ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
ఏప్రిల్లో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“లోకంలోని చెడంతటికీ అపవాదే కారణమని చాలామంది అనుకుంటారు. ‘అపవాది ఎక్కడ నుండి వచ్చాడు? దేవుడే అతడిని సృష్టించాడా?’ అని వాళ్లు ఆలోచిస్తుంటారు. మరి మీరేమనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] దీనికి సంబంధించిన సమాచారమున్న పత్రిక నా దగ్గరుంది. దాన్ని మీకు చూపించవచ్చా?” వాళ్లు ఒప్పుకుంటే, ఏప్రిల్ - జూన్ కావలికోట సంచికలోని చివరి పేజీలో ఉన్న ఆర్టికల్ చూపించి, దానిలోని మొదటి పేరాను, అక్కడ ఇచ్చిన లేఖనాలను పరిశీలించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోండి.
కావలికోట ఏప్రిల్ - జూన్
“కుటుంబంలో వైకల్యమున్న పిల్లవాడుంటే, తల్లిదండ్రులకు ప్రత్యేకమైన సవాళ్లు ఎదురౌతాయి. అలాంటి పరిస్థితిని కుటుంబ సభ్యులు ఎలా తట్టుకోవచ్చంటారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే ఒక లేఖనాన్ని మీకు చూపించమంటారా? [వాళ్లు ఒప్పుకుంటే, ప్రకటన 21:3, 4 చదవండి. తర్వాత 10వ పేజీలోని ఆర్టికల్ చూపిస్తూ] ఆ వచనాలు, భవిష్యత్తులో జరగబోయే మంచి గురించి చెబుతున్నాయి. అయితే, ఈ రోజుల్లో అలాంటి పిల్లల్ని చక్కగా పెంచడానికి ఉపయోగపడే సలహాలు ఇందులో ఉన్నాయి.”