కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/1 పేజీలు 8-13
  • మంటితో నిర్మింపబడినప్పటికీ, ముందుకు సాగండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంటితో నిర్మింపబడినప్పటికీ, ముందుకు సాగండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిస్థితుల మార్పు
  • వారు కూడా మంటితో నిర్మింపబడినవారే
  • మంటితో నిర్మింపబడటం అంటే వ్యక్తిగతంగా మనకు ఏ భావాన్నిస్తుంది?
  • చనిపోయాక ఏమి జరుగుతుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఆ దినము సమీపించు కొలది ఒకనినొకడు పురికొల్పుకొనుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిరుత్సాహాన్ని గురించి ఏమి చేయవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీరు నిరుత్సాహంతో పోరాడగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/1 పేజీలు 8-13

మంటితో నిర్మింపబడినప్పటికీ, ముందుకు సాగండి!

“మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు.”—కీర్తన 103:14.

1. మానవులు మంటితో నిర్మింపబడ్డారని చెప్పడంలో బైబిలు వైజ్ఞానికంగా సరియైయుందా? వివరించండి.

మనం శారీరకరీతిలో, మంటివారము. “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” (ఆదికాండము 2:7) మానవుని సృష్టిని గూర్చిన ఈ సరళమైన వివరణ, వైజ్ఞానిక సత్యంతో పొందిక కలిగి ఉంది. మానవ శరీరాన్ని రూపించిన 90 కంటే ఎక్కువగావున్న మూలపదార్థాలనన్నిటిని “నేలమంటిలో” కనుగొనవచ్చు. ఒక వయోజనుని శరీరం 65 శాతం ఆమ్లజని, 18 శాతం బొగ్గు, 10 శాతం ఉదజని, 3 శాతం నత్రజని, 1.5 శాతం సున్నం, 1 శాతం భాస్వరము, మిగిలింది వేరే మూలపదార్థాలతో తయారు చేయబడిందని ఒకసారి ఒక రసాయన శాస్త్రవేత్త అన్నాడు. ఈ అంచనాలు పూర్తిగా కచ్చితమైనవేనా అనేది ప్రాముఖ్యం కాదు. “మనము మంటివారమ”న్నది వాస్తవమే!

2. దేవుడు మానవులను సృష్టించిన విధం మీలో ఏ ప్రతిస్పందనను కలుగజేస్తుంది, ఎందుకు?

2 కేవలం మంటి నుండి అలాంటి సంక్లిష్ట జీవులను యెహోవా కాక, మరెవరు సృష్టించగలరు? దేవుని క్రియలు పరిపూర్ణమైనవి, దోషంలేనివి, గనుక మనిషిని ఈరీతిగా సృష్టించడానికి ఆయన ఎన్నుకోవడం నిశ్చయంగా ఫిర్యాదు చేయవలసినది కాదు. వాస్తవానికి, మహాగొప్ప సృష్టికర్త నేలమంటి నుండి భీతి కలిగించే, అద్భుతమైన రీతిలో మానవున్ని సృష్టించ గలగడమన్నది ఆయన అపరిమితమైన శక్తి, సామర్థ్యం, ఆచరణాత్మక జ్ఞానముల యెడల మన మెప్పును వృద్ధిచేస్తుంది.—ద్వితీయోపదేశకాండము 32:4, అథఃస్సూచి; కీర్తన 139:14.

పరిస్థితుల మార్పు

3, 4. (ఎ) మానవున్ని మంటి నుండి సృష్టించడంలో, దేవుని ఉద్దేశం ఏమి కాదు? (బి) కీర్తన 103:14 నందు దావీదు దేన్ని సూచిస్తున్నాడు, ఈ ముగింపుకు రావడానికి ఆ సందర్భం మనకెలా సహాయం చేస్తుంది?

3 మంటి జీవులకు హద్దులనేవి ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు అవి భారమైనవి లేక అధికంగా కట్టుదిట్టం చేసేవైయుండాలని ఎన్నడూ ఉద్దేశించలేదు. అవి నిరుత్సాహపర్చడానికి లేక అసంతోషానికి దారితీయడానికి ఉద్దేశించినవి కావు. ఇంకనూ, కీర్తన 103:14 నందలి దావీదు మాటల సందర్భం సూచిస్తున్నట్లుగా, మానవులకు గల హద్దులు నిరుత్సాహాన్ని కలిగించి, అసంతోషానికి దారితీయగలవు. ఎందుకు? ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపినప్పుడు, వారు తమ భవిష్యత్‌ కుటుంబానికి మారిన పరిస్థితిని తెచ్చారు. మంటితో చేయబడడమన్నది అప్పుడు కొత్త భావాలను సంతరించుకుంది.a

4 దావీదు, మంటి నుండి చేయబడిన పరిపూర్ణ మానవులు కూడా కలిగి ఉండే సహజమైన హద్దులను గురించి కాదుగాని, వారసత్వంగా పొందిన అపరిపూర్ణత వల్ల వచ్చే మానవ దౌర్బల్యాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆయన యెహోవాను గూర్చి యిలా చెప్పేవాడు కాదు: “ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు [ఆయన] మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.” (కీర్తన 103:3,4, 10) మంటితో నిర్మింపబడినప్పటికీ, పరిపూర్ణమానవులు నమ్మకంగా ఉన్నట్లైతే, క్షమాపణ అవసరమయ్యేలా వారు ఎన్నటికీ తప్పుగాని, పాపంగాని చేసుండేవారు కాదు; స్వస్థత గావించాల్సిన వ్యాధులు వారికి వచ్చివుండేవి కావు. అన్నిటికంటే ముఖ్యంగా, కేవలం పునరుత్థానం ద్వారా మాత్రమే బయటికి రాగల మరణపు ఊబిలోకి వారు ఎన్నడూ దిగిపోవలసి వచ్చి ఉండేదికాదు.

5. దావీదు మాటలను అర్థం చేసుకోవడం మనకు ఎందుకు కష్టం కాదు?

5 అపరిపూర్ణులమైనందున, మనమందరం దావీదు మాట్లాడిన వాటన్నిటిని అనుభవించాము. అపరిపూర్ణతనుబట్టి మనకుగల పరిమితులను మనం ఎల్లప్పుడూ ఎరిగియున్నాము. అవి కొన్నిసార్లు, యెహోవాతో లేక మన క్రైస్తవ సహోదరులతో మనకున్న సంబంధాలను పాడుచేస్తున్నప్పుడు మనం బాధపడతాము. మన బలహీనతలు, సాతాను లోకం యొక్క ఒత్తిడులు కొన్నిసార్లు మనల్ని నిరాశలో పడవేయడాన్ని బట్టి మనం చింతిస్తాము. సాతాను పరిపాలన దాని అంతానికి త్వరగా సమీపిస్తుండగా, అతని లోకం సామాన్య ప్రజలపై, ప్రాముఖ్యంగా క్రైస్తవులపై మునుపెన్నటి కంటే అధికంగా ఒత్తిడి కలుగజేస్తున్నది.—ప్రకటన 12:12.

6. కొందరు క్రైస్తవులు ఎందుకు నిరుత్సాహ పడవచ్చు, యిలాంటి భావాన్ని సాతాను ఒక అవకాశంగా ఎలా తీసుకోవచ్చు?

6 క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం మరీ కష్టమౌతున్నదని మీరు భావిస్తారా? కొంతమంది క్రైస్తవులు తాము ఎంత ఎక్కువ కాలం సత్యంలో ఉంటే అంత ఎక్కువ అపరిపూర్ణుల మౌతున్నామని చెప్పడం జరిగింది. అయితే బహుశా, కేవలం వారు తమ స్వంత అపరిపూర్ణత గురించి, తమకు ఇష్టమైన రీతిలో యెహోవా పరిపూర్ణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంలో తమ అసమర్థతను గురించి ఎక్కువగా ఎరిగివుండడమే దీనికిగల కారణము. అయితే జ్ఞానము, యెహోవా నైతిక కట్టడల యెడల మెప్పుదలను వృద్ధిచేసుకొనుటలో కొనసాగినప్పుడు నిజంగా ఏర్పడే పరిణామం బహుశా యిదే. అపవాదికి మనం లొంగిపోయే పరిస్థితి వచ్చేలా అలాంటిదేది మనల్ని నిరుత్సాహపర్చుటకు మనం ఎన్నడూ అనుమతించక పోవడం ప్రాముఖ్యము. యెహోవా సేవకులు సత్యారాధనను విడిచిపెట్టేలా చేయడానికి వాడు శతాబ్దాలుగా నిరుత్సాహంపై పట్టు సాధించాలని పదేపదే ప్రయత్నించాడు. అయినప్పటికీ, దేవుని యెడల నిజమైన ప్రేమ, అలాగే అపవాది యెడల “పూర్ణద్వేషము” అనేకులు అలా చేయకుండా కాపాడింది.—కీర్తన 139:21, 22; సామెతలు 27:11.

7. కొన్నిసార్లు మనం ఏ విషయంలో యోబు వలె ఉండవచ్చు?

7 అయినా, యెహోవా సేవకులు ఎప్పుడో ఒకసారి నిరుత్సాహ పడవచ్చు. మన స్వంత సాఫల్యాల యెడల అసంతృప్తి కూడా దీనికి ఒక కారణమైయుండవచ్చు. భౌతిక కారణాలు లేక కుటుంబ సభ్యులు, స్నేహితులు, లేదా తోటిపనివారితో సరిగాలేని సంబంధాలు దీనిలో యిమిడివుండవచ్చు. నమ్మకస్థుడైన యోబు ఎంతగా నిరుత్సాహ పడ్డాడంటే ఆయన దేవున్ని యిలా వేడుకున్నాడు: “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతో మేలు నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.” ఇప్పుడు, కష్టతరమైన పరిస్థితులు “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడైన” యోబును కూడా నిరుత్సాహపర్చ గల్గితే, అదే మనకు సంభవించ గలదంటే దానికి ఆశ్చర్యపోనవసరం లేదు.—యోబు 1:8, 13-19; 2:7-9, 11-13; 14:13.

8. అప్పుడప్పుడూ కలిగే నిరుత్సాహం ఎందుకు అనుకూల సూచన కాగలదు?

8 యెహోవా హృదయాలను పరికించి, మంచి దృక్పథాలను అలక్ష్యం చేయడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుంది! ఆయనను ప్రీతిపర్చడానికి పూర్తి నిష్కపటంగా ప్రయాసపడేవారిని ఆయన ఎన్నడూ నిరాకరించడు. వాస్తవానికి, అప్పుడప్పుడు కలిగే నిరుత్సాహం, యెహోవాకు మనం చేసే సేవను మనం తక్కువగా చూడడం లేదని సూచించే, అనుకూల సూచన కావచ్చు. ఈ దృక్కోణంలో చూసినప్పుడు, నిరుత్సాహంతో ఎన్నడూ పోరాడని వ్యక్తికి తన బలహీనతల గురించి ఆత్మీయంగా, ఇతరులకు తమ బలహీనతల గురించి తెలిసినంతగా తెలియకపోవచ్చు. గుర్తుంచుకోండి: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 10:12; 1 సమూయేలు 16:7; 1 రాజులు 8:39; 1 దినవృత్తాంతములు 28:9.

వారు కూడా మంటితో నిర్మింపబడినవారే

9, 10. (ఎ) క్రైస్తవులు ఎవరి విశ్వాసాన్ని అనుకరించాలి? (బి) మోషే తనకు అప్పగించబడిన పనికి ఎలా ప్రతిస్పందించాడు?

9 హెబ్రీయులు 11వ అధ్యాయం దృఢ విశ్వాసాన్ని అభ్యసించిన అనేకమంది క్రీస్తు పూర్వపు యెహోవాసాక్షులను గూర్చి తెలియజేస్తుంది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, ఆధునిక కాలాల్లోని క్రైస్తవులు అలాగే చేశారు. వారి నుండి నేర్చుకోవలసిన పాఠాలు అమూల్యమైనవి. (హెబ్రీయులు 13:7 పోల్చండి.) ఉదాహరణకు, మోషే విశ్వాసం కంటే మరెవరి విశ్వాసాన్ని క్రైస్తవులు శ్రేష్ఠంగా అనుకరించగలరు? ఆయన తనకాలంనాటి అత్యంత శక్తివంతమైన ప్రపంచ పరిపాలకుడైన ఐగుప్తు యొక్క ఫరోకు తీర్పు సందేశాలను ప్రకటించడానికి పిలువబడ్డాడు. నేడు, స్థాపించబడిన క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగావున్న అబద్ధ మతానికి, మరితర సంస్థలకు విరుద్ధంగా అలాంటి తీర్పు సందేశాలనే యెహోవాసాక్షులు ప్రకటించాలి.—ప్రకటన 16:1-15.

10 మోషే చూపినట్లుగా, ఈ పనిని నెరవేర్చడం అంత సులభం కాదు. ఆయనిలా అడిగాడు: ‘నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను?’ తాను సరితూగలేననే అతని భావాలను మనం అర్థం చేసుకోవచ్చు. తోటి ఇశ్రాయేలీయులు ఎలా ప్రతిస్పందిస్తారోనని కూడా అతడు చింతించాడు: “వారు నన్ను నమ్మరు నా మాట వినరు.” తనకు అధికారం యివ్వబడిందనేది ఎలా నిరూపించుకోవాలో అప్పుడు యెహోవా ఆయనకు వివరించాడు, కాని మోషేకు మరో సమస్య ఉంది. ఆయనిలా చెప్పాడు: ‘ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండియైనను, నేను మాట నేర్పరినికాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను.’—నిర్గమకాండము 3:11; 4:1, 10.

11. మోషే వలె దైవపరిపాలనా బాధ్యతలకు మనమెలా ప్రతిస్పందించవచ్చు, కాని విశ్వాసం కలిగివుండడం ద్వారా మనం దేని గురించి నిశ్చయత కలిగివుండవచ్చు?

11 కొన్నిసార్లు, మనం మోషేలా భావించవచ్చు. మన దైవపరిపాలనా బాధ్యతలను గుర్తించినప్పటికీ, వాటిని మనమెప్పటికైనా ఎలా నెరవేర్చగలమని మనం అనుకోవచ్చు. ‘సాంఘిక, ఆర్థిక, లేక విద్యాపరమైన ఉన్నత స్థానం గల ప్రజల యొద్దకు వెళ్లి, దేవుని మార్గాలను వారికి బోధించాలని తలంచడానికి నేనెవర్ని? నేను క్రైస్తవ కూటాలలో వ్యాఖ్యానించినప్పుడు లేక దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో వేదిక మీదనుండి ప్రసంగించినప్పుడు నా ఆత్మీయ సహోదరులు ఎలా ప్రతిస్పందిస్తారు? వారు నా బలహీనతలను చూడరా?’ కాని గుర్తుంచుకోండి, మోషే విశ్వాసముంచాడు గనుక యెహోవా మోషేతో ఉండి, ఆయన పని నిమిత్తం ఆయనను ఆయత్తపర్చాడు. (నిర్గమకాండము 3:12; 4:2-5, 11, 12) మనం మోషే విశ్వాసాన్ని అనుకరిస్తే, యెహోవా మనకు కూడా తోడైవుండి, అలాగే మన పని నిమిత్తం మనల్ని ఆయత్తపరుస్తాడు.

12. పాపాలు లేక బలహీనతలను బట్టి కలిగే నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పుడు దావీదు విశ్వాసం మనల్ని ఎలా ప్రోత్సహించగలదు?

12 పాపాలు లేదా పొరపాట్ల వల్ల నిరుత్సాహం చెందిన లేక నిరాశ చెందిన వారెవరైనా నిజంగా దావీదు వలెనే యిలా అనవచ్చు: “నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.” యెహోవాను వేడుకొంటూ దావీదు యిలా కూడా అన్నాడు: “నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచి వేయుము.” అయినా, యెహోవాను సేవించాలనే తన కోరికను తీసివేసేలా నిరుత్సాహాన్ని ఆయన ఎన్నడూ అనుమతించలేదు. “నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” దావీదు స్పష్టంగా “మన్ను” అయివుండెను, కాని యెహోవా ఆయనకు దూరం కాలేదు, ఎందుకంటే “విరిగి నలిగిన హృదయమును” అలక్ష్యము చేయననే యెహోవా వాగ్దానమందు దావీదు విశ్వాసముంచాడు.—కీర్తన 38:1-9; 51:3, 9, 11, 17.

13, 14. (ఎ) మనం ఎందుకు మనుష్యులను అనుసరించే వారము కాకూడదు? (బి) పౌలు మరియు పేతురు ఉదాహరణలు వారు కూడా మంటివారే అని ఎలా చూపిస్తాయి?

13 అయినను, “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తు”టకు మనం “ఇంత గొప్ప సాక్షి సమూహము”ను ఒక ప్రోత్సాహంగానే దృష్టించవలసి ఉన్నప్పటికీ, మనం వారి అనుచరులు కావాలని చెప్పబడలేదని గమనించండి. మనం అపరిపూర్ణ మానవులను—చివరికి మొదటి శతాబ్దపు నమ్మకమైన అపొస్తలులను కూడా కాదుగాని, “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు” అడుగుజాడలను అనుసరించాలని మనకు చెప్పబడింది.—హెబ్రీయులు 12:1, 2; 1 పేతురు 2:21.

14 క్రైస్తవ సంఘంలో స్తంభాలవంటి వారైన అపొస్తలులగు పౌలు మరియు పేతురు కొన్నిసార్లు అభ్యంతరపడ్డారు. పౌలు యిలా వ్రాశాడు: “నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. . . . అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను?” (రోమీయులు 7:19, 24) పేతురు అతినమ్మకంతో “నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని” యేసుతో చెప్పాడు. పేతురు తనను మూడు సార్లు ఎరుగనంటాడని యేసు హెచ్చరించినప్పుడు, పేతురు “నేను నీతో కూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనని” ప్రగల్భాలు పలుకుతూ, గర్వంగా తన యజమానిని వ్యతిరేకించాడు. అయినా ఆయన యేసును ఎరుగనన్నాడు, అదే పొరపాటు ఆయన వేదనతో ఏడ్చేలా చేసింది. అవును, పౌలు మరియు పేతురు మంటితో నిర్మింపబడినవారే.—మత్తయి 26:33-35.

15. మనం మంటితో నిర్మింపబడ్డామన్నది వాస్తవమైనప్పటికీ, ముందుకు సాగడానికి మనకు ఏ పురికొల్పు వున్నది?

15 అయినను, మోషే, దావీదు, పౌలు, పేతురు, వారి వంటి మరితరులకు దుర్భలతలు ఉన్నప్పటికీ, విజయవంతులయ్యారు. ఎందుకు? ఎందుకంటే, వారు యెహోవా యందు దృఢ విశ్వాసముంచారు, ఆయనను దృఢంగా నమ్మారు, అసఫలతలు ఎదురైనా ఆయనను హత్తుకొని ఉన్నారు. “బలాధిక్యమును” పొందుటకు వారు ఆయనపై ఆధారపడ్డారు. వారు తిరిగి లేవలేని విధంగా పడిపోయేలా ఎన్నడూ ఆయన వారిని విడువలేదు. మనం విశ్వాసంలో కొనసాగినట్లైతే, మన విషయంలో తీర్పు తీర్చబడినప్పుడు, అది ఈ మాటలతో పొందిక కలిగి ఉంటుందని మనం నిశ్చయత కల్గివుండగలం: “తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.” మనం మంటితో నిర్మింపబడ్డామన్నది వాస్తవమే అయినప్పటికీ, మనం ముందుకు సాగడానికి యిది మనకు ఎంతటి పురికొల్పునిస్తుంది!—2 కొరింథీయులు 4:7; హెబ్రీయులు 6:10.

మంటితో నిర్మింపబడటం అంటే వ్యక్తిగతంగా మనకు ఏ భావాన్నిస్తుంది?

16, 17. తీర్పు తీర్చే విషయంలో, గలతీయులు 6:4 నందు వివరించబడిన సూత్రాన్ని యెహోవా ఎలా అన్వయిస్తాడు?

16 అనుభవం అనేది, తోబుట్టువులతో లేక తోటి విద్యార్థులతో పోల్చడంపై ఆధారపడి కాకుండా, పిల్లలు లేక విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి తీర్పు తీర్చే జ్ఞానాన్ని అనేకమంది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నేర్పింది. ఇది అనుసరించమని క్రైస్తవులకు చెప్పబడిన బైబిలు సూత్రంతో పొందిక కల్గివుంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టికాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును.”—గలతీయులు 6:4.

17 ఈ సూత్రానికి అనుగుణంగా, యెహోవా తన ప్రజలతో సంస్థీకరింపబడిన ఒక గుంపువలె వ్యవహరించినప్పటికీ, ఆయన వారిని వ్యక్తిగతంగానే తీర్పుతీరుస్తాడు. రోమీయులు 14:12 యిలా చెబుతుంది: “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” యెహోవాకు తన సేవకులలో ప్రతి ఒక్కరి జన్యు నిర్మాణం బాగా తెలుసు. వారి శారీరక, మానసిక నిర్మాణం, వారి సామర్థ్యాలు, వారసత్వంగా వారు పొందిన బలాలు, బలహీనతలు, వారికున్న అవకాశాలు అలాగే క్రైస్తవ ఫలాలను ఫలించుటకు ఈ అవకాశాలను వారు ఎంత వరకు ఉపయోగించుకుంటారనే విషయాలు ఆయనకు తెలుసు. ఆలయ ఖజానాలో రెండు చిన్న నాణాలను వేసిన విధవరాలిని గూర్చిన యేసు వ్యాఖ్యానాలు, మంచి నేలపై విత్తబడిన విత్తనాన్ని గూర్చిన ఆయన ఉపమానం వంటివి, తమను ఇతరులతో అవివేకంగా పోల్చడాన్నిబట్టి నిరాశచెందిన క్రైస్తవులకు ప్రోత్సాహకరమైన ఉదాహరణలు.—మార్కు 4:20; 12:42-44.

18. (ఎ) మంటివారమంటే మనకు వ్యక్తిగతంగా ఏ భావాన్నిస్తుందో మనం ఎందుకు నిర్ణయించుకోవాలి? (బి) సూటియైన స్వయం పరీక్ష మనం నిరాశ చెందేలా ఎందుకు చేయకూడదు?

18 మంటితో నిర్మింపబడడం అంటే వ్యక్తిగతంగా మన విషయంలో ఏ భావాన్నిస్తుందనేది మనం నిర్ణయించుకోవడం ప్రాముఖ్యం, తద్వారా మనం మన పూర్ణ శక్తితో సేవచేయగలం. (సామెతలు 10:4; 12:24; 18:9; రోమీయులు 12:1) మన వ్యక్తిగత దౌర్బల్యాలు, బలహీనతలను గూర్చి మనం బాగా ఎరిగియుంటే మాత్రమే, మనం అభివృద్ధి చేసుకొనే అవసరత, సాధ్యతల యెడల జాగ్రత్త కలిగివుండగలము. స్వయం పరీక్ష చేసుకోవడంలో, మనం అభివృద్ధి చెందడానికి పరిశుద్ధాత్మ చేసే సహాయాన్ని మనమెన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు. దాని ద్వారానే విశ్వం సృష్టించబడింది, బైబిలు వ్రాయబడింది, గతించిపోతున్న లోకం మధ్యన శాంతియుత నూతన లోక సమాజం ఉనికిలోకి తేబడింది. గనుక దేవుని పరిశుద్ధాత్మ, అది కావాలని కోరేవారికి, యథార్థతను కాపాడుకోడానికి అవసరమయ్యే జ్ఞానాన్ని, బలాన్ని కచ్చితంగా యివ్వగలిగేంత శక్తిగలది.—మీకా 3:8; రోమీయులు 15:13; ఎఫెసీయులు 3:16.

19. మనం మంటితో నిర్మింపబడ్డామన్నది దేనికి ఒక సాకు కాదు?

19 మనం మంటివారమని యెహోవా గుర్తుంచుకుంటాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుంది! అయినను, అశ్రద్ధగా ఉండడానికి లేక తప్పు చేయడానికి దీన్ని మనం ఒక న్యాయమైన సాకుగా ఎన్నడూ ఎంచకూడదు. అలా చేయనే కూడదు! మనం మంటివారమని యెహోవా గుర్తుంచుకుంటాడంటే అది ఆయన కృపా బాహుళ్యానికి నిదర్శనము. కాని “భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్న” వారముగా ఉండుటకు మనం ఇష్టపడము. (యూదా 4) మంటితో నిర్మింపబడటం దైవభక్తి లేకుండా ఉండడానికి ఒక సాకు కాదు. “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపర్చ” కుండు నిమిత్తం ఒక క్రైస్తవుడు తన శరీరాన్ని నలుగగొట్టుకొని, దాన్ని లోబరచుకోవడం ద్వారా చెడు స్వభావాలతో పోరాడడానికి ప్రయాసపడతాడు.—ఎఫెసీయులు 4:30; 1 కొరింథీయులు 9:27.

20. (ఎ) ఏ రెండు విషయాల్లో మనకు “ప్రభువు కార్యములో ఎల్లప్పుడూ సమృద్ధిగా పని” ఉంది? (బి) ఆశాభావం కలిగివుండుటకు మనకెందుకు కారణముంది?

20 ఇప్పుడు, సాతాను ప్రపంచ విధాన ముగింపు సంవత్సరాలలో, రాజ్య ప్రకటనా పనికి సంబంధించి, దేవుని ఆత్మఫలాలను పెంపొందించుకొనే విషయానికి సంబంధించి మందకొడిగా ఉండడానికిది సమయం కాదు. ఈ రెండు రంగాల్లోను మనకు “సమృద్ధిగా పని ఉంది.” మన “ప్రయాసము . . . వ్యర్థముకాదని” మనకు తెలుసు గనుక మనం ముందుకు సాగడానికి సమయమిదే. (1 కొరింథీయులు 15:58, NW) యెహోవా మనల్ని ఆదుకుంటాడు ఎందుకంటే దావీదు ఆయన గురించి యిలా చెప్పాడు: “నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) మనం మంటితో నిర్మింపబడిన వారమైనప్పటికీ, అపరిపూర్ణ మానవులకు ఎన్నడు అప్పగించబడని అత్యంత గొప్ప పనిలో మనం వ్యక్తిగతంగా భాగం వహించడానికి యెహోవా అనుమతిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఆనందం!

[అధస్సూచీలు]

a హెర్‌డెర్స్‌ బిబెల్‌కోమెన్‌టార్‌ అనే బైబిలు వ్యాఖ్యానం కీర్తన 103:14పై వ్యాఖ్యానిస్తూ యిలా అన్నది: “మానవులను తాను నేల మంటి నుండి సృష్టించాడని ఆయనకు బాగా తెలుసు, మొట్టమొదట పాపం చేసినప్పటినుండి వారిపై భారంగా ఉన్న వారి బలహీనతలు, వారి జీవితం యొక్క అశాశ్వతత్వం ఆయనకు తెలుసు.”—ఐటాలిక్కులు మావి.

మీరు వివరించగలరా?

◻ ఆదికాండము 2:7 మరియు కీర్తన 103:14 మానవులు మంటితో నిర్మింపబడిన వారని సూచించడంలో ఎలా భిన్నంగా ఉన్నాయి?

◻ హెబ్రీయులు 11వ అధ్యాయం నేటి క్రైస్తవులకు ప్రోత్సాహానికి మూలముగా ఎందుకుంది?

◻ గలతీయులు 6:4 నందు చెప్పబడిన సూత్రాన్ని అన్వయించుకొనుటలో ఎందుకు మనం జ్ఞానయుక్తంగా ఉంటాము?

◻ నిరుత్సాహాన్ని నివారించడానికి హెబ్రీయులు 6:10 మరియు 1 కొరింథీయులు 15:58 ఎలా సహాయం చేయగలవు?

[10వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు తోటి ఆరాధికుల విశ్వాసాన్ని అనుకరిస్తారు, కాని వారు తమ విశ్వాసానికి కర్తయైన యేసును అనుసరిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి