కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 9/1 పేజీలు 28-29
  • “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఐక్యత మరియు నైతిక పరిశుభ్రత ప్రాముఖ్యము
  • ఇతరులనుగూర్చి తలంచువారైయుండుడి
  • గౌరవమును చూపి క్రమమును పాటించుము
  • ఎల్లప్పుడు దేవుని మహిమకొరకు చేయుడి
  • మీరు విశ్వాసముగలవారైయున్నారో లేదో పరీక్షించుకొనుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • అవివాహిత స్థితి—పరధ్యానంలేని కార్యకలాపానికి మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 9/1 పేజీలు 28-29

“సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”

మొదటి కొరింథీయులలోని ఉన్నతాంశములు

యెహోవా దేవుని “ఆత్మతోను సత్యముతోను ఆరాధించు” వారందరికి ఆయన మహిమ చాలా ప్రాముఖ్యము. (యోహాను 4:23, 24) అందువలననే అపొస్తలుడైన పౌలు తన తోటిక్రైస్తవులైన పురాతన కొరింథీయులకు: “మీరు భోజనము చేసినను పానముచేసినను మీరేమిచేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయు” డని చెప్పెను. (1 కొరింథీయులు 10:31) అబద్ధమతములో మునిగి, వస్తుసంబంధమైన వ్యామోహము, అవినీతిగల ఈ లోకములో అట్లు చేయవలెనన్న యెహోవా మార్గమందు మన సమస్యలను తీర్చుకొనుటకు అంగీకరించుట అవవసరమైయున్నది.

వస్తుసంబంధముగా వర్ధిల్లుతూ, పూర్తిగా అబద్ధమతముతో నిండియున్న ఆ అవినీతికర పట్టణములో నివసించు కొరింథు క్రైస్తవులకు సమస్యలను తీర్చుకొనుటకు దైవిక సహాయము అవసరమైయుండెను. ద్వీపసంబంధమగు గ్రీసు మరియు పెలిప్పేనిసెస్‌ మధ్యగల భూసంధియందున్న కొరింథు, రోమను ఆధిపత్యములోని అకయకు ముఖ్యపట్టణమైయుండి, 4,00,000 జనాబాను కలిగియుండెను. ఇచ్చట దాదాపు సా.శ. 50న పౌలు సంఘమును స్థాపించెను.—అ. కార్యములు 18:1-11.

కొరింథీయులు వివాహమునుగూర్చి విగ్రహాలకు అర్పించిన వాటిని తినుటనుగూర్చి అడుగుతు పౌలుకు వ్రాశారు. (7:1) వారి మధ్యలో ఘోరమైన అవినీతి, విబేధములు ఉన్నందున ఆయన ఎంతగానో క్రుంగియున్నాడు. ప్రభువు రాత్రి భోజనమును ఆచరించవలసిన సరైన పద్ధతి విషయములో వారికి సలహా అవసరమైనది. మతభ్రష్టత్వసంబంధమైన భయము కూడ అచ్చట కలదు. ప్రేమవిషయములో సంఘమునకు హెచ్చరిక అవసరమాయెను. కావున ఇటువంటి కారణములనుబట్టి ప్రేరేపింపబడిన తన మొదటి పత్రికను పౌలు ఎఫెసులో నుండి సా.శ. 55వ సం.న కొరింథీయులకు వ్రాసెను. అయితే దాని నుండి మనమును ప్రయోజనమును పొందగలము.

ఐక్యత మరియు నైతిక పరిశుభ్రత ప్రాముఖ్యము

“సమస్తమును మనము దేవుని మహిమకొరకు” చేసినట్లయిన—సంఘములో భేదము కలుగజేయచూచు ఎవరిని మనము వెంటాడము. ఇది కొరింథీయులు ఎదుర్కొనిన సమస్యలలో ఒకటి. (1:1–4:21) “మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు,. . .యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను. . .యుండవలెనని” పౌలు వారిని హెచ్చరించెను. మనము ఆత్మీయలక్షణములను పెంచుకొని, ఈ ఉపదేశమును అనుకరించినట్లయిన ఐక్యత నివసించును. పాపసహితమైన ఏదోఒక మానవునియందు అతిశయించుటకంటే, మనము ‘నాటినను, నీరు పోసినను’ ఆత్మీయముగా ‘వృద్ధికలుగజేయువాడు దేవుడే’ అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. కొరింథులో అతిశయించువారు తాముపొందనిదంటూ ఏమిలేదు; కావున తోటివిశ్వాసులకంటె మనము శ్రేష్టులమని ఎన్నడును మనకై మనము తలంచకుండా ఉందము. అట్టి వినయమైన స్వభావము ఐక్యతను కలుగజేయుటకు మనకు తోడ్పడును.

ఐక్యత ఉండాలంటే నియమించబడిన పెద్దలు సంఘమును ఆత్మీయంగా పరిశుభ్రముగా నుంచుటకు పనిచేయవలెను. (5:1–6:20) “పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును” గనుక పశ్చాత్తాపమునొందని వ్యభిచారులు, లోభులు, విగ్రహారాధికులు, తిట్టుబోతులు, త్రాగుబోతులు లేక దోచుకొనువారు వెలివేయబడవలెను. దేవుని ఆలయమును కలంకపరచు నైతిక అపరిశుభ్రతను యెహోవా ప్రజలమధ్య సహించకూడదు. బదులుగా వారు దేవుని మహిమపరచు విషయములను చేయవలెను.

ఇతరులనుగూర్చి తలంచువారైయుండుడి

“సమస్తమును దేవుని మహిమకొరకై చేయుటకు” వివాహవిషయములోను, ఒంటరితనము విషయములోను మనము పౌలు సలహాను అన్వయించుకొనవలెను. (7:1-40) వివాహబంధములో ఏకమైనవారు తమ లైంగిక ధర్మమును ఒకరిపట్ల మరొకరు తగు శ్రద్ధతో నెరవేర్చవలసియున్నారు. వివాహితుడైన క్రైస్తవుడు అవిశ్వాసియైన తన జతనుండి వేరైయుండకూడదు, ఎందుకనగా కలసియుండుట ఆవ్యక్తి రక్షణను సంపాదించుకొనుటకు సహాయపడవచ్చును. వివాహము చింతను అధికము చేయుచుండగా, ఒంటరితన మనునది ఇతరులకు ఆత్మీయముగా సేవచేయవలెనని కోరుకొను వ్యక్తికి ప్రభువును ఏ ఇతర ప్రక్క అవధానములులేకుండ సేవించునట్లు లాభదాయకమగును.

ఒంటరివారైనను, వివాహితులైనను ఇతరుల ఆత్మీయక్షేమము నిమిత్తమై శ్రద్ధచూపుట క్రైస్తవులందరియొక్క విధియై ఉన్నది. (8:1–10:33) కావున, విగ్రహములకు అర్పించబడిన వాటిని తినుటద్వారా ఇతరులకు అభ్యంతరము కలుగజేయకుడని కొరింథీయులు హెచ్చరింపబడ్డారు. సువార్తను అంగీకరించుటనుండి ఎవరిని ఆటంకపరచకుండు నిమిత్తము వస్తుసంబంధమైన సహాయమును పొందు తనహక్కునుకూడ పౌలు వినియోగించుకొనలేదు. “ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని ఆయన” తన శరీరమును నలగగొట్టుకొనెను. అరణ్యములో పాపులైన ఇశ్రాయేలీయుల అనుభవమును మన హృదయమునకు తీసుకొనుట విగ్రహారాధనను, చెడుతనమును విసర్జించుటకు మనకు సహాయపడును. అంతేకాక ‘సమస్తమును దేవుని మహిమకొరకుచేయుట’ ఇతరులను అభ్యంతరపరచుటను తొలగించుకొనుటకు మనకు సహాయముచేయును.

గౌరవమును చూపి క్రమమును పాటించుము

‘సమస్తమును దేవుని మహిమకొరకు’ చేయుటకు మనము తగిన గౌరవముచూపుటయు అవసరమైయున్నది. (11:1-34) మొదటిశతాబ్దపు క్రైస్తవ స్త్రీ సంఘములో ప్రార్థనచేయునపుడు లేక ప్రవచించునపుడు తలపై ముసుకు వేసుకొనుటద్వారా శిరసత్వమునకు గౌరవముచూపెను. అలాంటి గౌరవమే ఈనాడు దైవసంబంధమైన స్త్రీలవలన చూపబడుచున్నది. అంతేగాక దిద్దుబాటు అవసరమైన కొరింథీయులవలె నుండకుండ ఉండుటకు మనమందరము ప్రభువురాత్రి భోజనమునకు గౌరవమును చూపవలెను.

‘సమస్తమును దేవుని మహిమకొరకు చేయుటకు’ మనము కూటములను క్రమమైన పద్ధతిలో నడిపించవవలెను. (12:1–14:40) తొలిక్రైస్తవులు కూడుకొనినప్పుడు భాషలలో మాటలాడుటవంటి ఆత్మవరములను వాటిమూలము మరియు వాటి ఉద్దేశ్యముయెడల గౌరవము, మెప్పుతో ఉపయోగించవలసియున్నారు. మనకిప్పుడు అట్టి వరములు లేకున్నను వాటిని అధికమించు ప్రేమను ప్రదర్శించుటద్వారా దేవునికి మనము మహిమను తెచ్చుదుము. మన కూటములు మంచి క్రమముగా ఏర్పరచబడినవైయున్నందునను, “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” అను పౌలు హెచ్చరికను గౌరవపూర్వకముగా అన్వయించుకొనుట ద్వారాను మనము యెహోవాను మహిమపరచుదుము.

‘సమస్తమును దేవుని మహిమకొరకు చేయుట’ బైబిలు సిద్ధాంతమును గౌరవించి ఆత్మీయంగా స్థిరంగా నిలబడునట్లు మనలను కోరుచున్నది. (15::1–16:24) కొరింథు సంఘములోని కొందరు, బహుశా, గ్రీకు తత్వమువలన ప్రభావము చెందినవారై “మృతుల పునరుత్థానము లేదని” చెప్పారు. (అ.కార్యములు 17:18, 32ను పోల్చుము.) భవిష్యత్తు పునరుత్థానము లేదు, జీవించుచున్న క్రైస్తవులు సూచనార్థమైన లేక ఆత్మసంబంధమైన పునరుత్థానమును పొందియున్నారను మతభ్రష్టత్వసంబంధమైన దృక్పథమును వారు కలిగియుండవచ్చును. (2 తిమోతి 2:16-18) అయితే యేసు పునరుత్థానమును ఎత్తిచూపుటద్వారా పౌలు నిజమైన నిరీక్షణను బలపరస్తు, అమర్త్యమైన పరలోకజీవితమునకు పునరుత్థానులగుటకు అభిషక్తక్రైస్తవులు తప్పక మరణించవలెనని చూపియున్నాడు. ఇతర మార్గములందుకూడ ఆయనమాటలు మతభ్రష్టత్వమును విసర్జించి “విశ్వాసమందు స్థిరముగా నిలబడు” టకు మనకు సహాయపడును.

ఎల్లప్పుడు దేవుని మహిమకొరకు చేయుడి

మొదటి కొరింథీయులలోని పౌలు హెచ్చరిక సా.శ. మొదటి శతాబ్దములో ఎంతటి ప్రయోజనకరమైయున్నదో నేడును అంతే ప్రయోజనకరమైయున్నది. అది ఈనాటి యెహోవాసాక్షులను ఒక పరిశుద్ధజనముగా ఐక్యతతో దేవుని సేవించుటకు నడిపించుచున్నది. అపొస్తలుని మాటలు మనలను ఇతరులయెడల శ్రద్ధకలిగి, తగిన గౌరవమును చూపించునట్లు పురికొల్పవలెను. పౌలు చెప్పినది మతభ్రష్టత్వము నెదిరించి, నిజమైన విశ్వాసమందు స్థిరముగా నిలబడునట్లు మనలను బలపరచగలదు.

నిశ్చయముగా, నమ్మకస్థుడైన ప్రతి యెహోవా సేవకునియొక్క హృదయపూర్వక కోరిక ఆయనను స్థుతించుట, తనరాజ్యమును ప్రకటించుట, తన పరిశుద్ధనామమును మహిమపరచుటైయున్నది. (145:1, 2, 10-13) నిజమునకు, కొరింథీయులకు పౌలు వ్రాసిన పత్రిక “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయుటకు మనకు సహాయముచేయును. (w90 9⁄15)

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

మరణము నిశ్చయము: అనేక పర్యాయములు కొరింథీయులకు వ్రాసిన తనపత్రికలలో ఎరేనా యందలి మరణమునుగూర్చి పౌలు తెలిపెను. ఉదాహరణకు “మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము” అని ఆయన వ్రాసెను. (1 కొరింథీయులు 4:9) పౌలు బీస్టియరి, (మనుష్యులు జంతువులతో పోరాడు) గ్లాడియేటర్స్‌ (మనుష్యులు మనుష్యులు పోరాడు) ప్రదర్శన శాలలనుగూర్చి ఆయన తలంచుచుండవచ్చును. కొందరు డబ్బుకొరకు పోరాడిరి, అయితే నేరస్థులు అట్లు పోరాడుటకు బలవంతము చేయబడిరి. మొదట వీరు ఆయుధములతో పోరాడుటకు అనుమతించబడినను, తరువాత ఈ బంధీలు దుస్తులు, రక్షణలేక తప్పక మరణించునట్లు చేయబడిరి.

“దేవదూతలకును”, “మనుష్యులకును” (కేవలము మానవజాతితోనిండిన “లోకము” కాదు) వేడుకగా అపొస్తలులు చివరకు ఆ రక్తసిక్తమయినట్టి దృశ్యములో చావనైయున్నారు. పౌలు తాను “ఎఫెసులో దుష్టమృగములతో పోరాడి” నట్లు చెప్పెను. అయితే కొందరు రోమా పౌరునిగా ఆయన దీనికి గురయ్యాడను విషయములో సందేహపడుతూ ఆయన మృగములలాంటి వ్యతిరేకులను గూర్చి దానిని చెప్పుచున్నాడని అందురు. (1 కొరింథీయులు 15:32) అయినను, ఆసియాలో (ఎఫెసు ఉన్న ప్రాంతము) “అట్టి గొప్ప మరణమునుండి దేవుడు నన్నుతప్పించెను” అని పౌలు చెప్పినమాట మానవవ్యతిరేకతకన్న ఎరేనాలో నిజమైన దుష్టమృగములతోగల అనుభవమునకు సరిపోతున్నది.—2 కొరింథీయులు 1:8-10; 11:23; అ.కార్యములు 19:23-41.

[29వ పేజీలోని బాక్సు/చిత్రం]

బహుమానమును దృష్టియందుంచుకొనుము: ప్రాముఖ్యమైన అంశములను వివరించుటకు పురాతన గ్రీకు ఆటలలోని కొన్ని అంశాలను పౌలు ఉపయోగించెను. (1 కొరింథీయులు 9:24-27) ప్రతిరెండు సంవత్సరములకు కొరింథు దగ్గర జరుగు ఇస్తుమియన్‌ ఆటలలోని కార్యక్రమంలో పరుగెత్తుట, బాక్సింగ్‌, మరియు ఇతర విషయములుండేవి. ఈ పోటీలకు సిద్ధపడుతూనే పరుగెత్తువారు, బాక్సింగ్‌ చేయువారు వ్యక్తిగత నిగ్రహమును, ఆరోగ్యకరమైన ఆహారమును తీసుకొనుట, పదినెలలవరకు ఏమాత్రము ద్రాక్షారసము త్రాగకుండునట్టివాటిని అభ్యసించవలసియున్నారు. ఇస్తుమియన్‌ ఆటలలో జయము పొందినవారికి ధరింపజేయు ఏనుగు దంతము లేక దేవదారు కర్రతోచేయబడిన క్షయమగు హారము కంటే, అభిషక్త క్రైస్తవుడు అక్షయమైన అమరత్త్వ జీవకీరీటము కొరకు పోరాడును. ఆ బహుమానమును సంపాదించుటకు తన దృష్టిని గురిపైనే నిలిపి ఆశానిగ్రహమును పాటించవలెను. అలాగే భూసంబంధమైన నిత్యజీవముపై గురిపెట్టుకొన్న యెహోవాసాక్షులకును అదే సూత్రము వర్తించును.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి