పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సంభాషణను ఆటంకపర్చేవాళ్లతో ఎలా మాట్లాడాలి?
ఎందుకు ప్రాముఖ్యం? మీ ప్రాంతంలో ప్రకృతి విపత్తు విరుచుకుపడనుందని మీకు తెలిసిందనుకోండి. అక్కడినుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తే తప్ప తప్పించుకోవడం అసాధ్యం. దాని గురించి పొరుగువాళ్లను అప్రమత్తం చేయాలని మీరు ఒకరి ఇంటికి వెళ్లారు. కానీ ఇంటాయనేమో బిజీగా ఉన్నానంటూ మిమ్మల్ని వెళ్లిపొమ్మన్నాడు. మీరు వెంటనే అక్కడినుండి వెళ్లిపోతారా? లేదు. పరిచర్యలో కూడా, మన సందేశం ప్రాణాలను రక్షిస్తుందని గుర్తించక చాలామంది మనం చెప్పేది వినరు. బహుశా, ఆ సమయంలో వాళ్లు ఏదో పనిలో మునిగిపోయి ఉండవచ్చు. (మత్త. 24:37-39) లేదా అబద్ధ ప్రచారాల వల్ల మన గురించి వాళ్లలో తప్పుడు అభిప్రాయం ఏర్పడివుండవచ్చు. (మత్త. 11:18, 19) మనం కూడా, భక్తి ఉందని చెప్పుకుంటూ చెడు పనులు చేసే ఇతర మతస్థుల్లాంటి వాళ్లమేనని వాళ్లు అనుకుంటుండవచ్చు. (2 పేతు. 2:1, 2) కాబట్టి, ఇంటివాళ్లు ఆసక్తి చూపించకపోయినా సరే వాళ్లు మనల్ని వ్యతిరేకించడం లేదని అనిపిస్తే మనం తొందరపడి అక్కడినుండి వెళ్లిపోకూడదు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
ఎవరైనా మీ సంభాషణను ఆటంకపరిస్తే, ఆ ఇంటినుండి బయటకు వచ్చాక, మీరు ఎలా మాట్లాడివుంటే ఇంకా బావుండేదో మీతోవున్న ప్రచారకునితో చర్చించండి.