ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
ఏప్రిల్‌లో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“జీవితాన్ని సంతోషంగా గడపాలని, దానికొక అర్థం ఉండాలని అందరం కోరుకుంటాం. దేవుణ్ణి సరైన విధంగా ఆరాధించడం సంతోషాన్నిస్తుందని మీరు అంగీకరిస్తారా? [వాళ్లేమి చెప్తారో వినండి. గృహస్థులు ఒప్పుకుంటే, యాకోబు 4:8 చదవండి.] మన ఆరాధన గురించి దేవుడు ఎలా భావిస్తాడో ఈ పత్రిక వివరిస్తుంది.” గృహస్థులు ఆసక్తి చూపిస్తే, కావలికోట ఏప్రిల్ - జూన్ సంచికను ఇచ్చి, 16వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని, అక్కడ ‘చదవండి’ అని ఉన్న లేఖనాల్లో కనీసం ఒకదాన్ని చదివి చర్చించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట ఏప్రిల్ - జూన్
“సెక్స్ విషయంలో ప్రజల అభిప్రాయం రోజురోజుకీ మారుతోంది. బైబిల్లోని నైతిక ప్రమాణాలు చాలా కఠినమైనవని, ఇప్పటి తరానికి పనికి రావని మీకనిపిస్తుందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] బైబిల్లోని నైతిక ప్రమాణాలు స్పష్టంగా ఉన్నాయి, వాటిని ఎవరు పెట్టారో లేఖనాల నుండి మీకు చూపించాలనుకుంటున్నాను. [గృహస్థులు ఆసక్తి చూపిస్తే, 2 తిమోతి 3:16, 17 చదివి, 20వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.] సెక్స్‌కి సంబంధించి సాధారణంగా వచ్చే పది ప్రశ్నలకు బైబిలు ఏమి జవాబిస్తుందో ఇందులో ఉంది. బైబిలు ప్రమాణాలు మనకెలా ప్రయోజనకరమో కూడా వివరిస్తుంది.”