పత్రికలో ఉన్నాయి.”