మంచివార్త బ్రోషుర్ ఉపయోగించి బోధించండి
1. మంచివార్త బ్రోషుర్ ఎలా తయారుచేశారు?
1 జూలై నెల మన రాజ్య పరిచర్యలో మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లలో దేవుడు చెబుతున్న మంచివార్త! ఒకటని చూశాం. ఈ బ్రోషుర్లో లేఖనాల్లో ఉన్న సమాచారాన్ని పేరాల్లో ఇవ్వలేదు కాబట్టి, ఇంటివాళ్లు నేరుగా బైబిలు తెరిచి వాటిని చదవవచ్చు. మన ప్రచురణలు సాధారణంగా, చదివేవాళ్లు తమ సొంతగా నేర్చుకునేలా తయారుచేస్తాం. అయితే ఈ బ్రోషుర్ మాత్రం ఒకరు నేర్పిస్తుండగా నేర్చుకునేలా తయారుచేశాం. కాబట్టి మనం ఈ బ్రోషుర్ ఇచ్చినప్పుడు అధ్యయనం ఎలా చేస్తామో చూపించాలి. అప్పుడు ఇంటివాళ్లు మంచివార్తను బైబిలు నుండి నేర్చుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకోగలుగుతారు.—మత్తయి 13:44.
2. ఇంటివాళ్లను మొదటిసారి కలిసినప్పుడు మంచివార్త బ్రోషుర్ ఎలా ఉపయోగించవచ్చు?
2 మొదటిసారి కలిసినప్పుడు: ఇలా చెప్పవచ్చు: “ఈ లోకం ఎటు వెళ్లిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. దాని గురించి మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. పరిస్థితులు బాగవుతాయని మీకనిపిస్తుందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] భవిష్యత్తు మీద ఆశను చిగురింపచేసే మంచివార్త సృష్టికర్త నుండే రావాలి. నమ్మదగిన జవాబులు ఉన్న కొన్ని ప్రశ్నలను మీరు ఇక్కడ చూడవచ్చు.” ఇంటివాళ్లకు బ్రోషుర్ ఇచ్చి, చివరి పేజీలో ఉన్న ప్రశ్నల్లో దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పమనండి. తర్వాత ఆ పాఠంలోని మొదటి పేరా చర్చిస్తూ అధ్యయనం ఎలా చేస్తామో చూపించండి. లేదంటే, మీరు చర్చించాలనుకుంటున్న పాఠం నుండి ఆసక్తి రేకెత్తించే ఒక ప్రశ్న అడగండి. తర్వాత, ఆ ప్రశ్నకు జవాబు దేవుని మాటల్లో తెలుసుకోవడానికి అధ్యయనం ఎలా చేస్తామో చూపించండి. ఆ పాఠానికి సంబంధించిన వీడియో ఉంటే కొంతమంది ప్రచారకులు అప్పుడే దాన్ని చూపిస్తారు.
3. మంచివార్త బ్రోషుర్ ఉపయోగించి ఎలా అధ్యయనం చేయవచ్చో వివరించండి.
3 అధ్యయనం ఎలా చేయాలి: (1) ప్రశ్నలు ముద్దక్షరాల్లో ఉంటాయి. వాటికి నెంబర్లు కూడా ఉంటాయి. ముఖ్యాంశం మీదే దృష్టిపెట్టేలా ముందుగా ఆ ప్రశ్నలు చదవండి. (2) తర్వాత ఆ ప్రశ్న కింద ఉన్న పేరా చదవండి. (3) ఏటవాలు ముద్దక్షరాల్లో ఉన్న వచనాలు చదవండి. తర్వాత ముందు చదివిన ప్రశ్నకు ఆ వచనాల్లో ఉన్న జవాబును అర్థం చేసుకోవడానికి సహాయం చేసేలా వివేచనతో చిన్నచిన్న ప్రశ్నలు అడగండి. (4) ప్రశ్న కింద ఇంకో పేరా కూడా ఉంటే ఇక్కడిచ్చిన 2, 3 సలహాలను మళ్లీ పాటించండి. ప్రశ్నకు సంబంధించిన వీడియో ఉంటే, మీరు ఇప్పటివరకు ఇంటివాళ్లకు అది చూపించకపోతే, మాటల మధ్యలో ఎప్పుడైనా చూపించండి. (5) చివరిగా, ఇంటివాళ్లకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మొదట మనం చదివిన ప్రశ్నకు జవాబు చెప్పమనండి.
4. ఈ బ్రోషుర్ను మంచి నైపుణ్యంతో ఉపయోగించాలంటే ఏమి చేయాలి?
4 ఎంతో విలువైన ఈ బ్రోషుర్లో ఉన్న సమాచారం పూర్తిగా తెలుసుకోండి. వీలైన ప్రతీచోట దీనిని ఉపయోగించండి. ప్రతీ అధ్యయనానికి వెళ్లేముందు విద్యార్థి గురించి ఆలోచించండి. పాఠంలోని వచనాల్ని విద్యార్థితో ఎలా చర్చించాలో ఆలోచించండి. (సామె. 15:28; అపొ. 17:2, 3) అనుభవం, నైపుణ్యం సంపాదిస్తే ప్రజలకు సత్యాన్ని బోధించడంలో ఈ బ్రోషుర్ మీ అభిమాన ప్రచురణ అవుతుంది!