ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
కావలికోట అక్టోబరు - డిసెంబరు
“కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటే ఆయన వింటాడని చాలామంది ఒప్పుకుంటారు. కానీ కొంతమంది, ‘దేవుడు ఉంటే లోకంలో ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి?’ అనుకుంటారు. ఇంతకీ దేవుడు మన ప్రార్థనలు వింటాడా? [వాళ్లేమి చెబుతారో వినండి.] మన ప్రార్థనలు వినే వ్యక్తి ఒకరున్నారని తెలియజేసే లేఖనాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థులు ఒప్పుకుంటే, కీర్తన 65:2 చదవండి.] చాలామంది దీన్ని ఒప్పుకుంటారు. ‘ప్రార్థనలు ఆలకించే దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదు?’ అనే ప్రశ్నకు జవాబును ఈ పత్రిక చర్చిస్తుంది.”