చక్కగా సువార్త ప్రకటిద్దాం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మీరు ఎలా ఇస్తారో రాయండి
ఎందుకు ప్రాముఖ్యం? మీటింగ్ వర్క్బుక్లో “ఇలా చెప్పవచ్చు” అనే భాగంలో చక్కని సలహాలు ఉన్నప్పటికీ అవి అలానే చెప్పాలని కాదు. మీరు వాటిని సొంత మాటల్లో చెప్పాలి. మీకు నచ్చిన విధంగా కూడా చెప్పవచ్చు, మీ ప్రాంతంలో వేరే అంశం బాగా ఉపయోగపడుతుందని అనిపిస్తే అలా కూడా చెప్పవచ్చు. మీరు కరపత్రాన్ని చదివిన తర్వాత, “ఇలా చెప్పవచ్చు” అనే భాగాన్ని పూర్తిగా పరిశీలించి, వీడియో ప్రదర్శనలు చూశాక ఆ విషయాలను ఉపయోగించుకుంటూ మీరు సొంతగా ఎలా ఇస్తారో రాసుకోండి. ఇంటివాళ్లకు అసక్తి ఉందని మీకు ఖచ్చితంగా అనిపిస్తేనే, వచనం చదివండి లేదా మన సాహిత్యాన్ని ఇవ్వండి.—km 2/08 10.
ఎలా చేయాలి?
ఇలా ఆలోచించుకోండి, ‘“ఇలా చెప్పవచ్చు” అనే భాగాన్ని నేను ఉపయోగిస్తానా?’
అవును
- ఎలా మొదలుపెట్టాలో చక్కగా సిద్ధపడండి. వాళ్లను పలకరించిన తర్వాత, సూటిగా వచ్చిన విషయం చెప్పండి. (ఉదాహరణ: “నేను ఎందుకు వచ్చానంటే . . .”) 
- ప్రశ్న, వచనం, ఇలా ఇవ్వవచ్చు అనే మూడు విషయాలను ఉపయోగిస్తూ మీరెలా చెప్తారో ఆలోచించండి. (ఉదాహరణ: వచనం చూపించే ముందు, మీరు ఇలా అనవచ్చు: “ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉంది.”) 
కాదు
- మీకు బాగా నచ్చిన, మీ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుందని అనిపించిన మాటల్ని కరపత్రం నుండి తీసుకోండి 
- ఇంటివాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకుని వాళ్లను ఇబ్బంది పెట్టకుండా చక్కగా మాట్లాడడానికి వీలయ్యేలా ఏ ప్రశ్నలు అడగాలో సిద్ధపడండి. (ఉదాహరణ: కరపత్రం మీదున్న ప్రశ్నను ఉపయోగించండి.) 
- ఏ వచనం చదవాలో నిర్ణయించుకోండి. 
- ఆ కరపత్రం చదివితే వాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారో ఒకట్రెండు వాక్యాల్లో చెప్పండి 
వాళ్లు అవునన్న కాదన్న
- మళ్లీ కలవడానికి వీలుగా ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో ముందే ఆలోచించండి 
- ఏమి చెప్పాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోవడానికి నోట్సు రాసుకోండి