కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp22 No. 1 పేజీలు 10-11
  • 3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సలహా:
  • దానర్థం:
  • మనం ఏం చేయవచ్చు?
  • ‘స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • స్తెఫను రాళ్లతో కొట్టబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
wp22 No. 1 పేజీలు 10-11
ఒకతను వేరే జాతి వ్యక్తి చేతిని పట్టుకుని పలకరిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు. కానీ నిరసన తెలిపే చార్టుల్ని పట్టుకుని ఒకరికొకరు వ్యతిరేకంగా గొడవపడుతున్నట్టు వాళ్ల నీడలు చూపిస్తున్నాయి.

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి

బైబిలు సలహా:

“మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.”—రోమీయులు 12:2.

దానర్థం:

మన ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తాడు, వాటిని పట్టించుకుంటాడు. (యిర్మీయా 17:10) ద్వేషాన్ని మాటల్లో, చేతల్లో చూపించకుండా ఉంటే సరిపోదు; మన ఆలోచనల్లో కూడా దానికి చోటివ్వకూడదు. సాధారణంగా ద్వేషానికి బీజం మనసులో, హృదయంలో పడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు గానీ, ఫీలింగ్స్‌ గానీ వస్తుంటే వెంటనే వాటిని వేళ్లతో సహా తీసేసుకోవాలి. అప్పుడే మన వ్యక్తిత్వాన్ని “పూర్తిగా మార్చుకోగలుగుతాం,” ద్వేషమనే విషచక్రం నుండి బయటపడతాం.

మనం ఏం చేయవచ్చు?

ఇతరుల మీద, ముఖ్యంగా వేరే దేశం వాళ్లమీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉందో నిజాయితీగా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు మనం ఇలా ఆలోచించవచ్చు: ‘వాళ్లు ఎలాంటివాళ్లని నేను అనుకుంటున్నాను? వాళ్లగురించి నాకు తెలిసిన దాన్నిబట్టే నేనలా అనుకుంటున్నానా? లేదా వాళ్లు ఆ దేశం వాళ్లు కాబట్టి అలాంటి వాళ్లే అయ్యుంటారని అనుకుంటున్నానా? సోషల్‌ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు, ఆర్టికల్స్‌ అలాగే కొన్ని సినిమాలు ద్వేషాన్ని, హింసను నూరిపోస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

మనసులో, హృదయంలో పాతుకుపోయిన ద్వేషాన్ని తీసేసుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది

మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడం అంత సులభం కాదు. కానీ మన “హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని” పరిశీలించుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 4:12) అందుకే బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవాలి. మన ఆలోచనలు బైబిలు చెప్తున్న వాటికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే వాటిని సరిచేసుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి. మనసులో, హృదయంలో ‘బలమైన కోటలా’ పాతుకుపోయిన ద్వేషాన్ని తీసేసుకోవడానికి సైతం దేవుని వాక్యం సహాయం చేస్తుంది.—2 కొరింథీయులు 10:4, 5.

నిజ జీవిత అనుభవం—స్టీఫెన్‌

తన ఆలోచనా తీరును మార్చుకున్నాడు

స్టీఫెన్‌.

తెల్ల జాతివాళ్లతో ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల స్టీఫెన్‌కు వాళ్లమీద ద్వేషం ఏర్పడింది. అందుకే అతను ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక రాజకీయ గుంపుతో చేతులు కలిపాడు. కొంతకాలానికి తెల్ల జాతీయుల మీద దాడులకు కూడా పాల్పడ్డాడు. ఇంకా ఏం చేశాడో చెప్తూ స్టీఫెన్‌ ఇలా అన్నాడు: “ఒకప్పుడు అమెరికావాళ్లు ఆఫ్రికా ప్రజల్ని బానిసలుగా చేసుకుని ఎన్ని చిత్రహింసలు పెట్టారో చూపిస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిని చూడ్డానికి నేను, నా స్నేహితులు థియేటర్‌కు వెళ్లాం. ఆ అన్యాయాన్ని చూసి కోపంతో ఊగిపోయాం. దాంతో ఆ థియేటర్‌కు వచ్చిన తెల్లజాతి యౌవనుల్ని పట్టుకొని చితకబాదాం. అక్కడితో ఆగకుండా, చుట్టుపక్కల ఇంకెవరైనా తెల్లవాళ్లు కనిపిస్తే కొడదామని వెతుక్కుంటూ వెళ్లాం.”

యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాక స్టీఫెన్‌ ఆలోచనా తీరు పూర్తిగా మారిపోయింది. స్టీఫెన్‌కు ఏమనిపించిందో ఇలా వివరించాడు: “జాతి విభేదాలు చూస్తూ పెరిగిన నేను, యెహోవాసాక్షుల మధ్య ఉండే ఐక్యతను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారైతే, ఓ తెల్లజాతి యెహోవాసాక్షుల కుటుంబం వేరే ఊరికి వెళ్తూ తమ పిల్లల్ని ఒక నల్లజాతి కుటుంబం దగ్గర వదిలేసి వెళ్లింది. మరొక తెల్లజాతి కుటుంబం నల్ల జాతీయుడైన ఒక యువకునికి తమ ఇంట్లో చోటు ఇచ్చింది.” యెహోవాసాక్షులు ఒక కుటుంబంలా ప్రేమగా ఉండడం స్టీఫెన్‌ చూశాడు. తన అనుచరుల మధ్య నిజమైన ప్రేమ ఉంటుందని యేసు చెప్పిన మాట వీళ్ల విషయంలో నెరవేరడం స్టీఫెన్‌ గుర్తించాడు.—యోహాను 13:35.

గొడవలకు, పగ-ప్రతీకారాలకు దూరంగా ఉండడానికి స్టీఫెన్‌కు ఏం సహాయం చేశాయి? రోమీయులు 12:2⁠లో ఉన్న మాటలు అతనికి సహాయం చేశాయి. దానిగురించి ఇలా చెప్పాడు: “నా ఆలోచనా తీరును మార్చుకోవాలని అర్థంచేసుకున్నాను. గొడవలకు వెళ్లడం ఆపేశాను. ప్రశాంతంగా ఉండడం కన్నా మంచి పని ఇంకొకటి లేదని తెలుసుకున్నాను.” 40 కన్నా ఎక్కువ ఏళ్లుగా స్టీఫెన్‌ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

స్టీఫెన్‌ జీవితం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, 2015 జూలై 1, కావలికోట పత్రికలోని 10-11 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి