కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఏప్రిల్‌ పేజీలు 2-7
  • “మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు యెహోవా సేవను ఎందుకు ఎంచుకున్నాడు?
  • మన ఆరాధనకు యెహోవా ఎందుకు అర్హుడు
  • మనం యెహోవా సేవను ఎందుకు ఎంచుకున్నాం?
  • యెహోవా సేవ చేస్తూ ఉండండి
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఏప్రిల్‌ పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 14

పాట 8 యెహోవా మనకు ఆశ్రయం

“మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి”

“నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం.”—యెహో. 24:15.

ముఖ్యాంశం

యెహోవాకు సేవచేయాలని ఎందుకు ఎంచుకున్నామో కారణాల్ని గుర్తుచేసుకుంటాం.

1. నిజమైన సంతోషం కావాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు? (యెషయా 48:17, 18)

మన పరలోక తండ్రికి మనమంటే ప్రాణం. మనం ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (ప్రసం. 3:12, 13) ఆయన మనల్ని అసాధారణమైన సామర్థ్యాలతో సృష్టించాడు. కానీ మనల్ని మనం పరిపాలించుకునే సామర్థ్యం, తప్పొప్పుల విషయంలో సొంత ప్రమాణాలు పెట్టుకునే సామర్థ్యం మాత్రం ఇవ్వలేదు. (ప్రసం. 8:9; యిర్మీ. 10:23) మనం తనకు సేవచేస్తూ, తన మాట వింటే నిజమైన సంతోషాన్ని ఇస్తానని యెహోవా చెప్తున్నాడు.—యెషయా 48:17, 18 చదవండి.

2. మనం ఏం నమ్మేలా సాతాను మభ్యపెడుతున్నాడు? ఆ అబద్ధానికి యెహోవా ఎలా స్పందించాడు?

2 యెహోవా లేకున్నా మనం సంతోషంగా ఉంటామని, మనల్ని మనం పరిపాలించుకున్నా ఏ డోకా ఉండదని నమ్మేలా సాతాను మభ్యపెడుతున్నాడు. (ఆది. 3:4, 5) మరి, ఆ అబద్ధానికి యెహోవా ఎలా స్పందించాడు? తిరుగుబాటు చేసినవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పరిపాలించుకునేలా కొంతకాలం అనుమతించాడు. ఆ పరిపాలన ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు, యెహోవా సేవచేస్తూ తమ జీవితాన్ని సంతోషంగా, సంతృప్తిగా సాగించిన ఎంతోమంది ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాళ్లలో మొదటి వరుసలో ఉండేది, యేసుక్రీస్తే. ముందుగా, యెహోవా సేవను ఆయన ఎంచుకోవడానికి గల కారణాల్ని చూద్దాం. తర్వాత, మన పరలోక తండ్రి మన ఆరాధనకు ఎందుకు అర్హుడో చూద్దాం. చివరిగా, మనం యెహోవా సేవను ఎంచుకోవడానికి గల కొన్ని కారణాల్ని చూస్తాం.

యేసు యెహోవా సేవను ఎందుకు ఎంచుకున్నాడు?

3. యేసుకు ఏ అవకాశం వచ్చింది? కానీ ఆయన ఏ ఎంపిక చేసుకున్నాడు?

3 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఎవర్ని సేవించాలా అని ఒక ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఆయన బాప్తిస్మం తీసుకున్న కొంత సమయానికే సాతాను భూమ్మీదున్న రాజ్యాల్ని చూపించి, తనను ఒక్కసారి ఆరాధిస్తే వాటన్నిటినీ ఇస్తానని చెప్పాడు. దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “సాతానా, వెళ్లిపో! ‘నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.” (మత్త. 4:8-10) యేసు ఎందుకు ఆ ఎంపిక చేసుకున్నాడు? కొన్ని కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

4-5. యేసు యెహోవా సేవను ఎంపిక చేసుకోవడానికి కొన్ని కారణాలు ఏంటి?

4 యేసు యెహోవా సేవను ఎంపిక చేసుకోవడానికి ముఖ్యమైన కారణం, ప్రేమే! యేసుకు యెహోవా అంటే చెప్పలేనంత ప్రేమ. ఆయనకు, ఆయన తండ్రికి విడదీయలేని బంధం ఉంది. (యోహా. 14:31) పైగా, యెహోవా సేవ చేయడమే సరైనది కాబట్టి యేసు ఆ ఎంపిక చేసుకున్నాడు. (యోహా. 8:28, 29; ప్రక. 4:11) యెహోవా జీవానికి మూలమని, నమ్మదగినవాడని, ఏది ఇచ్చినా ధారళంగా ఇచ్చే దేవుడని యేసుకు తెలుసు. (కీర్త. 33:4; 36:9; యాకో. 1:17) యెహోవా యేసుతో ఎప్పుడూ నిజమే మాట్లాడాడు. అంతేకాదు, యేసు దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే కదా! (యోహా. 1:14) అయితే, సాతాను యెహోవాలా కాదు. అతను చావుకు మూలం. అబద్ధానికి, స్వార్థానికి, అత్యాశకు నిలువెత్తు రూపం. (యోహా. 8:44) యేసుకు ఈ నిజాలన్నీ తెలుసు కాబట్టి యెహోవాకు ఎదురుతిరిగి, సాతాను బాటలో నడవాలనే ఆలోచనను తన కలలో కూడా రానివ్వలేదు.—ఫిలి. 2:5-8.

5 యేసు యెహోవా సేవను ఎంచుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, నమ్మకంగా సేవచేస్తే వచ్చే మంచి ఫలితాల గురించి ఆయన ఆలోచించాడు. (హెబ్రీ. 12:2) ఒకవేళ ఆయన నమ్మకంగా ఉంటే తన తండ్రి పేరు పవిత్రపర్చబడుతుంది. అంతేకాదు, సాతాను తెచ్చిన తలనొప్పులన్నిటికీ ఒక చక్కని పరిష్కారం దొరుకుతుంది.

మన ఆరాధనకు యెహోవా ఎందుకు అర్హుడు

6-7. ఈరోజుల్లో చాలామంది ఎందుకు యెహోవాను ఆరాధించట్లేదు? కానీ ఆయనకు ఏ హక్కు ఉంది?

6 ఈ లోకంలో ప్రస్తుతం చాలామంది యెహోవాను ఆరాధించట్లేదు. ఎందుకంటే, ఆయనకున్న గొప్పగొప్ప లక్షణాలు వాళ్లకు తెలీదు. అసలు వాళ్లకోసం ఆయన ఏం చేశాడో వాళ్లకు బొత్తిగా అవగాహన లేదు. అపొస్తలుడైన పౌలు ప్రకటించిన ఏథెన్సులోని వాళ్ల పరిస్థితి కూడా అదే.—అపొ. 17:19, 20, 30, 34.

7 పౌలు వాళ్లకు ఇలా వివరించాడు: నిజమైన దేవుడు ‘అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు. ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.’ అంతేకాదు, “ఆయన ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని” తయారుచేసిన సృష్టికర్త. కాబట్టి మన ఆరాధనను పొందే హక్కు ఆయనకు ఉంది.—అపొ. 17:25, 26, 28.

8. యెహోవా ఏం చేయడో వివరించండి.

8 ఒక సృష్టికర్తగా, ఈ విశ్వానికి అధిపతిగా యెహోవా కావాలనుకుంటే తనను ఆరాధించమని ప్రజల్ని బలవంతపెట్టవచ్చు. కానీ యెహోవా అస్సలు అలా చేయడు. దానికి బదులు ఆయన ఉన్నాడని, మనలో ప్రతీఒక్కర్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని చూపించే రుజువుల్ని ఆయన ఇస్తాడు. వీలైనంత ఎక్కువమంది తనకు ఎప్పటికీ స్నేహితులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:3, 4) అందుకోసమే, తన గురించి, తన ఉద్దేశాల గురించి, మనుషులకు ఆయన చేయబోయే మంచి గురించి మనం వేరేవాళ్లకు చెప్పేలా శిక్షణ ఇస్తున్నాడు. (మత్త. 10:11-13; 28:19, 20) మనందర్నీ సంఘాలుగా ఏర్పాటు చేసి, మనల్ని పట్టించుకునే సంఘపెద్దల్ని ఆయన ఏర్పాటు చేశాడు.—అపొ. 20:28.

9. యెహోవా మనుషులందర్నీ ప్రేమిస్తున్నాడని రుజువేంటి?

9 తను ఉన్నాడనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగే వాళ్లమీద కూడా యెహోవా ప్రేమ చూపిస్తున్నాడని ఎన్నో రుజువులు ఉన్నాయి. ఉదాహరణకు వీటి గురించి ఆలోచించండి: మనిషి పుట్టినప్పటి నుండి కొన్ని కోట్లమంది తప్పొప్పుల విషయంలో తమకు నచ్చినట్టు బ్రతికారు. అయినాసరే, యెహోవా వాళ్లను ప్రేమతో బ్రతకనిచ్చాడు, ఆ జీవితాన్ని ఆనందించేలా అనుమతించాడు. (మత్త. 5:44, 45; అపొ. 14:16, 17) వాళ్లకు ఫ్రెండ్స్‌ని, కుటుంబాన్ని, పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాలు చేసుకుంటూ సుఖసంతోషాలతో బ్రతికేలా అనుమతించాడు. (కీర్త. 127:3; ప్రసం. 2:24) వీటన్నిటినిబట్టి, మన పరలోక తండ్రి మనుషులందర్నీ ప్రేమిస్తున్నాడని తేటతెల్లమౌతుంది. (నిర్గ. 34:6) అయితే, మనం ఎందుకు యెహోవా సేవ చేయాలని ఎంపిక చేసుకున్నామో కొన్ని కారణాల్ని గుర్తుచేసుకుందాం. దానివల్ల యెహోవా మనల్ని ఎలా దీవిస్తున్నాడో కూడా చూద్దాం.

మనం యెహోవా సేవను ఎందుకు ఎంచుకున్నాం?

10. (ఎ) మనం యెహోవా సేవ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? (మత్త. 22:37) (బి) మీ విషయంలో ఆయన ఎప్పుడైనా ఓర్పు చూపించాడా? (కీర్త. 103:13, 14)

10 యేసులాగే మనం యెహోవా సేవ చేస్తాం. దానికి ముఖ్యమైన కారణం, ఆయన మీద మనకున్న చెప్పలేనంత ప్రేమ, ఇష్టం. (మత్తయి 22:37 చదవండి.) ఆయన లక్షణాల గురించి ఎంతెక్కువ తెలుసుకుంటే, ఆయనకు అంతెక్కువ దగ్గరవ్వాలని అనిపిస్తుంది. ఉదాహరణకు, యెహోవా ఓర్పు గురించి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు తన మాట విననప్పుడు ఆయన వాళ్లను ఇలా బ్రతిమాలాడు: “దయచేసి మీ చెడు మార్గాల నుండి వెనక్కి తిరగండి.” (యిర్మీ. 18:11) మనం అపరిపూర్ణులమని, మట్టివాళ్లమని ఆయన గుర్తు చేసుకుంటాడు. (కీర్తన 103:13, 14 చదవండి.) యెహోవా ఓర్పు గురించి, ఆయనకున్న వేరే మంచి లక్షణాల గురించి ఆలోచించినప్పుడు, ఎప్పటికీ ఆయన సేవ చేస్తూ ఉండిపోవాలని అనిపించట్లేదా!

11. మన పరలోక తండ్రికి సేవ చేయడానికి ఇంకో కారణం ఏంటి?

11 మనం యెహోవా సేవ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, అలా చేయడమే సరైన పని. (మత్త. 4:10) అంతేకాదు, మనం నమ్మకంగా సేవచేస్తే వచ్చే ఫలితాలు ఏంటో కూడా మనకు తెలుసు. మనం నమ్మకంగా సేవ చేస్తే యెహోవా పేరు పవిత్రపర్చబడుతుంది, సాతాను అబద్ధాలకోరు అని నిరూపించబడుతుంది, యెహోవా కూడా సంతోషిస్తాడు. ఒకవేళ మనం ఇప్పుడు యెహోవా సేవను ఎంచుకుంటే, శాశ్వతకాలం ఆయన సేవ చేసే అవకాశం మనకు ఉంటుంది.—యోహా. 17:3.

12-13. కీర్తి, ప్రీతి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 మనం చాలా చిన్నగా ఉన్నప్పుడే యెహోవా మీద ప్రేమను పెంచుకోవచ్చు. మనం పెద్దౌతున్నప్పుడు ఆ ప్రేమ మనతోపాటు ఎదుగుతుంది. కీర్తి, ప్రీతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల గురించి చూడండి.a బైబిలు స్టడీ మొదలుపెట్టినప్పుడు కీర్తికి 11 ఏళ్లు, ప్రీతికి 10 ఏళ్లు. అయితే వాళ్ల అమ్మానాన్నలకు బైబిలు స్టడీ మీద పెద్దగా ఆసక్తిలేదు. కానీ వాళ్లతోపాటు ప్రతీవారం చర్చీకి వస్తేనే బైబిలు స్టడీ తీసుకోవడానికి పర్మిషన్‌ ఇస్తామని అన్నారు. కీర్తి ఇలా చెప్తుంది: “మా క్లాస్‌మేట్స్‌ కొంతమంది డ్రగ్స్‌ తీసుకునేవాళ్లు, అనైతికంగా ఉండేవాళ్లు. కానీ యెహోవాసాక్షులు మాకు బైబిల్లో నుండి నేర్పించిన దాన్నిబట్టి మేము వాటి జోలికి వెళ్లకుండా ఉండగలిగాం.”

13 కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత పయినీరు సేవ చేస్తూ వయసుపైబడిన వాళ్ల అమ్మానాన్నల్ని చూసుకుంటున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తమ జీవితం గురించి కీర్తి ఇలా చెప్తుంది: “యెహోవా తన స్నేహితుల్ని నమ్మకంగా పట్టించుకుంటాడని స్వయంగా రుచి చూశాను. అలాగే 2 తిమోతి 2:19 లో చెప్తున్నట్టు, ‘తనవాళ్లు ఎవరో యెహోవాకు తెలుసు.’” అవును తనను ప్రేమించాలని, తనకు సేవచేయాలని ఎంచుకున్న వాళ్లను యెహోవా పట్టించుకుంటాడు అనడంలో ఏ డౌట్‌ లేదు!

14. మనం యెహోవా వైపు నిలబడుతున్నాం అని ఎలా చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

14 యెహోవా పేరుమీద పడ్డ నిందలన్నీ తీసేయడానికి మనవంతు ప్రయత్నం చేయాలని అనుకుంటాం. ఈ సందర్భాన్ని ఊహించుకోండి: మీకొక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతనికి దయ, ఇచ్చే గుణం, క్షమించే గుణం ఎక్కువ ఉంది. అయితే, ఒకరోజు మీ స్నేహితుడు చాలా క్రూరుడని, అస్సలు నిజాయితీపరుడు కాడని ఎవరో నిందించారు. అప్పుడు మీరేం చేస్తారు? మీ ఫ్రెండ్‌ తరఫు నిలబడి, అతని గురించి నిజాలు చెప్తారు కదా! అదేవిధంగా సాతాను, అతని చెప్పుచేతల్లో ఉన్నవాళ్లు యెహోవా పేరును పాడుచేయడానికి అబద్ధాల్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం యెహోవా తరఫున నిలబడి, ఆయన గురించి నిజాలు చెప్పాలి. (కీర్త. 34:1; యెష. 43:10) మనం యెహోవాకు మనసారా సేవచేయాలని అనుకుంటున్నామని మన మాటల్లో, పనుల్లో చూపిస్తాం.

రాగి బలిపీఠానికి, ఆలయ ప్రవేశ ద్వారానికి మధ్యలో ఒక లేవీయుడు నిలబడి ఉన్నాడు.

మీరు యెహోవా తరఫున నిలబడి, ఆయన గురించి నిజాలు చెప్తారా? (14వ పేరా చూడండి)b


15. అపొస్తలుడైన పౌలు తన లక్ష్యాల్ని మార్చుకోవడం వల్ల ఏమైంది? (ఫిలిప్పీయులు 3:7, 8)

15 యెహోవా సేవ ఎక్కువ చేయడానికి మనం మన జీవితంలో పెట్టుకున్న లక్ష్యాల్ని ఇష్టంగా మార్చుకుంటాం. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు క్రీస్తును అనుసరిస్తూ, యెహోవా సేవ చేయడానికి యూదా మతంలో తనకున్న పేరుప్రఖ్యాతుల్ని పక్కనపెట్టాడు. (గల. 1:14) దానివల్ల ఆయన తన జీవితంలో ఎన్నో ఆనందాల్ని రుచి చూశాడు. క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించే గొప్ప అవకాశం ఆయనకు దక్కింది. యెహోవా సేవ చేయాలని తీసుకున్న ఆ నిర్ణయానికి ఆయన ఎప్పుడూ బాధపడలేదు. మనం కూడా బాధపడే పరిస్థితి ఎప్పుడూ రాదు!—ఫిలిప్పీయులు 3:7, 8 చదవండి.

16. జూలియా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

16 జీవితంలో యెహోవా సేవకే అన్నిటికన్నా మొదటి స్థానం ఇస్తే, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో ఎన్నో దీవెనలు మన సొంతం. జూలియా అనే సిస్టర్‌ అనుభవాన్ని చూడండి. ఆమె సత్యం తెలుసుకోకముందు, చిన్నప్పటి నుండి ఒక చర్చిలో పాటలు పాడేది. బాగా పేరుగాంచిన ఒక సింగర్‌ ఆమెకున్న టాలెంట్‌ని గుర్తించి, ఆమెకు శిక్షణ ఇచ్చారు. ఎన్నో రోజులు గడవకముందే, జూలియా చాలామంది మన్ననలు పొంది, పిట్ట కొంచెం కూత ఘనం అనే పేరు తెచ్చుకుని, చాలా పెద్దపెద్ద మ్యూజిక్‌ హాల్స్‌లో పాటలు పాడింది. ఆమె ఒక పెద్ద మ్యూజిక్‌ స్కూల్లో చదువుతున్నప్పుడు, తనతోపాటు చదివే ఒక స్టూడెంట్‌ దేవునికి ఒక పేరుందని, అది యెహోవా అని చెప్పాడు. ఎంతోకాలం గడవకముందే జూలియా వారానికి రెండుసార్లు బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇక ఆమె తన సంగీతానికి చరమగీతం పాడి, యెహోవా సేవకు స్వాగతం పలికింది. ఆ నిర్ణయం అంత తేలిక కాలేదు. ఎందుకంటే ఆమె ఇలా చెప్పింది: “నాకున్న టాలెంట్‌ని వేస్ట్‌ చేసుకుంటున్నానని చాలామంది అన్నారు. కానీ ఈ జీవితాన్ని యెహోవా సేవకే అంకితం చేయాలని అనుకున్నాను.” అయితే, 30 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఎంపిక చేసుకున్న ఈ జీవితం గురించి జూలియా ఏం చెప్తుంది? “నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. నా హృదయంలో ఉన్న ప్రతీ కోరికను యెహోవా భవిష్యత్తులో తీరుస్తాడనే నమ్మకం ఉంది.”—కీర్త. 145:16.

చిత్రాలు: జూలియా తీసుకున్న నిర్ణయం గురించి మనకోసం నటించి చూపించే సన్నివేశం. 1. ఆమె స్టేజీ మీద పాట పాడుతుంది. 2. మీటింగ్‌లో తన భర్తతో కలిసి పాట పాడుతుంది.

యెహోవా సేవకే అన్నిటికన్నా మొదటి స్థానం ఇస్తే, ఎన్నో దీవెనలు మన సొంతం (16వ పేరా చూడండి)c


యెహోవా సేవ చేస్తూ ఉండండి

17. అపొస్తలుడైన పౌలు మాటల్ని బట్టి ఏం అర్థమౌతుంది?

17 మనం ఈ వ్యవస్థ నాశనానికి చాలా దగ్గర్లో జీవిస్తున్నాం. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “‘చాలా తక్కువ సమయం’ మిగిలివుంది, ‘వస్తున్నవాడు తప్పక వస్తాడు, ఆలస్యం చేయడు.’” (హెబ్రీ. 10:37) దీనిబట్టి ఏం అర్థమౌతుంది? ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రజలు యెహోవా సేవను ఎంపిక చేసుకోవడానికి చాలా తక్కువ సమయం మిగిలివుంది. (1 కొరిం. 7:29) అయితే, ఇప్పటికే మనం యెహోవా సేవను ఎంపిక చేసుకుని ఉంటే, మనకు వచ్చే కష్టాలన్నీ కొంచెం సమయం వరకే అని అర్థమౌతుంది.

18. యెహోవా, యేసు మనల్ని ఏం చేయమని చెప్తున్నారు?

18 యేసు తన శిష్యులకు తనను అనుసరించడం మొదలుపెట్టమని మాత్రమే చెప్పలేదు. తనను అనుసరిస్తూ ఉండమని చెప్పాడు. (మత్త. 16:24) కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్నా, దాన్ని అస్సలు ఆపొద్దు! ఆయన సేవచేయాలని మనం తీసుకున్న నిర్ణయానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆయన సేవ చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అదంతా ఈజీ కాకపోవచ్చు. కానీ అలా చేస్తే ఇప్పుడు కూడా మనం ఎన్నో దీవెనలు పొందుతాం. ఎంతో సంతృప్తి మనకు సొంతమౌతుంది.—కీర్త. 35:27.

19. జీన్‌ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

19 యెహోవా సేవ అంటే అబ్బో చాలా త్యాగాలు చేయాలి అని కొంతమంది అనుకోవచ్చు. మీరొకవేళ యౌవనులైతే, యెహోవా సేవ చేస్తే ఏదో కోల్పోతామని అనిపిస్తుందా? జీన్‌ అనే యువ సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “ఒక యెహోవాసాక్షిగా ఉండడం అంటే నన్ను కట్టిపడేసినట్లు అనిపించేది. ఎందుకంటే నా తోటి పిల్లలందరూ పార్టీలకు, డేటింగ్‌లకు వెళ్లేవాళ్లు, వీడియో గేమ్స్‌ ఆడుకునేవాళ్లు. నేను చూస్తే మీటింగ్స్‌లో కూర్చునేవాణ్ణి, ప్రీచింగ్‌కి వెళ్లేవాణ్ణి.” మరి దీనివల్ల జీన్‌ ఏం చేశాడు? “ఇక నేను మీటింగ్స్‌లో ఒకలా బయట ఒకలా బ్రతకడం మొదలుపెట్టా. కొంతకాలం సరదాగానే అనిపించింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు. నేను పట్టించుకోని బైబిలు సత్యాల గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టా. ఇక యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయాలని గట్టిగా అనుకున్నాను. అప్పటినుండి యెహోవా నా ప్రతీ ప్రార్థనకు జవాబిస్తున్నాడని అనిపించింది.”

20. మనం ఏ తీర్మానం తీసుకోవాలి?

20 ఒక కీర్తనకర్త యెహోవాకు ఇలా పాడాడు: “నీ ప్రాంగణాల్లో నివసించడం కోసం, నువ్వు ఎంచుకుని, నీ దగ్గరికి తెచ్చుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.” (కీర్త. 65:4) కాబట్టి యెహోషువలాగే మనం కూడా ఈ తీర్మానం తీసుకుందాం: “నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం.”—యెహో. 24:15.

మీరెలా జవాబిస్తారు?

  • యేసు యెహోవా సేవను ఎందుకు ఎంచుకున్నాడు?

  • యెహోవా మన ఆరాధనకు ఎందుకు అర్హుడు?

  • మీరెందుకు యెహోవా సేవను ఎంచుకున్నారు?

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

a కొన్ని పేర్లను మార్చాం.

b చిత్రాల వివరణ: ఒకావిడ సమావేశ హాలు బయట వ్యతిరేకుల నినాదాలు వింది, ఆమె కార్టు దగ్గరకు వచ్చి నిజాలు వింటుంది.

c చిత్రం వివరణ : యెహోవా సేవకే మొదటిస్థానం ఇవ్వడానికి జూలియా చేసిన పనిని మనకోసం నటించి చూపించే చిత్రం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి