కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 7
  • యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘పెద్దల్ని పిలవండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • సహోదరులారా—మీకు సంఘ పెద్ద అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు

అధికారంలో ఉన్నవాళ్లను చాలామంది నమ్మరు. ఎందుకో మనందరికీ తెలుసు, చరిత్రంతటిలో చాలామంది తమ అధికారాన్ని స్వార్థం కోసమే ఉపయోగించారు. (మీకా 7:3) కానీ యెహోవా ప్రజలకు మంచి చేసేలా తమ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో సంఘపెద్దలు శిక్షణ పొందారు. అలాంటి సంఘపెద్దలు ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!—ఎస్తే 10:3; మత్త 20:25, 26.

సంఘపెద్దలు, లోకంలో ఉన్న అధికారులకు పూర్తి వేరుగా ఉన్నారు. వాళ్లు యెహోవా మీద, ఆయన ప్రజల మీద ప్రేమతోనే పర్యవేక్షకులుగా సేవచేస్తారు. (యోహా 21:16; 1పే 5:1-3) పెద్దలు యేసు నిర్దేశం కింద, ప్రతీ ప్రచారకుడు యెహోవా కుటుంబంలో ఒకరని అనుకునేలా, యెహోవాకు దగ్గరగా ఉండేలా సహాయం చేస్తారు. దేవుని మందను లేఖనాలతో ప్రోత్సహించడానికి, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి లేదా విపత్తులు వచ్చినప్పుడు వాళ్లు సహాయం చేయడానికి వెంటనే ముందుకొస్తారు. మీకు సహాయం అవసరమైనప్పుడు, మీ సంఘంలో ఉన్న ఏ పెద్దతోనైనా మాట్లాడడానికి వెనకాడకండి.—యాకో 5:14.

“మందను శ్రద్ధగా చూసుకునే కాపరులు” వీడియోలోని ఒక సన్నివేశం. సంఘపెద్దలు ఎలియాస్‌ని పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్లలో ఒక పెద్ద ఏలియాస్‌ని కౌగిలించుకుంటున్నాడు.

మందను శ్రద్ధగా చూసుకునే కాపరులు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • పెద్దలు ఇచ్చిన సహాయం నుండి మారియానా ఎలా ప్రయోజనం పొందింది?

  • పెద్దలు ఇచ్చిన సహాయం నుండి ఎలియాస్‌ ఎలా ప్రయోజనం పొందాడు?

  • ఈ వీడియో చూసిన తర్వాత, సంఘపెద్దలు చేసే పని గురించి మీకేం అనిపిస్తుంది?

ఈ సందర్భాల్లో ఒక సంఘపెద్దతో మాట్లాడడానికి వెనకాడకండి . . .

  • మీ అడ్రస్‌ లేదా ఫోన్‌ నెంబరు మారినప్పుడు

  • మీకేదైనా కష్టం వచ్చినప్పుడు

  • మీరు కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండనప్పుడు

  • మీకేదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు

  • మీరేదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి